అన్వేషించండి
Advertisement
Weather Update Today:బంగాళాఖాతంలో వాయుంగుండం- ఆంధ్రప్రదేశ్‌కు వర్ష సూచన - తెలంగాణలో చలి పంజా
Latest Weather : బంగాళాఖాతంలో ఇవాళ వాయుగుండం ఏర్పడే అవకాశం ఉంది. దీంతో ఏపీకి వర్ష సూచన పొంచి ఉంది. మరోవైపు తెలంగాణలో చలి పంజా విసురుతోంది.
Andhra Pradesh And Telangana Weather Todays: తెలుగు రాష్ట్రాలు చలి పులి పంజా విసురుతోంది. రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతోంది. మంచు కూడా విపరీతంగా కురుస్తోంది. ఉదయాన్నే పొగమంచు ఊపిరి ఆడనివ్వడం లేదు. తెలంగాణలో ఈ వారం రోజుల్లో వర్షాల ప్రభావం లేనప్పటికీ ఆంధ్రప్రదేశ్‌కు మాత్రం వర్ష సూచన కనిపిస్తోంది.
తెలంగాణలో వాతావరణం (Telangana Weather):
బుధవారం కనిష్ట ఉష్ణోగ్రత మెదక్ జిల్లాల్లో నమోదైంది. ఇక్కడ 11.8 డిగ్రీలుగా నమోదైనట్టు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఉష్ణోగ్రత గుర్తించదగిన తగ్గుదల అంటే 1.6 డిగ్రీల నుంచి మూడు డిగ్రీల మధ్య కనిష్ఠ ఉష్మోగ్రత పడిపోయిన ప్రాంతాలు ఆదిలాబాద్, భద్రాచలం, హకీంపేట, ఖమ్మం. రామగుండం, పటాన్‌చెరు. సాధారణం కంటే తక్కువ అంటే మూడు నుంచి ఐదు డిగ్రీల వరకు కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోయిన ప్రాంతాలు హన్మకొండ, మెదక్ ఉన్నాయి.
వివిధ ప్రాంతాల్లో నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రాంతం | గరిష్ట ఉష్ణోగ్రత (సెల్సియస్‌లో) | కనిష్ట ఉష్ణోగ్రత (సెల్సియస్‌లో) | తేమ శాతం | |
1 | ఆదిలాబాద్ | 28.8 -1 | 12.2 | 88 |
2 | భద్రాచలం | 30.4 | 17.5 | 91 |
3 | హకీంపేట | 28.1 | 15.2 | 58 |
4 |
దుండిగల్
|
29.8 | 15.6 | 67 |
5 |
హన్మకొండ
|
30.0 | 14.5 | 90 |
6 |
హైదరాబాద్
|
29.4 | 15.7 | 62 |
7 |
ఖమ్మం
|
32.0 | 17.8 | 84 |
8 |
మహబూబ్‌నగర్
|
29.2 | 18.0 | 75 |
9 |
మెదక్
|
30.1 | 11.8 | 71 |
10 |
నల్గొండ
|
29.5 | 18.4 | 82 |
11 |
నిజామాబాద్
|
31.5 | 15.8 | 81 |
12 |
రామగుండం
|
29.2 | 14.6 | 90 |
13 |
పటాన్‌చెరు
|
29.2 | 12.6 | 91 |
14 |
రాజేంద్రనగర్
|
29 | 13.5 | 86 |
15 |
హయత్‌నగర్
|
29 | 14 | 88 |
హైదరాబాద్‌లో వాతావరణం (Weather Update Hyderabad)
హైదరాబాద్‌లో చలి తీవ్రత పెరిగింది. మిగతా వాతావరణం నార్మల్‌గానే ఉంది. వర్ష సూచన లేదు. కనిష్ట అండ్ గరిష్ఠ ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి.
ఆంధ్రప్రదేశ‌్‌లో వాతావరణం (Andhra Pradesh Weather Update): హిందూ మహాసముద్రం, దక్షిణ అండమాన్ సముద్రంపై ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఇవాళ ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇది పశ్చిమ-వాయువ్య దిశగా పయనించబోతోంది. తదుపరి 2 రోజుల్లో దక్షిణ బంగాళాఖాతంలోని మధ్య భాగాలపై వాయుగుండంగా మారే అవకాశం ఉంది.
బంగాళాఖాతంలో జరుగుతున్న మార్పులు, వాయుగుండం కారణంగా మంగళ, బుధవారాల్లో కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కరుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాయలసీమలో కూడా అక్కడక్కడ భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉంది.
వర్షాలు కురిసే అవకాశం ఉందని అందుకే రైతులు పంట కోతల విషయంలో జాగ్రత్తగా ఉండాలని అదికారులు సూచిస్తున్నారు. వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు. రైతులు పంట పొలాల్లో నిలిచిన అదనపు నీటిని బయటకు పోయేలా ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపారు. పండించిన ధాన్యాన్ని సురక్షిత ప్రదేశాల్లో ఉంచాలని హితవుపలికారు. ఉద్యానవన పంట మొక్కలు/చెట్లు పడిపోకుండా సపోర్టు ఏర్పాటు చేసుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో వివిధ ప్రాంతాల్లో నమోదు అయిన ఉష్ణోగ్రతల వివరాలు
ప్రాంతం | గరిష్ట ఉష్ణోగ్రత (సెల్సియస్‌లో) | కనిష్ట ఉష్ణోగ్రత (సెల్సియస్‌లో) | తేమ శాతం | |
1 |
కళింగపట్నం
|
29 | 17.5 | 78 |
2 |
విశాఖపట్నం
|
30.6 | 22.1 | 66 |
3 |
తుని
|
32.2 | 20.2 | 78 |
4 |
కాకినాడ
|
30.3 | 19.8 | 83 |
5 |
నర్సాపురం
|
31.8 | 20 | 71 |
6 |
మచిలీపట్నం
|
32.2 | 21.2 | 86 |
7 |
నందిగామ
|
31.2 | 17.1 | 95 |
8 |
గన్నవరం
|
29.7 | 20.2 | 79 |
9 |
అమరావతి
|
31.7 | 18.8 | 86 |
10 |
జంగమేశ్వరపురం
|
31.4 | 16 | 91 |
11 |
బాపట్ల
|
30.8 | 19 | 89 |
12 |
ఒంగోలు
|
30.9 | 22.4 | 74 |
13 |
కావలి
|
31.2 | 21.8 | 79 |
14 |
నెల్లూరు
|
31.5 | 22.6 | 80 |
15 |
నంద్యాల
|
31.6 | 18.2 | 87 |
16 |
కర్నూలు
|
31.8 | 18.7 | 78 |
17 |
కడప
|
30.4 | 18.9 | 88 |
18 |
అనంతపురం
|
30.8 | 17.3 | 91 |
19 |
ఆరోగ్యవరం
|
26.5 | 16.5 | 89 |
20 |
తిరుపతి
|
32.1 | 20.6 | 81 |
Also Read: ఏపీబీజేపీకి త్వరలో కొత్త అధ్యక్షుడు - ఈ నలుగురిలో ఒకరికి చాన్స్
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
ఎడ్యుకేషన్
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement