అన్వేషించండి

Furiosa Movie Review: ఫ్యూరియోసా రివ్యూ: ‘మ్యాడ్ మ్యాక్స్’ ప్రీక్వెల్ ఎలా ఉంది? ఫస్ట్ పార్ట్ రేంజ్‌లో ఆకట్టుకుందా?

Furiosa A Mad Max Saga Review: ‘మ్యాడ్ మ్యాక్స్’ ఫ్యూరియోసా కథ ఎలా ఉంది? అన్యా టేలర్ జాయ్, క్రిస్ హెమ్స్‌వర్త్ ఎలా నటించారు? మొదటి భాగం స్థాయిలో ఆకట్టుకుందా? ఫ్యూరియోసా పాత్రలో అన్యా ఎలా నటించారు?

Furiosa A Mad Max Saga Movie Review in Telugu
సినిమా రివ్యూ: ఫ్యూరియోసా: ఎ మ్యాడ్ మాక్స్ సాగా
రేటింగ్: 2.75/5
నటీనటులు: అన్యా టేలర్ జాయ్, క్రిస్ హెమ్స్‌వర్త్ తదితరులు 
ఛాయాగ్రహణం: సైమన్ డగన్
కథ, స్క్రీన్‌ప్లే: జార్జ్ మిల్లర్, నికో లాథౌరిస్
సంగీతం: టామ్ హోల్కెన్‌బర్గ్
నిర్మాణ సంస్థలు: కెనెడీ మిల్లర్ మిషెల్, విలేజ్ రోడ్‌షో పిక్చర్స్
దర్శకత్వం: జార్జ్ మిల్లర్ 
2015లో వచ్చిన ‘మ్యాడ్ మ్యాక్స్: ఫ్యూరీ రోడ్’ యాక్షన్ సినిమాల్లో ఒక బెంచ్ మార్క్. వరల్డ్ సినిమాలోనే కాకుండా తెలుగు సినిమా మేకర్స్‌ని కూడా ‘మ్యాడ్ మ్యాక్స్’ ఇన్‌ఫ్లుయెన్స్ చేసింది. ఇప్పుడు తొమ్మిది సంవత్సరాల తర్వాత ‘మ్యాడ్ మ్యాక్స్: ఫ్యూరీ రోడ్’కు ప్రీక్వెల్‌గా ‘ఫ్యూరియోసా: ఎ మ్యాడ్ మాక్స్ సాగా’ సినిమాను విడుదల చేశారు మేకర్స్. మొదటి మ్యాడ్ మ్యాక్స్‌లో ప్రధాన పాత్ర ఫ్యూరియోసా గతమే ఈ ‘ఫ్యూరియోసా’. ‘థోర్’, ‘ఎక్స్‌ట్రాక్షన్’ లాంటి సినిమాతో ఇండియన్ ఆడియన్స్‌కు దగ్గరైన క్రిస్ హెమ్స్‌వర్త్ ఇందులో విలన్ పాత్ర పోషించారు. మరి ఇంతకీ ఈ సినిమా ఎలా ఉంది?

కథ: భూమి మీద సారం అంతా అయిపోయి మొత్తం ఎడారిగా మారే కాలంలో జరిగే కథ ఇది. కాస్త పచ్చగా ఉండే ప్రదేశంలో చిన్నప్పటి ఫ్యూరియోసా (అన్యా టేలర్ జాయ్) తన తల్లి మేరీతో (చార్లీ ఫ్రేజర్) కలిసి జీవిస్తూ ఉంటుంది. ఫ్యూరియోసాను ఒక బైకర్ గ్యాంగ్‌కు చెందిన ముఠా సభ్యులు ఎత్తుకుపోతారు. ఈ గ్యాంగ్‌కు డెమెంటస్ (క్రిస్ హెమ్స్‌వర్త్) నాయకుడు. ఫ్యూరియోసాను కాపాడటానికి వచ్చిన తల్లి మేరీని డెమెంటస్ అతి దారుణంగా ఫ్యూరియోసా కళ్ల ముందే హత్య చేస్తాడు. ఎంతటి నిస్సారమైన భూమిలో అయినా పండగల విత్తనాన్ని మేరీ అంతకు ముందే ఫ్యూరియోసాకు ఇస్తుంది.

డెమెంటస్ అనుకోకుండా సిటాడెల్ అనే మరో రాజ్యం వాళ్లతో తలపడతాడు. వారు సంధికి వచ్చినప్పుడు సిటాడెల్ రాజు ఇమ్మోర్టన్ జో (లాచీ హుల్మే) అడిగాడని ఫ్యూరియోసాను వారికే ఇచ్చేస్తాడు డెమెంటస్. అక్కడి నుంచి కూడా తప్పించుకున్న ఫ్యూరియోసా మగ వేషంలో బతకడం ప్రారంభిస్తుంది. ఒకరోజున అనుకోకుండా సిటాడెల్ సైన్యాధిపతి అయిన ప్రిటోరియన్ జాక్‌ను (టామ్ బుర్క్) పెద్ద దాడి నుంచి కాపాడుతుంది ఫ్యూరియోసా. ఆ దాడిలో తన సైన్యం అంతా చనిపోవడంతో ఫ్యూరియోసాను తన కుడి భుజంగా ఉండిపోమని జాక్ అడుగుతాడు. డెమెంటస్‌పై పగ తీర్చుకోవచ్చన్న ఉద్దేశంతో ఫ్యూరియోసా అందుకు ఒప్పుకుంటుంది. ఫ్యూరియోసా కథ చివరికి ఏం అయింది? డెమెంటస్‌ను అంతం చేసిందా? తన తల్లి ఇచ్చిన విత్తనాన్ని ఏం చేసింది? ఇవన్నీ తెలియాలంటే ‘ఫ్యూరియోసా: ఎ మ్యాడ్ మాక్స్ సాగా’ను చూడాల్సిందే!

విశ్లేషణ: సినిమా రిజల్ట్ ఎలా ఉన్నప్పటికీ మంచి థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే సినిమాలు కొన్ని ఉంటాయి. అందులో ‘ఫ్యూరియోసా: ఎ మ్యాడ్ మాక్స్ సాగా’ను కూడా చేర్చవచ్చు. విజువల్స్, సౌండ్, యాక్షన్ డిజైన్ ఇలా అన్నీ గ్రాండ్‌గా, వినూత్నంగా ఉండి కొత్త ఎక్స్‌పీరియన్స్ ఇస్తాయి. ‘ఫ్యూరియోసా: ఎ మ్యాడ్ మాక్స్ సాగా’లో యాక్షన్ సీన్లు మాత్రం నెక్స్ట్ లెవల్. ప్రతి యాక్షన్ సీన్‌లోనూ తన ఇంటెలిజెన్స్‌తో ఆడియన్స్ వావ్ అనేలా చేస్తాడు జార్జ్ మిల్లర్.

ఫ్యూరియోసా చిన్ననాటి సన్నివేశాలతో సినిమా కాస్త ఆహ్లాదంగా మొదలవుతుంది. కానీ పూర్తి స్థాయిలో స్టోరీలోకి వెళ్లడానికి ఎక్కువ సమయం తీసుకోలేదు. ప్రారంభం అయిన 10 నిమిషాల్లోనే ఫ్యూరియోసాను డెమెంటస్ గ్యాంగ్ ఎత్తుకుపోవడం, తల్లి మేరీ వాళ్లను ఫాలో అవుతూ రావడం ఇలా ఇంట్రస్టింగ్‌గా సాగుతుంది. దాదాపు గంట వరకు సమయం ఫ్యూరియోసా చిన్నతనంలోనే సాగిపోతుంది. అంటే అసలు హీరోయిన్ ఎంట్రీ ఇంటర్వెల్‌కు కాస్త ముందు వస్తుందన్న మాట. కానీ అప్పటి దాకా విలన్ పాత్రలో కనిపించిన క్రిస్ హెమ్స్‌వర్త్ ఆడియన్స్‌ను పూర్తి స్థాయిలో ఎంటర్‌టైన్ చేస్తాడు. థోర్‌గా సూపర్ యాక్షన్ హీరోగా మనందరం చూసిన క్రిస్ హెమ్స్‌వర్త్‌కు భిన్నంగా ఇందులో ఈవిల్ వెర్షన్‌లో కనిపిస్తాడు.

సినిమాలో యాక్షన్ సీన్లు అద్భుతంగా వచ్చాయి కానీ అవీ మరీ లెంతీగా ఉంటాయి. ముఖ్యంగా ఛేజ్‌లు నిడివి బాగా ఎక్కువ ఉన్నట్లు అనిపిస్తాయి. సెకండాఫ్‌లో వచ్చే క్లైమ్యాక్స్ ఛేజ్ అయితే ఎడారిలో అలా సాగుతూనే ఉంటుంది. యాక్షన్ సీన్లు బాగా వచ్చాయి అని ఎడిట్ చేయకుండా అలా ఉంచేశారేమో మరి. ఇది ‘మ్యాడ్ మ్యాక్స్: ఫ్యూరీ రోడ్’కు పర్‌ఫెక్ట్ ప్రీక్వెల్. ఈ సినిమా ఎక్కడ ముగుస్తుందో సరిగ్గా ‘మ్యాడ్ మ్యాక్స్: ఫ్యూరీ రోడ్’ అక్కడ మొదలవుతుంది.

Also Readకృష్ణమ్మ మూవీ రివ్యూ: జీవితంలో అన్నీ కోల్పోయిన అనాథ ఎదురు తిరిగితే... కత్తి పడితే... కొరటాల సమర్పణలో సత్యదేవ్ సినిమా ఎలా ఉందంటే?

టెక్నికల్‌గా చూస్తే... ‘ఫ్యూరియోసా: ఎ మ్యాడ్ మాక్స్ సాగా’లో సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ నెక్స్ట్ లెవల్. ఒక ఫ్యూచరిస్టిక్ సినిమాను చూస్తున్న అనుభూతిని విజువల్స్ కలిగిస్తాయి. అలాగే మ్యూజిక్ అదే ఫీలింగ్‌ని మన చెవులకు అందిస్తుంది. 

ఇక నటీనటుల విషయానికి వస్తే... చిన్నప్పటి ఫ్యూరియోసాగా అలైలా బ్రౌనీ, పెద్దయ్యాక ఫ్యూరియోసాగా అన్యా టేలర్ జాయ్ కనిపిస్తారు. ఆ ఫ్యూరియోసా క్యారెక్టర్‌లో ఉండే వెయిట్‌ని వీరిద్దరూ చక్కగా క్యారీ చేశారు. వీరే డైరెక్ట్‌గా చేస్తే ఎటువంటి ప్రెజర్ ఉండకపోయేది కానీ ఈ పాత్రలో 2015లోనే చార్లెజ్ థెరాన్ అద్భుతంగా నటించారు. కాబట్టి దాన్ని మ్యాచ్ చేయాల్సిన బాధ్యత వీరిపై పడింది. దానికి వీరిద్దరూ చక్కగా న్యాయం చేశారు. సినిమాలో మరో ప్రధాన పాత్ర డెమెంటస్ పాత్రలో కనిపించిన క్రిస్ హెమ్స్‌వర్త్‌ది. ఇప్పటివరకు హీరోగానే పరిచయం ఉన్న క్రిస్ ఇందులో విలన్‌గా కనిపిస్తారు. మిగతా పాత్రధారులందరూ తమ పాత్రకు చక్కగా న్యాయం చేశారు.

ఓవరాల్‌గా చెప్పాలంటే... ఫ్యూచరిస్టిక్ యాక్షన్ సినిమాలు, సైన్స్‌ఫిక్షన్ సినిమాలు మీకు నచ్చేలా అయితే దీన్ని కచ్చితంగా థియేటర్లలో చూడాల్సిందే. ‘మ్యాడ్ మ్యాక్స్’ లవర్స్‌ను అయితే ‘ఫ్యూరియోసా’ మరింత ఎంటర్‌టైన్ చేస్తుంది.

Also Readవిద్య వాసుల అహం రివ్యూ: AHA OTTలో కొత్త సినిమా... రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ జోడీ చేసిన రొమాన్స్ ఎలా ఉందంటే?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TGPSC Group III: తెలంగాణలో గ్రూప్‌-3 పరీక్ష ప్రారంభం- అడ్రెస్ తప్పిన అభ్యర్థులను ఎగ్జామ్‌సెంటర్‌కు చేర్చిన పోలీసులు
తెలంగాణలో గ్రూప్‌-3 పరీక్ష ప్రారంభం- అడ్రెస్ తప్పిన అభ్యర్థులను ఎగ్జామ్‌సెంటర్‌కు చేర్చిన పోలీసులు
Delhi Minister Kailash Gehlot Resigns : ఢిల్లీలో గేమ్ స్టార్ట్ చేసిన బీజేపీ- ఆప్‌లో మొదటి వికెట్‌ డౌన్ - రాజీనామా చేసిన మంత్రి కైలాష్‌ గెహ్లాట్‌ తీవ్ర ఆరోపణలు
ఢిల్లీలో గేమ్ స్టార్ట్ చేసిన బీజేపీ- ఆప్‌లో మొదటి వికెట్‌ డౌన్ - రాజీనామా చేసిన మంత్రి కైలాష్‌ గెహ్లాట్‌ తీవ్ర ఆరోపణలు
BRS BJP Alliance: బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
Amaravati Master Plan: అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడుసఫారీలను సెంచరీతో చితక్కొట్టిన సంజూ శాంసన్

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TGPSC Group III: తెలంగాణలో గ్రూప్‌-3 పరీక్ష ప్రారంభం- అడ్రెస్ తప్పిన అభ్యర్థులను ఎగ్జామ్‌సెంటర్‌కు చేర్చిన పోలీసులు
తెలంగాణలో గ్రూప్‌-3 పరీక్ష ప్రారంభం- అడ్రెస్ తప్పిన అభ్యర్థులను ఎగ్జామ్‌సెంటర్‌కు చేర్చిన పోలీసులు
Delhi Minister Kailash Gehlot Resigns : ఢిల్లీలో గేమ్ స్టార్ట్ చేసిన బీజేపీ- ఆప్‌లో మొదటి వికెట్‌ డౌన్ - రాజీనామా చేసిన మంత్రి కైలాష్‌ గెహ్లాట్‌ తీవ్ర ఆరోపణలు
ఢిల్లీలో గేమ్ స్టార్ట్ చేసిన బీజేపీ- ఆప్‌లో మొదటి వికెట్‌ డౌన్ - రాజీనామా చేసిన మంత్రి కైలాష్‌ గెహ్లాట్‌ తీవ్ర ఆరోపణలు
BRS BJP Alliance: బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
Amaravati Master Plan: అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
IPL 2025 Mega Auction: 2 కోట్ల బేస్ ప్రైస్‌తో ఐపీఎల్‌ మెగా ఆక్షన్‌కు వచ్చే ప్లేయర్ల లిస్ట్ ఇదే
2 కోట్ల బేస్ ప్రైస్‌తో ఐపీఎల్‌ మెగా ఆక్షన్‌కు వచ్చే ప్లేయర్ల లిస్ట్ ఇదే
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Pushpa 2 Trailer: మైండ్ బ్లాక్ అయ్యేలా బీహార్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్... ఇవాళ సాయంత్రమే 'పుష్ప 2' ట్రైలర్ విడుదల
మైండ్ బ్లాక్ అయ్యేలా బీహార్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్... ఇవాళ సాయంత్రమే 'పుష్ప 2' ట్రైలర్ విడుదల
Pushpa 2 Trailer Launch Live Updates: అల్లు అర్జున్ అంటే మినిమమ్ ఉంటుంది మరి... 'పుష్ప 2' ట్రైలర్ లాంచ్ అప్డేట్స్
అల్లు అర్జున్ అంటే మినిమమ్ ఉంటుంది మరి... 'పుష్ప 2' ట్రైలర్ లాంచ్ అప్డేట్స్
Embed widget