Tips to Stay Calm: కోపాన్ని కంట్రోల్ చేసుకునేందుకు తొమ్మిది చిట్కాలు...
కోపం మనిషికున్న భావోద్వేగాలలో ఒకటి. కానీ అది ఎక్కువైతే మాత్రం అనర్థమే.
ప్రతి మనిషికి కోపం అనే ఫీలింగ్ ఉంటుంది. అది ఎప్పుడు పడితే అప్పుడు బయటికి రాదు. కొన్ని సందర్బాల్లో ఎవరైనా మాటలతో రెచ్చగొట్టినప్పుడో, ఇరిటేట్ చేసినప్పుడో వస్తుంది. అయినా కోపం అనర్థమే కానీ, లాభం ఉండదు. అందుకే కొన్ని సందర్భాల్లో ఆగ్రహాన్ని ఆపుకోవడం చాలా ముఖ్యం. కోపం వస్తున్నప్పుడు ఈ తొమ్మిది చిట్కాలను పాటించండి. వీటిలో ఒకట్రెండు పాటించినా మంచి ఫలితం ఉండొచ్చు.
1. కోపం వస్తున్నట్టు అనిపిస్తే వెంటనే వెళ్లే గ్లాసుడు నీళ్లు తాగేయాలి. నీళ్లు శరీరంలోకి చేరాక కోపం వచ్చే లక్షణాలను తగ్గిస్తాయి.
2. మీ శ్వాసపై దృష్టి పెట్టండి. ఉచ్ఛ్వాస నిచ్ఛ్వాసాలపై ఫోకస్ చేయండి. అలా చేయడం వల్ల మీరు వెంటనే రియాక్ట్ అవ్వరు.
3. కోపంగా రియాక్ట్ అవ్వకుండా ఒకటితో మొదలెట్టి ఆగ్రహం బయటకు రాకుండా ఉండేలా లెక్కపెడుతూనే ఉండండి. ఒక్కోసారి వంద అంకెలు కూడా లెక్కపెట్టాల్సి ఉంటుంది.
4. గొడవకు కారణమయ్యే సంభాషణ ఇంట్లో అవుతున్నప్పుడు మిమ్మల్ని మీరే డైవర్ట్ చేసుకోండి. మీకు ఇష్టమైన పనిచేసుకోండి. వంట చేయడం, డ్యాన్స్... ఇలా. మీకు అమితంగా ఇష్టపడే అంశాల గురించి ఆలోచించడం మొదలుపెట్టండి.
5. కోపం ఎందుకు వస్తుందో ఒకసారి మీకు మీరే చెక్ చేసుకోండి. తరచూ చిన్నచిన్న విషయాలకే వస్తుంటే యోగా, ధ్యానం చేసుకోవాలి.
6. మీకు ఒకే వ్యక్తితో తరచూ గొడవ అవుతుంటే... ఆ వ్యక్తిని మీరు మార్చలేరనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. కోప్పడినా, గొడవపడినా ఫలితం లేనప్పుడు ఆ పని చేయాల్సిన అవసరం లేదనే భావన మీలో నాటుకుపోవాలి. అలా అయితే ఆ వ్యక్తి మీమీద అరిచినా మీకు వెంటనే రాదు... ‘వీడింతే’ అనుకుని వెళ్లిపోతారు.
7. ఇక భరించలేనంతగా ఇరిటేట్ చేస్తుంటే అక్కడ్నించి మీరు వెళ్లిపోవడం ఉత్తమం.
8. ఇంట్లోనే వ్యక్తే నిత్యం ఇరిటేట్ చేస్తుంటే పట్టించుకోవడం మానేయాలి. మీ పని మీరు చేసుకుని పోవాలి తప్ప, వారు అనే మాటలు వినడం, వాటికి సమాధానం ఇవ్వడం చేయకూడదు. అవసరమైతే తప్ప నోరు విప్పకూడదు.
Also read: అప్పుడప్పుడు ఆయిల్ మసాజ్... ఇమ్యూనిటీ పెరగడంతో పాటూ ఇంకా ఎన్నో లాభాలు
Also read: తిని పడేసే చాక్లెట్ రేపర్‌పై దేవుడి ఫోటో... ఏకిపడేసిన నెటిజన్లు, సారీ చెప్పిన నెస్ట్లే ఇండియా
Also read: కరోనాలాంటి వైరస్‌లను అంతం చేయలేం... పర్యావరణంలో భాగంగా కలిసిపోవడమే వాటి ముగింపు, WHO కీలక వ్యాఖ్యలు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి.