Sesame Seeds: రోజుకు రెండు స్పూనుల నువ్వులు... బరువు తగ్గించడమే కాదు, గుండెపోటునూ అడ్డుకుంటాయి

చలికాలంలో తప్పకుండా తినాల్సిన ఆహార జాబితాలో నువ్వుల పేరు కచ్చితంగా ఉంటుంది.

FOLLOW US: 

నువ్వులు ప్రాచీన కాలం నుంచి భారతీయ ఆహారంలో భాగంగా ఉన్నాయి. కానీ ఆధునిక కాలంలో వీటి వాడకం చాలా తగ్గిపోయింది. కేవలం సలాడ్‌ల మీద టాపింగ్‌గానో, లేక బర్గర్ పైన టాపింగ్‌గానో వాడుతున్నారు. కానీ వీటిని రోజూ తినాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. అలా అని రోజూ అధికంగా తినకూడదు. కేవలం రెండు స్పూనులు తింటే చాలు. అధ్యయనం ప్రకారం రోజుకు రెండు స్పూనుల నువ్వులు తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు 8 నుంచి 16 శాతం తగ్గుతాయి. మొత్తంగా కొవ్వు శాతాన్ని 8 శాతం వరకు తగ్గిస్తాయి. 

ఎలా కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి?
చెడు కొలెస్ట్రాల్, టైగ్లిజరైడ్స్ స్థాయిలను నియంత్రించడంలో నువ్వులు అత్యంత ప్రభావవంతమైనవి. నువ్వుల్లో లభించే సెసమిన్ చిన్న పేగులో కొలెస్ట్రాల్ శోషణను అడ్డుకుంటుంది, అలాగే కొలెస్ట్రాల్‌ను తయారుచేయడంలో భాగమైన ఎంజైమ్ పనితీరును కూడా నిరోధిస్తుంది. అలాగే నువ్వుల్లో ఉండే ఆల్ఫాలినోలిక్ ఆమ్లం కూడా ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. నువ్వుల్లో లభించే సొల్యుబల్ ఫైబర్ (కరిగే ఫైబర్) రక్తంలో ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. ఈ మొత్తం ప్రక్రియ బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. రెండు మూడు నెలల్లోనే ఈ మార్పు ప్రత్యక్షంగా కనిపిస్తుంది. 

నువ్వుల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, ప్రోటీన్, విటమిన్ ఇ, మాంగనీస్ అధికంగా ఉంటాయి, చక్కెర తక్కువ స్థాయిలో ఉంటుంది. కాబట్టి చలికాలంలో వీటిని తింటే ఎంతో మేలు. ఆయుర్వేదం ప్రకారం నువ్వులు మధుమేహం, ప్రేగు వ్యాధి, అధిక రక్తపోటుపై ప్రభావవంతంగా పనిచేస్తుంది. 

ఏ రూపంలో తినాలి?
నువ్వులను ఒక నిమిషం పాటూ వేయించుకుని వంటల్లో భాగం చేసుకోవచ్చు. లేదా సలాడ్ పై రెండు స్పూనుల వేయించిన నువ్వులు చల్లుకుని తినవచ్చు. వంటల్లో నువ్వుల నూనెను ఉపయోగించినా మంచిదే. లేదంటే రెండు స్పూనుల వేయించిన నువ్వులను నోట్లో వేసుకున్నా చాలు. ఏదో రకంగా రోజూ నువ్వులు శరీరంలోకి చేరాలి. 

గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.

Also read: సింగిల్ మెన్‌కు బ్యాడ్ న్యూస్... అలా ఒంటరిగా జీవిస్తే ఆరోగ్యసమస్యలు అధికంగా వచ్చే అవకాశం, కొత్త అధ్యయన ఫలితం

Also read: ఈ కాయల పేరేమిటో తెలుసా? ఎక్కడైనా కనిపిస్తే వదలకండి, ముఖ్యంగా మధుమేహ రోగులు...

Also read: నెగిటివ్ వచ్చినా వాసనా రుచి తెలియడం లేదా... అయితే ఇలా చేయండి

Also read: ‘ఊ అంటావా మావా’కు స్టెప్పులేసిన టాంజానియా పిలగాడు, అతడు ఎంత పాపులర్ అంటే...

Also read: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చీజ్ ఇది... తయారయ్యేది గాడిద పాలతో, రుచి అదిరిపోతుంది

 ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌  చేయండి.

Tags: Sesame Seeds Benefits of sesame seeds Weight loss sesame seeds Seeds benefits

సంబంధిత కథనాలు

Icecream Headache: ఐస్‌క్రీము తలనొప్పి గురించి తెలుసా? ఎంతో మందికి ఉన్న సమస్యా ఇది

Icecream Headache: ఐస్‌క్రీము తలనొప్పి గురించి తెలుసా? ఎంతో మందికి ఉన్న సమస్యా ఇది

PreDiabetes: ప్రీడయాబెటిస్ స్టేజ్‌లో ఉన్న యువతలో గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, తేల్చిన అంతర్జాతీయ అధ్యయనం

PreDiabetes: ప్రీడయాబెటిస్ స్టేజ్‌లో ఉన్న యువతలో గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, తేల్చిన అంతర్జాతీయ అధ్యయనం

Diabetes: డయాబెటిస్ ఉంటే మటన్ తినకూడదంటారు, ఎందుకు?

Diabetes: డయాబెటిస్ ఉంటే మటన్ తినకూడదంటారు, ఎందుకు?

Faluda: ఇంట్లోనే టేస్టీ ఫలూదా, చేయడం చాలా సింపుల్

Faluda: ఇంట్లోనే టేస్టీ ఫలూదా, చేయడం చాలా సింపుల్

Family Health Survey : దక్షిణాదిలో రసికులు ఏపీ మగవాళ్లేనట - కనీసం నలుగురితో ...

Family Health Survey : దక్షిణాదిలో రసికులు ఏపీ మగవాళ్లేనట - కనీసం నలుగురితో ...

టాప్ స్టోరీస్

KTR Davos Tour: నేడు స్విట్జర్లాండ్‌కు మంత్రి కేటీఆర్, 10 రోజులపాటు విదేశీ పర్యటన - షెడ్యూల్ ఇదీ

KTR Davos Tour: నేడు స్విట్జర్లాండ్‌కు మంత్రి కేటీఆర్, 10 రోజులపాటు విదేశీ పర్యటన - షెడ్యూల్ ఇదీ

Prabhas: ప్రభాస్‌కు కండిషన్లు పెట్టిన దర్శకుడు?

Prabhas: ప్రభాస్‌కు కండిషన్లు పెట్టిన దర్శకుడు?

Karate Kalyani Exclusive Interview:బిడ్డపై క్లారిటీ, ఇక ప్రాంక్ పైనే నా పోరాటం|ABP Desam

Karate Kalyani Exclusive Interview:బిడ్డపై క్లారిటీ, ఇక ప్రాంక్ పైనే నా పోరాటం|ABP Desam

Vijay Devarakonda Samantha: కశ్మీర్ కుర్రాడికి, తమిళ అమ్మాయికి ముడి వేసిన 'ఖుషి'

Vijay Devarakonda Samantha: కశ్మీర్ కుర్రాడికి, తమిళ అమ్మాయికి ముడి వేసిన 'ఖుషి'