Madras Thorn: ఈ కాయల పేరేమిటో తెలుసా? ఎక్కడైనా కనిపిస్తే వదలకండి, ముఖ్యంగా మధుమేహ రోగులు...
మెట్రో సిటీల్లో పుట్టి పెరిగినవారికి ఈ కాయల గురించి తెలిసి ఉండదు. వీటిని ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా పిలుస్తారు.
గ్రామాల్లో కచ్చితంగా కనిపించే చెట్టు ఇది. అప్పట్లో రోడ్ల పక్కన ఈ చెట్టు కాయలను రాళ్లతో కొడుతూ పిల్లలు కనిపించేవారు. వీటి రుచి మామూలుగా ఉండదు. ఇంతకీ వీటిని ఏమంటారో గుర్తొచ్చిందా? సీమ చింతకాయలు. వీటిని మనీలా టామరిండ్, మద్రాస్ టోర్న్, డెవిల్స్ నెక్లస్, జంగిల్ జలేబి... ఇలా రకరకాల ఇతర పేర్లతో కూడా పిలుస్తారు. నిజంగా నెక్లెస్ లాగే అల్లినట్టు ఉంటాయి ఈ సీమ చింతకాయలు. లేత గులాబీ రంగులోకి మారిన తరువాత వీటిని తింటే రుచి అదిరిపోతుంది. ఇప్పుడు ఇవి దొరకడం చాలా కష్టమైపోతోంది. ఎవరూ ఈ చెట్లను ప్రత్యేకంగా పెంచడం లేదు. దీంతో దొరకడమే కష్టంగా మారింది. ఒకవేళ దొరికితే మాత్రం తినకుండా వదలకండి. ముఖ్యంగా మధుమేహ రోగులకు వీటివల్ల బోలెడంత ఆరోగ్యం.
బరువు తగ్గేందుకు
దీనిలో విటమిన్ సి, డైటరీ ఫైబర్, సపోనిన్స్‌తో నిండిన సీమ చింతకాయలు బరువు తగ్గేందుకు సహకరిస్తాయి. ఇందులో డైటరీ ఫైబర్ పొట్ట నిండిన ఫీలింగ్‌ను కలిగిస్తుంది. ఆకలిని తగ్గిస్తుంది. దీని వల్ల సహజంగానే బరువు తగ్గుతారు.
నియంత్రణలో మధుమేహం
వీటిలో ఫైటో కెమికల్స్ ఉండడం వల్ల మధుమేహులకు మేలు జరుగుతుంది. డయాబెటిక్ లక్షణాలను తగ్గేలా చేస్తుంది. వీటిని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.
కాలేయానికి...
ఈ కాయలు కాలేయానికి ఎంతో మంచి చేస్తాయి. కాలేయం పనితీరును మెరుగుపరచడంతో పాటూ, హానికరమైన టాక్సిన్లను తొలగిస్తాయి.
ప్రేగు సమస్యలకు
యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ మైక్రోబయల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో నిండి ఉంటాయి సీమ చింతకాయలు. ఈ గుణాలు ప్రేగులోని సమస్యలను ప్రభావవంతంగా ఎదుర్కొంటుంది. వీటిలో ఉండే ఒలియానోలిక్ యాసిడ్ సహజంగానే ప్రేగు పనితీరును మెరుగుపరుస్తుంది.
క్యాన్సర్ రాకుండా...
అధ్యయనం ప్రకారం సీమచింతకాయల ఆకులలో క్యాన్సర్ నిరోధక లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఆ ఆకుల్లోని గుణాలు రొమ్ము క్యాన్సర్ నివారించడంలో, క్యాన్సర్ కణాలు ఏర్పడకుండా అడ్డుకోవడంతో ముందుంటాయి.
Also read: నెగిటివ్ వచ్చినా వాసనా రుచి తెలియడం లేదా... అయితే ఇలా చేయండి
Also read: ఉప్పు వేసిన ఆహారం అధికంగా తిన్నారా... అయితే వెంటనే వీటిని తినండి, రిస్క్ తగ్గుతుంది
Also read: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చీజ్ ఇది... తయారయ్యేది గాడిద పాలతో, రుచి అదిరిపోతుంది
Also read: నాన్‌స్టిక్ పాన్‌పై గీతలు పడ్డాయా? అయితే వాటిని పడేయాల్సిందే, లేకుంటే క్యాన్సర్ కారకాలుగా మారచ్చు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి.