Chicken During Fever: జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినకూడదా? హ్యాపీగా తినవచ్చు... కానీ ఈ జాగ్రత్తలతో...
జ్వరం వస్తే చాలా మంది చికెన్ తినకూడదని చెబుతుంటారు. అదెంత వరకు నిజమో తెలుసుకుందాం.
జ్వరం వస్తే చికెన్‌కు చాలా మంది దూరంగా ఉంటారు. పిల్లలకు పెట్టరు, పెద్దలు తినరు. తింటే పచ్చకామెర్లు వంటి ఇతరత్రా రోగాలు వస్తాయని చెబుతుంటారు. కానీ ఇదంతా అపోహ అంటున్నారు వైద్యులు. అనారోగ్యంతో ఉన్నప్పుడు అన్ని రకాల పోషకాలు శరీరానికి అందడం అత్యవసరం. రోగనిరోధక వ్యవస్థ అప్పటికే బలహీనపడి ఉంటుంది. కాబట్టి శరీరాన్ని రక్షించడానికి దానికి మరింత బలం అవసరం. అందుకు మంచి పోషకాలున్న ఆహారం తినాలి. ఆ సమయంలో జీర్ణ ప్రక్రియ కూడా మందగిస్తుంది. కాబట్టి వైద్యులు తేలికపాటి ఆహారాన్ని తినమని చెబుతుంటారు. దీంతో జ్వరం రాగానే చాలా మంది కూరలు తినడం మానేస్తారు. రసం అన్నం తినడానికే ఇష్టపడతారు. కానీ రసం అన్నం వల్ల శరీరానికి అంతే పోషకాలు తక్కువ. కాబట్టి జ్వరం వచ్చిన సమయంలో కూడా జీర్ణంగా సులువుగా అరిగేలా కూరలు వండుకుని తినాలి.
చికెన్ తినకూడదా?
జ్వరంతో బాధపడుతున్నప్పుడు చికెన్ తినడం సురక్షితమే. కానీ ఏ రూపంలో ఆ చికెన్ ను తింటున్నారు అనేదే ముఖ్యం. బాగా మసాలాలు దట్టించిన చికెన్ కూరలు, వేపుళ్లు, బిర్యానీలు జ్వరం వచ్చిన సమయంలో తింటే అనారోగ్యమే కలుగుతుంది. అందుకే ఆ సమయంలో చికెన్‌ను తక్కువ నూనెతో మసాలాలు లేకుండా వండుకుని తినాలి. సూప్ చేసుకుంటే మరీ మంచిది. ఇది ప్రొటీన్, ఫైబర్‌తో నిండి ఉంటుంది. జ్వరంతో బాధపడుతున్న ఈ రెండు అవసరమైన పోషకాలు.
చికెన్ సూప్‌తో లాభాలు...
జ్వరంతో బాధపడుతున్న వారికి ఉత్తమమైన వంటకం చికెన్ సూప్. చికెన్లోని ప్రొటీన్ మీ శరీరం త్వరగా కోలుకునేందుకు సహకరిస్తుంది. తగినంత శక్తిని అందిస్తుంది. చికెన్‌లో సూప్‌లో ద్రవాలు, ఎలక్ట్రోలైట్‌లు ఉంటాయి. ఇవి మీ శరీరాన్ని తేమవంతంగా ఉంచుతాయి. జలుబు, దగ్గు నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
ఈ చికెన్ వంటకాలు తినొచ్చు...
జ్వరం సమయంలో కారం, మసాలాలు తగ్గించి వండిన ఏ వంటకాలైనా తినొచ్చు. చికెన్ సలాడ్, గ్రిల్డ్ చికెన్, చికెన్ టిక్కా వంటివి మితంగా తినవచ్చు.
బయట వండినవి వద్దు
చికెన్ తినమన్నారు కదా అని కెఎఫ్‌సి నుంచి ఆర్డరిచ్చుకోవచ్చనుకోకండి. వాటిలో మసాలాలు, నూనె, క్రీమ్ అధికంగా వాడతారు. ఇలాంటి వాటిని తింటే మరింతగా ఆరోగ్యం దిగజారుతుంది. ఇవి జీర్ణం కాక కడుపునొప్పి వంటివి రావచ్చు. చికెన్ నగ్గెట్స్, చికెన్ లాలీపాప్, చిల్లీ చికెన్, చికెన్ షావర్మ లాంటి... బయటదొరికే వంటకాల జోలికి పోకండి.
Also read: మానసిక హింసకు గురైన మహిళల్లో బ్రోకెన్ హార్ట్ వచ్చే అవకాశం... ఏంటీ బ్రోకెన్ హార్ట్?
Also read: రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ప్రేమ పెళ్లి... 81వ పెళ్లిరోజు జరుపుకున్న ప్రపంచ వృద్ధ దంపతులు
Also read: ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన మద్యం ఇది... వేదాలలో కూడా దీని ప్రస్తావన?
Also read: ఎండుద్రాక్షల్లా కనిపించే వీటిని తింటే కళ్లద్దాల అవసరం రాదట... కంటిచూపును కాపాడే దివ్యౌషధాలు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి.