Alcohol: ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన మద్యం ఇది... వేదాలలో కూడా దీని ప్రస్తావన?
మద్యాన్ని ప్రాచీన కాలం నుంచి తాగుతున్నట్టు పురాణాల ద్వారా తెలుస్తోంది.
ఆల్కహాలిక్ పానీయాలు తాగడం అనేది ప్రపంచ చరిత్రలో చాలా పురాతన అంశాలలో ఒకటి. భారతదేశంలో కూడా చాలా ప్రాచీన కాలం నుంచి రకరకాల ఆల్కహాలిక్ పానీయాలు అందుబాటులో ఉన్నాయి. అందులో ఒకటి మీడ్. దీన్నే హనీ వైన్ లేదా పులియబెట్టిన తేనె పానీయం అని కూడా పిలుస్తారు. ఇది తాగితే కిక్కు ఎక్కేదట. అందుకే ఆల్కహాలిక్ పానీయంగా చెబుతారు. దీని తయారీలో కొన్ని సుగంధ ద్రవ్యాలను, ధాన్యాలను కూడా వాడేవారు. చరిత్రకారులు చెప్పినదాన్ని బట్టి చూస్తే మీడ్‌ను ఐరోపా, ఆఫ్రికా, ఆసియా ఖండాల్లోని ప్రజలు తాగేవారని తెలుస్తోంది. అంతేకాదు ఇదే అన్నింటికన్నా ప్రాచీన ఆల్కాహాలిక్ పానియమని కూడా చెబుతున్నారు చరిత్ర కారులు.
రుగ్వేదంలో అలా...
ప్రాచీన గ్రంథమైన రుగ్వేదంలో కూడా దీని ప్రస్తావన ఉన్నట్టు చెబుతారు. అందులో ఈ పానీయాన్ని ‘సోమ’ అన్న పేరుతో పిలిచారట. రుగ్వేదంలోని కొన్ని శ్లోకాలలో సోమ అనే పదం కనిపిస్తుంది. పురాతన గ్రీకులు ఈ పానీయాన్ని దేవతల పానీయంగా భావించి తాగేవారు.
‘ద ఓల్డెస్ట్ ఆల్కహాలిక్ బేవరేజ్’ అనే పుస్తకం రాసిన రచయితలు రాజ్కో విద్రిహ్, జాంబే హ్రిబార్ చెప్పిన ప్రకారం మీడ్ ఉత్పత్తికి సంబంధించిన తొలి పురావస్తు ఆధారాలు సుమారు 7000BC నాటివి. అలాగే చైనాలోని హెనాన్ ప్రావిన్స్ లోని జియాహూ అనే నియోలిధిక్ గ్రామంలో 9000 సంవత్సరాల నాటి కుండల్లో మద్యపానీయ అవశేషాలు లభించాయి. మీడ్‌ను అప్పట్లో అడవి ద్రాక్ష పండ్లు, తేనె, బియ్యంతో తయారుచేసేవారని తెలుస్తోంది. తరువాత ప్రాచీన ఈజిప్టు, గ్రీస్, రోమన్ సామ్రాజ్యాలలో, మధ్యయుగ ఐరోపాలలో ఉత్పత్తి చేసేవారు.
ఇప్పటికీ తాగుతున్నారు...
ఇప్పటికీ మీడ్‌ను చాలా దేశాల్లో తాగుతున్నారు. తేనె, తాజా ఈస్ట్, నిమ్మరసం, నీరు, కలపడం ద్వారా దీన్ని తయారుచేసి అమ్ముతున్నారు. దాదాపు ఏడాది పాటూ పులిశాక అప్పుడు తాగుతారు.
ఆరోగ్య ప్రయోజనాలు
ప్రాచీనకాలంలో మీడ్‌ను అద్భుతపానీయంగా, వైద్యానికి ఔషధంగా ఉపయోగించేవారు. ఈ పానీయానికి కొన్ని మూలికలు కలపడం ద్వారా టానిక్ గా మార్చేవారు. ఇది గ్లూటెన్ రహిత పానీయం. అలా అని ఎక్కువ మోతాదులో తాగకూడదు. మితంగా తాగితే శరీరానికి మంచిదే అంటున్నారు ఆహారనిపుణులు.
గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.
Also read: ఈ మూడు పానీయాలు త్వరగా బరువు తగ్గేలా చేస్తాయి
Also read: ఎండుద్రాక్షల్లా కనిపించే వీటిని తింటే కళ్లద్దాల అవసరం రాదట... కంటిచూపును కాపాడే దివ్యౌషధాలు
Also read: పండ్లు తిన్న వెంటనే నీళ్లు తాగుతున్నారా? ఈ సమస్యలు తప్పవు, ముఖ్యంగా డయాబెటిక్ వారు...
Also read: నా పేరు కోవిడ్... నేను వైరస్‌ను కాను, పేరుతో ఆ కోటీశ్వరుడికి కష్టాలు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి.