By: ABP Desam | Updated at : 17 Jan 2022 12:57 PM (IST)
Edited By: harithac
(Image credit: Pixabay)
బరువు తగ్గాలనుకుంటే సరిపోదు, అందుకు తగిన శ్రమ కూడా అవసరం. ముఖ్యంగా తినే ఆహారం, తాగే పానీయాలను ప్రత్యేకంగా ఎంపిక చేసుకోవాలి. అవి పోషణతో పాటూ, శరీరంలో కొవ్వును కరిగించేదిగా, కొవ్వు పేరుకుపోకుండా అడ్డుకునేదిగా ఉండాలి. అందుకు కొన్ని పానీయాలు తాగడం చాలా ముఖ్యం. అవి శరీరంలోని మలినాలను శుభ్రం చేస్తాయి. బరువు త్వరగా తగ్గేందుకు సహకరిస్తాయి.
దాల్చిన చెక్క - హనీ డ్రింక్
ఈ రెండు కలిసి ఎంతటి ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయో ఊహించలేం. దాల్చిన చెక్కలో యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టిరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఎక్కువ. ఇక తేనె... యాంటీ ఆక్సిడెంట్ల పవర్ హౌస్ అనే చెప్పాలి. గోరువెచ్చని నీటిలో దాల్చిన చెక్క పొడి, తేనె కలిపి గోరువెచ్చగా తాగాలి. ఈ పానీయం బరువు వేగంగా తగ్గేలా చేస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంతో పాటూ, చర్మ వ్యాధులకు చికిత్స చేస్తుంది.
నిమ్మ-అల్లం డ్రింక్
ఈ డిటాక్స్ డ్రింక్ శరీరంలో విషపదార్థాలను సమర్థవంతంగా బయటకు పంపిస్తుంది. పరిశోధనల ప్రకారం అల్లం ఆకలిని తగ్గిస్తుంది, అలాగే నిమ్మ రసంలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ డిటాక్స్ డ్రింక్ తయారుచేయడానికి ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో సగం నిమ్మరసం, రెండు అంగుళాల తురిమిని అల్లం కలపాలి. ఇలా గ్లాసు నీళ్లని రోజూ తాగడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది.
కీరాదోస-పుదీనా డ్రింక్
పోషక గుణాలతో పాటూ అద్భుతమైన రుచిని కలిగి ఉండే మరో అద్భుత పానీయం ఇది. ఒక గ్లాసు నీళ్లలో కొన్ని సన్నగా తురిమిన దోసకాయ ముక్కలు, సన్నగా తరిగిన పుదీనాను జోడించాలి. కాసేపు ఆ గ్లాసు నీళ్లను అలా వదిలేయాలి. ఓ అరగంట తరువాత తాగేయాలి. ఇది బరువు తగ్గడానికే కాదు, రక్తపోటును తగ్గించడానికి, క్యాన్సర్‌ను నివారించడానికి కూడా సహాయపడుతుంది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.
Also read: ఎండుద్రాక్షల్లా కనిపించే వీటిని తింటే కళ్లద్దాల అవసరం రాదట... కంటిచూపును కాపాడే దివ్యౌషధాలు
Also read: బ్రేక్‌ఫాస్ట్‌లో గుడ్లు, పాలు కలిపి తింటున్నారా? ఈ సమస్య ఉన్న వాళ్లు తినకూడదు
Also read: పండ్లు తిన్న వెంటనే నీళ్లు తాగుతున్నారా? ఈ సమస్యలు తప్పవు, ముఖ్యంగా డయాబెటిక్ వారు...
Also read: నా పేరు కోవిడ్... నేను వైరస్‌ను కాను, పేరుతో ఆ కోటీశ్వరుడికి కష్టాలు
Also read: బరువు తగ్గించి, శక్తిని పెంచే ప్రోటీన్ షేక్.. ఇంట్లో ఇలా సులువుగా తయారుచేయచ్చు
Also read: కాఫీ తాగే పద్దతి ఇది... మీ ఆరోగ్యం కోసం ఈ చిట్కాలు పాటించాల్సిందే
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి.
Protein Laddu: పిల్లలకు రోజూ ఒక ప్రొటీన్ లడ్డూ, ఎలా చేయాలంటే
Rainbow Island: సప్తవర్ణాల దీవి, అందులోని మట్టితో సాస్, మసాలాల తయారీ
Asafoetida: ఇంగువ మన దేశంలో ఇంతవరకు పండించలేదు, మరెలా మన వంటల్లో భాగమైంది?
Kids Fever: చంటి పిల్లలకు జ్వరంతో పాటూ ఫిట్స్ వచ్చిందా? వెంటనే ఇలా చేయండి
Corona Virus: ఈ లక్షణాలు కరోనా వైరస్వే, చాలా మందికి వీటిపై అవగాహన లేదు
CM Jagan Davos Tour : దావోస్ తొలిరోజు పర్యటనలో సీఎం జగన్ బిజీబిజీ, డబ్ల్యూఈఎఫ్ తో పలు ఒప్పందాలు
CM KCR : బీజేపీని ప్రశ్నిస్తే దేశద్రోహులు అనే ముద్ర, కేంద్రంపై సీఎం కేసీఆర్ ఫైర్
Wild Poliovirus case : ఆఫ్రికాలో వైల్డ్ పోలియో వైరస్ కలవరం, 30 ఏళ్ల తర్వాత మొజాంబిక్ లో తొలి కేసు నమోదు!
IPL 2022 Play Offs Schedule: ప్లేఆఫ్స్‌లో ఎవరితో ఎవరు తలపడుతున్నారు? మ్యాచ్‌లు ఎప్పుడు ?