అన్వేషించండి

Goji Berries: ఎండుద్రాక్షల్లా కనిపించే వీటిని తింటే కళ్లద్దాల అవసరం రాదట... కంటిచూపును కాపాడే దివ్యౌషధాలు

గోజి బెర్రీల్లో ఎన్నో సుగుణాలు ఉన్నాయి. తింటే చాలా ఆరోగ్య లాభాలు కలుగుతాయి.

వయసు పైబడుతున్న కొద్దీ చాలా రోగాలు దాడిచేస్తుంటాయి. వాటిలో ముఖ్యమైనది కంటి చూపు మందగించడం. కంటి చూపు సమస్యలు రాకుండా ఉండాలే ఎండు గోజి బెర్రీలను డైట్ లో చేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇవెక్కడ దొరుకుతాయో అని దీర్ఘంగా ఆలోచించకండి... ఆన్‌లైన్ షాపుల్లో అందుబాటులో ఉన్నాయి. ‘డ్రైడ్ గోజి బెర్రీస్’ అని వెతికితే చాలు ఇట్టే దొరికేస్తాయి.  వీటి ధర క్వాలిటీని బట్టి 200 గ్రాములు రూ.300 నుంచి మొదలవుతాయి. 

ఇంతవరకు మనం బీటా కెరాటిన్ అధికంగా ఉంటే క్యారెట్లు వంటి వాటిని కంటి చూపు కోసం తినేవాళ్లు.  క్యారెట్లను మించిన మేలు గోజి బెర్రీలు చేస్తాయి. ఇవి లైసియం, చినెన్స్, లైసియం బార్బరమ్ అని పిలిచే రెండు రకాల పొదలకు కాసే చిన్న పండ్లు. వీటిని ఎండబెట్టి చైనీయులు డబ్బాల్లో దాచుకుంటారు. సూప్‌లలో వీటిని వేసుకుని తింటారు. అలాగే చిరుతిళ్లుగా కూడా ఉపయోగిస్తారు. చైనీస్ వైద్యంలో కూడా వీటిని వినియోగిస్తారు. వీటిలో జియాక్సంతిన్ లభిస్తుంది. దీన్ని శరీరం వెంటనే గ్రహించి వినియోగించుకుంటోంది. 

అధ్యయనం ఏం చెబుతుంది?
న్యూట్రియెంట్స్ జర్నల్ లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం ఎండిన గోజీ బెర్రీలను క్రమం తప్పకుండా తింటే  కళ్లల్లో మచ్చలు రావడం, సైట్ రావడం, ఇతర దృష్టి లోపాలు రాకుండా అడ్డుకుంటుంది. మధ్య వయసు నుంచే వీటిని తినడం ప్రారంభిస్తే పెద్ద వయసు వచ్చేటప్పుడు ఎలాంటి కంటి సమస్యలు, చూపు లోపాలు లేకుండా హాయిగా జీవించవచ్చు. గోజీబెర్రీలలో ఉండే లుటీన్, జియాక్సంతిన్లు హానికరమైన నీలి  కాంతిని ఫిల్టర్ చేసి యాంటీ ఆక్సిడెంట్ రక్షణను అందిస్తాయి. వృద్ధాప్యంలో చూపును రక్షించడంలో  సహాయపడతాయి. అంతేకాదు క్యాన్సర్, గుండె సంబంధిత రోగాల నుంచి కూడా కాపాడతాయి. 

గోజి బెర్రీలు టిబెట్, చైనాలలో అధికంగా పండుతాయి. అందుకే  వీటిని టిబెటన్ గోజి, హిమాలయన్ గోజి అని కూడా పిలుస్తారు. అయితే ప్రపంప వ్యాప్తంగా అధికంగా అమ్ముడయ్యేది మాత్రం చైనా నుంచే. చైనాలోని నింగ్జియా ప్రాంతమే ఈ గోజిబెర్రీల పుట్టినిల్లని చెబుతారు. వీటిని రోజుకు ఓ అర గుప్పెడు తిన్నా చాలు. 

గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.

Also read: బ్రేక్‌ఫాస్ట్‌లో గుడ్లు, పాలు కలిపి తింటున్నారా? ఈ సమస్య ఉన్న వాళ్లు తినకూడదు

Also read: పండ్లు తిన్న వెంటనే నీళ్లు తాగుతున్నారా? ఈ సమస్యలు తప్పవు, ముఖ్యంగా డయాబెటిక్ వారు...

Also read: నా పేరు కోవిడ్... నేను వైరస్‌ను కాను, పేరుతో ఆ కోటీశ్వరుడికి కష్టాలు

Also read: బరువు తగ్గించి, శక్తిని పెంచే ప్రోటీన్ షేక్.. ఇంట్లో ఇలా సులువుగా తయారుచేయచ్చు

Also read: కాఫీ తాగే పద్దతి ఇది... మీ ఆరోగ్యం కోసం ఈ చిట్కాలు పాటించాల్సిందే

 ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌  చేయండి.

టాప్ హెడ్ లైన్స్

Memory Boosting Tip : నిద్రలేమితో జ్ఞాపకశక్తి తగ్గుతుందా? అయితే రోజూ 20 నిమిషాలు ఏరోబిక్స్ చేయాలంటోన్న తాజా అధ్యయనం
నిద్రలేమితో జ్ఞాపకశక్తి తగ్గుతుందా? అయితే రోజూ 20 నిమిషాలు ఏరోబిక్స్ చేయాలంటోన్న తాజా అధ్యయనం
Apple vs Banana : యాపిల్ vs అరటిపండు.. బరువు తగ్గడానికి ఏది మంచిది? ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
యాపిల్ vs అరటిపండు.. బరువు తగ్గడానికి ఏది మంచిది? ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
Slim Waist Surgery : నడుమును సన్నగా చేసే రిబ్ మోడలింగ్ సర్జరీ.. ఎంత ప్రమాదమో తెలుసా?
నడుమును సన్నగా చేసే రిబ్ మోడలింగ్ సర్జరీ.. ఎంత ప్రమాదమో తెలుసా?
Best One-Year FD Rates : లక్ష రూపాయలను ఒక సంవత్సరానికి FDలో జమ చేస్తే ఏ బ్యాంకు ఎంత రాబడిని ఇస్తుంది?
లక్ష రూపాయలను ఒక సంవత్సరానికి FDలో జమ చేస్తే ఏ బ్యాంకు ఎంత రాబడిని ఇస్తుంది?

వీడియోలు

Ravi Shastri Backs Mohammed Shami | షమీకి తప్పని నిరాశ.. సెలెక్టర్ల తీరును తప్పుబట్టిన రవిశాస్త్రి
Mitchell Santner's Warning to Vaibhav Suryavanshi | వైభవ్ పై న్యూజిలాండ్ శాంట్నర్ సంచలన వ్యాఖ్యలు
Ravi Shastri Backs Struggling Rishabh Pant | రిషబ్ పంత్‌కు రవిశాస్త్రి కీలక సూచన
Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Elections: ఏపీలో స్థానిక పోరు- తీవ్ర ఉద్రిక్తతల మధ్య నామినేషన్లు.. సుప్రీం ఆదేశాలతో ఎస్ఈసీ నిర్ణయంపై ఉత్కంఠ!
ఏపీలో స్థానిక పోరు- తీవ్ర ఉద్రిక్తతల మధ్య నామినేషన్లు.. సుప్రీం ఆదేశాలతో ఎస్ఈసీ నిర్ణయంపై ఉత్కంఠ!
AP Odisha Cyclone Alert: తీవ్ర తుఫాను హెచ్చరిక - అక్టోబర్ 27-30 మధ్య కోస్తాంధ్ర-ఒడిశాపై ప్రతాపం - తెలంగాణలోనూ వర్షాలుంటాయా?
తీవ్ర తుఫాను హెచ్చరిక - అక్టోబర్ 27-30 మధ్య కోస్తాంధ్ర-ఒడిశాపై ప్రతాపం - తెలంగాణలోనూ వర్షాలుంటాయా?
Vijayashanti : రాములమ్మ వ్యూహాత్మక మౌనం - ఎమ్మెల్సీ పదవి వచ్చినా కాంగ్రెస్‌లో విజయశాంతి ఎందుకు సైలెంట్?
రాములమ్మ వ్యూహాత్మక మౌనం - ఎమ్మెల్సీ పదవి వచ్చినా కాంగ్రెస్‌లో విజయశాంతి ఎందుకు సైలెంట్?
Teja Sajja : US అమ్మాయితో పెళ్లి - కన్ఫర్మ్ చేసిన తేజ సజ్జా... డెస్టినేషన్ వెడ్డింగ్ ఎప్పుడంటే?
US అమ్మాయితో పెళ్లి - కన్ఫర్మ్ చేసిన తేజ సజ్జా... డెస్టినేషన్ వెడ్డింగ్ ఎప్పుడంటే?
Nadendla Manohar Janasena: నాదెండ్ల మనోహర్ వైపే గురి - జనసేనలో పిఏసి అధినేతను టార్గెట్ చేస్తోంది ఎవరు?
నాదెండ్ల మనోహర్ వైపే గురి - జనసేనలో పిఏసి అధినేతను టార్గెట్ చేస్తోంది ఎవరు?
IND VS NZ Result Update: :  టీమిండియా స్ట‌న్నింగ్ విక్ట‌రీ.. కివీస్ పై తొలి టీ20లో ఘ‌న విజ‌యం.. స‌త్తా చాటిన సంజూ, శ్రేయ‌స్, న‌మ‌న్,  
టీమిండియా స్ట‌న్నింగ్ విక్ట‌రీ.. కివీస్ పై తొలి టీ20లో ఘ‌న విజ‌యం.. స‌త్తా చాటిన సంజూ, శ్రేయ‌స్, న‌మ‌న్,  
Pawan Kalyan Chandrababu Naidu Meeting : నో కన్వాయ్, నో సెక్యూరిటీ - చంద్రబాబు వద్దకు పవన్.. సుప్రీం తీర్పు వేళ సంచలన భేటీ!
నో కన్వాయ్, నో సెక్యూరిటీ - చంద్రబాబు వద్దకు పవన్.. సుప్రీం తీర్పు వేళ సంచలన భేటీ!
AICC Maha Garjana Delhi: నవంబర్ 1న హస్తినలో ఏఐసీసీ మహా గర్జన - హైదరాబాద్ సభ రద్దు వెనుక రాజకీయం ఇదేనా?
నవంబర్ 1న హస్తినలో ఏఐసీసీ మహా గర్జన - హైదరాబాద్ సభ రద్దు వెనుక రాజకీయం ఇదేనా?
Embed widget