Salt: ఉప్పు వేసిన ఆహారం అధికంగా తిన్నారా... అయితే వెంటనే వీటిని తినండి, రిస్క్ తగ్గుతుంది
ఉప్పు అధికంగా తింటే చాలా ప్రమాదం. ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.
ఒక్కోసారి వండిన వంటకాల్లో ఉప్పు ఎక్కువ పడిపోతుంది. అయినా సరే ఎలాగోలా తినేస్తూ ఉంటారు చాలా మంది. ఆహారం పడేయడం ఎందుకులే అన్న భావన వారిది. కానీ ఇలా ఉప్పు ఎక్కువైన ఆహారం తిన్నప్పుడు ఆ ఉప్పు ప్రభావం శరీరంపై తగ్గించాలంటే కొన్ని రకాల ఆహారాలను వెంటనే తినేయాలి. దీని వల్ల ఉప్పు వల్ల కలిగే రిస్క్ కాస్త తగ్గుతుంది. గుండె జబ్బులు, అధిక రక్తపోటు వంటి సమస్యలు కలిగిన వారు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి. అనుకోకుండా ఉప్పు అధికంగా తిన్నట్టు అయితే వెంటనే ఈ ఆహారాలను కూడా తినాలి.
1. అరటిపండు
పొటాషియం పుష్కలంగా ఉన్న ఆహారం అరటిపండు. ఉప్పు నిండిన ఆహారం తిన్నాక మీ రక్తపోటు స్థాయిలు పెరిగే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు అరటి పండు తింటే ఆ స్థాయిలు అదుపులో ఉంచేందుకు సహకరిస్తుంది. ఇందులో ఫైబర్ కూడా ఉంటుంది కాబట్టి, గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గించడంలో సహకరిస్తుంది.
2. పెరుగు
ఇందులో పొటాషియం ఉంటుంది. అధిక సోడియాన్ని ఎదుర్కోగల సత్తా దీనికి ఉంది. ఉప్పు అధికంగా ఉంది అనుకున్న ఆహారంలో దీన్ని కలుపుకుని తిన్నా, లేక తరువాత తిన్నా కూడా మంచి ఫలితమే ఉంటుంది. ఇది జీర్ణాశయాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది.
3. కివీ పండు
కాస్త తియ్యగా, పుల్లగా ఉండే ఈ పండులో కూడా పొటాషియం ఉంటుంది. శరీరంలో చేరిన సోడియాన్ని తటస్థీకరించడంలో ముందుంటుంది. కివీలో ఉండే ఎంజైమ్‌లు ప్రోటీన్‌ను విచ్ఛిన్నం చేయడంలో సహాయపడతాయి. కడుపు ఉబ్బరాన్ని కూడా తగ్గిస్తుంది.
4. అల్లం టీ
ఉప్పు అధికంగా తిన్నాం అనిపిస్తే వెంటనే అల్లం టీ చేసుకుని తాగేయాలి. ఇది శరీరంలోని సోడియం స్థాయిలను సమతుల్యం చేస్తాయి. ఇది జీర్ణక్రియను ప్రేరేపిస్తుంది. కడుపుబ్బరాన్ని అరికడుతుంది.
ఉప్పు ఎక్కువైతే లక్షణాలు ఇలా...
శరీరంలో సోడియం స్థాయిలు అధికంగా ఉంటే కొన్ని లక్షణాల ద్వారా ఆ విషయాన్ని కనిపెట్టవచ్చు. కడుపు ఉబ్బరంగా అనిపించడం, విపరీతంగా దాహం, తరచూ మూత్రానికి వెళ్లడం, బరువు పెరగడం, వాంతులు, గుండె రేటులో తేడా... ఈ లక్షణాలలో కనీసం రెండు కనిపించినా కూడా ఓసారి బ్లడ్ ప్రెషర్ చెక్ చేసుకోవాలి.
Also read: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చీజ్ ఇది... తయారయ్యేది గాడిద పాలతో, రుచి అదిరిపోతుంది
Also read: నాన్‌స్టిక్ పాన్‌పై గీతలు పడ్డాయా? అయితే వాటిని పడేయాల్సిందే, లేకుంటే క్యాన్సర్ కారకాలుగా మారచ్చు
Also read: మానసిక హింసకు గురైన మహిళల్లో బ్రోకెన్ హార్ట్ వచ్చే అవకాశం... ఏంటీ బ్రోకెన్ హార్ట్?
Also read: రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ప్రేమ పెళ్లి... 81వ పెళ్లిరోజు జరుపుకున్న ప్రపంచ వృద్ధ దంపతులు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి.