Nonstick Pans: నాన్‌స్టిక్ పాన్‌పై గీతలు పడ్డాయా? అయితే వాటిని పడేయాల్సిందే, లేకుంటే క్యాన్సర్ కారకాలుగా మారచ్చు
అందరి ఇళ్లల్లో నాన్‌స్టిక్ పాన్‌లు కనిపిస్తున్నాయి. వాటికీ ఒక ఎక్స్‌పైరీ డేట్ ఉంది.
నాన్ స్టిక్ పాన్‌లు కొన్నారో వాటిని ఎన్నాళ్లయినా పడేయరు చాలా మంది. వాటి కోటింగ్ పోయినా... తెల్లగా మారిపోయినా వాడేస్తుంటారు. కానీ అది చాలా ప్రమాదకరం. నాన్ స్టిక్ పాన్‌లకూ ఒక ఎక్స్‌పైరీ డేట్ ఉంది. వాటిని ఎప్పుడు పడేయాలో, పడేయకపోతే ఏమవుతుందో చూద్దాం.
నాన్ స్టిక్ పాన్లలో వండితే మాడే సమస్యా ఉండదు. అందుకే అవి అంత పాపులర్ అయ్యాయి. చూడటానికి కూడా అందంగా, స్టైలిష్ గా ఉండడంతో వాటిని కొనేవాళ్లు ఎక్కువైపోయారు. అయితే వాటిని వాడాక కొన్ని నెలలు, లేదా ఏళ్ల తరువాత కొన్ని సంకేతాలు కనిపించినప్పుడు ఆ పాన్లను వాడడం ఆపేయాలి.
పాన్లను ఎక్కువగా వాడినా లేదా వాటి క్వాలిటీ మంచిది కానప్పుడు అవి వంగినట్టు అవుతాయి. అలా వంగిన పాన్లను వాడకూడదు. ఇలా ఒకవైపు వంగిన పాన్లలోని ఆహారం ఏకరీతిగా ఉడకదు. దీనివల్ల జీర్ణ క్రియ సమస్యలు వస్తాయి.
క్యాన్సర్ కారకం...
పాన్‌ను కొన్ని రోజులు వాడాకా తెల్లని గీతలు కనిపిస్తాయి. అలా కనిపించినా కూడా ఆ పాన్‌ను పక్కన పడేయాల్సిందే. ఈ గీతలు అడుగు భాగంలో వేసిన కోటింగ్ పోతోందని చెప్పే సంకేతం. అధ్యయనాల ప్రకారం నాన్ స్టిక్ పాన్‌లను టెఫ్లాన్ ఉపయోగించి తయారుచేస్తారు. టెఫ్లాన్లో పెర్‌ఫ్లోరోఆక్టానిక్ యాసిడ్ అనే ప్రమాదకరమైన రసాయనం ఉంటుంది. ఇది క్యాన్సర్ కారకం. గీతలు పడుతోందంటే టెఫ్లాన్ ఉపరితలం దెబ్బతింటోందని అర్థం. ఊడిపోయిన ఉపరితలంలోని కోటింగ్ ఆహారంతో పాటూ కలిసి మన శరీరంలోకి చేరిపోతుంది. దీనివల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా పెరుగుతుంది.
ఈ సమయానికి మార్చేయండి
నాన్ స్టిక్ పాన్‌లు ఎలాంటి గీతలు పడకుండా ఉంటే అయిదేళ్ల పాటూ వాడవచ్చు. అయిదేళ్లయ్యాక గీతలు పడినా, పడకపోయినా మార్చేయడం ఉత్తమం. గీతలు పడితే మాత్రం వెంటనే వాడడం ఆపేయాలి.
Also read: జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినకూడదా? హ్యాపీగా తినవచ్చు... కానీ ఈ జాగ్రత్తలతో...
Also read: మానసిక హింసకు గురైన మహిళల్లో బ్రోకెన్ హార్ట్ వచ్చే అవకాశం... ఏంటీ బ్రోకెన్ హార్ట్?
Also read: రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ప్రేమ పెళ్లి... 81వ పెళ్లిరోజు జరుపుకున్న ప్రపంచ వృద్ధ దంపతులు
Also read: ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన మద్యం ఇది... వేదాలలో కూడా దీని ప్రస్తావన?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి.