By: ABP Desam | Updated at : 21 Jan 2022 08:32 AM (IST)
Edited By: harithac
(Image credit: Twitter)
ఎన్నో మతాలు, కులాలు కలిసిన మనదేశంలో దేవుడు అనే అంశం చాలా సున్నితమైనది. ఆ విషయం తెలిసి కూడా కొన్ని కంపెనీలు ఎందుకో... ప్రజల మనోభావాలతో ఆటలాడుతాయి. నెస్ట్లే సంస్థ తమ కిట్‌క్యాట్ చాక్లెట్ రేపర్‌పై జగన్నాథుడు, సుభద్ర, బలభద్రుడు చిత్రాలను ప్రచురించింది. వాటిని చూసిన నెటిజన్లు తీవ్రంగా వ్యతిరేకించారు. చాలా మంది చాక్లెట్లను తిన్నాక వాటిని డస్ట్ బిన్లు, రోడ్లపై పడేస్తారని... అవి తమకు బాధను కలిగిస్తాయంటూ కొంతమంది నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేశారు. అదే విషయాన్ని సోషల్ మీడియా సాక్షిగా నెస్ట్లే ఇండియాకు చేరేలా చేశారు.
ఒక ట్విట్టర్ యూజర్ కిట్‌క్యాట్ రేపర్ ఫోటోను పోస్టు చేసి ‘దయచేసి మీ కిట్‌క్యాట్ చాక్లెట్ కవర్లోని జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రమాతల ఫోటోలను తీసి వేయండి’ అని ట్విట్ చేశాడు. మరొకరు యూజర్ ‘మా ఒడిషా సంస్కృతిని, మా దేవుళ్లను కిట్ క్యాట్ ర్యాపర్ పై చూడడం ఆనందంగా ఉంది, కానీ ఒక్కసారి ఆలోచించండి.. చాక్లెట్ తిన్నాక ఆ రేపర్ ఎక్కడికి చేరుతుందో, డస్ట్ బిన్లలో వేస్తారు, రోడ్డుపై పడేస్తారు. వాటిపై నుంచి చాలా మంది నడుస్తారు.’ అని తన బాధకు అక్షర రూపాన్నిచ్చారు. ఇలా చాలా మంది నెటిజన్లు నెస్ట్లే ఇండియాపై తమ కోపాన్ని, అసహనాన్ని ప్రదర్శించారు. దీంతో ఆ కంపెనీ దిగిరాక తప్పలేదు.
Please remove the Lord Jagannath, Balabhadra and Mata Subhadra Photos In Your @kitkat Chocolate Cover . When People Are Finished The Chocolate They Are Through The Cover On Road, Drain, Dustbin, Etc . So Please Remove The Photos . @Nestle @NestleIndiaCare #Odisha#JayJagannath pic.twitter.com/9vFy0trazw
— Biswadeep Pradhan (@Biswadeep_bcjd) January 17, 2022
సారీ చెప్పిన సంస్థ
తమకు మతపరమైన మనోభావాలను దెబ్బతీసే ఉద్దేశం లేదని చెబుతూ నెస్ట్లే ఇండియా క్షమాపణులు చెబుతూ ట్వీట్ చేసింది. ఈ చాక్లెట్ల ప్యాకేజింగ్ ను గత ఏడాది ప్రారంభించి, కొన్ని రోజులకే రీకాల్ చేసినట్టు చెప్పింది. స్థానిక అందాలను అందరికీ పరిచయం చేసేందుకు ట్రావెల్ బ్రేక్ ప్యాక్‌ల పేరుతో వీటిని తయారుచేసినట్టు చెప్పింది. ఒడిశా సంస్కృతిని మరింత మందికి చేరువయ్యేలా చేయాలనూ ఇలా చేసినట్టు తెలిపింది.
‘మేము ఈ విషయంతో ముడిపడి ఉన్న సున్నిత అంశాలను అర్థం చేసుకున్నాము. మాకు తెలియకుండానే కొందరి మనోభావాలను దెబ్బతీసినందుకు బాధపడుతున్నాము. ఇప్పటికే ఈ ప్యాకెట్లను మార్కెట్ నుంచి ఉపసంహరించుకున్నాము’ అని ట్వీట్ చేసింది.
We do understand the sensitivity of the matter and regret if we have inadvertently hurt anyone’s sentiment. With immediate action we had already initiated withdrawal of these packs from the market. We thank you for your understanding and support. (3/3)
— We Care At Nestlé (@NestleIndiaCare) January 18, 2022
Also read: కరోనాలాంటి వైరస్‌లను అంతం చేయలేం... పర్యావరణంలో భాగంగా కలిసిపోవడమే వాటి ముగింపు, WHO కీలక వ్యాఖ్యలు
Also read: ఈ కాయల పేరేమిటో తెలుసా? ఎక్కడైనా కనిపిస్తే వదలకండి, ముఖ్యంగా మధుమేహ రోగులు...
Also read: నెగిటివ్ వచ్చినా వాసనా రుచి తెలియడం లేదా... అయితే ఇలా చేయండి
Silent Heart Attacks: చలికాలంలో హార్ట్ ఎటాక్ ముప్పు - ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త
Weight Loss Fruits: బరువు తగ్గాలా? ఈ పండ్లు తినండి, కొవ్వు కొవ్వొత్తిలా కరిగిపోతుంది
Stomach Cancer: కడుపులో ఇలా అనిపిస్తోందా? క్యాన్సర్ కావచ్చు - ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త
Nuvvula Chikki Recipe : పిల్లలకు చలికాలంలో నువ్వల చిక్కీ పెడితే ఎంతో మంచిది
Christmas Gift Ideas : క్రిస్మస్ స్పెషల్.. ఫ్రెండ్స్, ఫ్యామిలీ కోసం బడ్జెట్ ఫ్రెండ్లీ గిఫ్ట్స్ ఇవే
Revanth Reddy Resigns: రేవంత్ రెడ్డి రాజీనామా- ఢిల్లీకి వెళ్లి రిజైన్ లెటర్ అందజేత
KCR Surgery Success: మాజీ సీఎం కేసీఆర్ తుంటి మార్పిడి సర్జరీ సక్సెస్, బీఆర్ఎస్ శ్రేణులు హర్షం
Jr NTR: నెట్‌ఫ్లిక్స్ సీఈవోకు జూనియర్ ఎన్టీఆర్ ఆతిథ్యం - మధ్యాహ్నం బాగా గడిచిందంటూ ట్వీట్!
Free Bus Journey to Women: మహిళలకు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - మార్గదర్శకాలివే
/body>