By: ABP Desam | Updated at : 26 Jul 2022 07:49 PM (IST)
ఊపిరి పీల్చుకోవచ్చు - కామారెడ్డి యువకుడికి మంకీపాక్స్క సోకలేదు !
No MonkeyPox : కువైట్ నుంచి కామారెడ్డికి వచ్చిన యువకుడికి మంకీపాక్స్ నెగెటివ్‌గా నిర్ధారణ అయింది. పుణెలోని ఎన్ఐవీ ల్యాబ్‌లో బాధిత యువకుడి నమూనాలను పరీక్షించగా నెగెటివ్ అని తేలింది. నిన్న ఫీవర్ ఆస్పత్రిలో చేరిన యువకుడి నుంచి ఐదు రకాల నమూనాలను సేకరించి.. పుణె ల్యాబ్‌కు పంపారు. ఈ నెల 6వ తేదీన కువైట్ నుంచి వచ్చిన ఆ యువకుడు తీవ్ర నీరసానికి గురయ్యాడు. జ్వరంతో బాధపడ్డాడు. దీంతో కామారెడ్డిలోని ఓ ప్రయివేటు హాస్పిటల్‌కు వెళ్లాడు. శరీరంపై ఉన్న దద్దుర్లు మంకీపాక్స్ మాదిరిగా ఉండటంతో నోడల్ కేంద్రంగా ఉన్న ఫీవర్ హాస్పిటల్‌కు వచ్చాడు. బాధిత యువకుడికి మంకీపాక్స్ నెగెటివ్ అని నిర్ధారణ కావడంతో అటు వైద్యులు, ఇటు కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.
దేశంలో మంకీపాక్స్ వైరస్ సోకిన కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. కేరళలో మూడు కేసులు నమోదయ్యాయి. దీంతో అన్ని రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. జూలై 22 నాటికి సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రరోల్ అండ్ ప్రివెన్షన్ సంస్థ చెప్పిన ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 16,836 మందికి మంకీ పాక్స్ సోకినట్టు గుర్తించారు. ఇప్పుడు అంతర్జాతీయ వైద్యులంతా ఒక్కటై మంకీపాక్స్ విషయంలో క పరిశోధనలు చేస్తున్నారు.
మంకీపాక్స్ కేవలం లైంగికంగా మాత్రమే సంక్రమించే వ్యాధి కాదని, అది ఎలాంటి దగ్గరి శారీరక సంబంధం ద్వారానైనా సంక్రమించవచ్చని చెబుతున్నారు వైద్యులు. ఈ విషయాన్ని ప్రజలందరికీ తెలిసేలా చేయాలని అభిప్రాయపడుతున్నారు. లక్షణాలు ఉన్న వ్యక్తికి దగ్గరగా ఉన్న వారికే మంకీపాక్స్ సోకే అవకాశం ఉందన్నారు. గాలి ద్వారా మంకీపాక్స్ సోకదని, పెద్దగా దగ్గినప్పుడు వచ్చే తుంపర్ల ద్వారానే సోకే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మంకీపాక్స్ లక్షణాలతో విదేశాల నుంచి వచ్చిన వారు సమాచారం ఇవ్వాలన్నారు. 6 నుంచి 13 రోజుల్లో వ్యాధి లక్షణాలు బయటపడుతాయని వైద్యులు చెబుతున్నారు.
ఒంటి మీద దద్దుర్లు వస్తే ఒకప్పుడె స్మాల్ పాక్స్ అనో లేక చికెన్ పాక్స్ అనో అనుమానించేవారు. కానీ ఇప్పుడు మంకీ పాక్స్ ఏమో అని అనుమానించాల్సిన పరిస్థితి. మంకీ పాక్స్ ఆఫ్రికాలో పుట్టి అనేక దేశాలకు పాకింది. దీని లక్షణాలు స్మాల్ పాక్స్ లక్షణాలలాగే ఉండడంతో మళ్లీ స్మాల్ పాక్స్ ప్రపంచంలో అడుగుపెట్టిందేమో అన్న కంగారు కూడా కలుగుతోంది. మంకీ పాక్స్ ... ఈ వైరస్ సోకిన కోతి, ఎలుకలు, ఉడతలు నుంచి కూడా మనుషులకు వ్యాపిస్తుంది. ఆ జంతువు నుంచి వచ్చే ద్రవాలు, రక్తం, గాయాలతో ప్రత్యక్ష సంబంధం ఉంటే మనుషులకు వ్యాపిస్తుంది.
study: మాంసాహారం తినే మహిళలతో పోలిస్తే శాకాహార మహిళల్లోనే ఆ సమస్యలు ఎక్కువ
Bombay Blood Group: అత్యంత అరుదైనది బాంబే బ్లడ్ గ్రూప్, దానికి ఓ నగరం పేరు ఎలా వచ్చింది?
Global Healthcare Summit: గ్లోబల్ హెల్త్ సమ్మిట్‌లో పాల్గొనండి - ఏపీ సీఎం జగన్‌ను ఆహ్వానించిన ఎన్నారై డాక్టర్లు
Diabetes: డయాబెటిస్ ఉన్న వారు మద్యం తాగొచ్చా? తాగితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి
ఫిట్స్ ఎందుకొస్తాయి? రోగి చేతిలో తాళం చేతులు ఎందుకు పెట్టకూడదు? మూర్ఛ వచ్చిన వెంటనే ఏం చేయాలి?
Jagan Independence Day: 75 ఏళ్ల విజయ ప్రస్థానం మరపురానిది: ఏపీ సీఎం జగన్
KCR Flag Hoisting: గోల్కొండ కోటలో జెండా ఎగురవేసిన సీఎం కేసీఆర్, ఏమన్నారంటే?
India Independence Day 2022: కూతురుని, కొడుకుని ఒకేలా చూడకపోతే ఎలా? నారీశక్తికి అండగా నిలవండి - ప్రధాని మోదీ
Independence Day 2022: అంబానీ ఇంటిని చూశారా, మూడు రంగులతో ఎలా మెరిసిపోతోందో!