By: ABP Desam | Updated at : 26 Feb 2023 03:33 PM (IST)
Edited By: Soundarya
Image Credit: Pixabay
డయాబెటిస్ ఒక సైలెంట్ కిల్లర్. ఎంత సైలెంట్ గా వస్తుందో అంతే సైలెంట్ గా శరీరంలోని అవయవాలను ప్రభావితం చేస్తుంది. మధుమేహం వచ్చిన తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంచుకోవడానికి అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే షుగర్ లేవల్స్ పెరిగి గుండె, మూత్రపిండాల సమస్యలు, దృష్టి సంబంధిత సమస్యలు, ఆందోళన వంటి తీవ్రమైన సమస్యలను కలిగిస్తుంది. సాధారణంగా మధుమేహం వచ్చే ముందు అతిగా మూత్ర విసర్జన, అరికాళ్ళలో మంట ఎక్కువగా అందరూ అనుభవిస్తారు. ఇవే షుగర్ వస్తుందనేందుకు సంకేతాలు అనుకుంటారు. కానీ ఇవే కాదు శరీరం కొన్ని ఆశ్చర్యకరమైన లక్షణాలు కూడా చూపిస్తుంది. వాటిని పసిగట్టి సరైన చికిత్స తీసుకుంటే మధుమేహం బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు.
కొన్ని గణాంకాల ప్రకారం 30 మిలియన్లకు పైగా అమెరికన్లు డయాబెటిస్ తో పోరాడుతున్నారు. వారిలో 7.3 మిలియన్ల మందికి అసలు డయాబెటిస్ ఉందనే విషయమే తెలియదట. ఒక్క అమెరికా మాత్రమే కాదు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచంలోని ఎంతో మంది మధుమేహం బారిన పడి ఇబ్బందులు పడుతున్నారు. డయాబెటిస్ రావడానికి ముందు పొద్దున్నే కొన్ని సంకేతాలు చూపిస్తుంది. అవేంటంటే..
మీరు నిద్రలేవగానే నోరు తడి ఆరిపోయి పొడిగా ఉండి విపరీతమైన దాహంతో ఉంటే రక్తంలో చక్కెర స్థాయిలు చాలా ఎక్కువగా ఉన్నాయని అర్థం. దీర్ఘకాలం పాటు మీరు ఇదే సమస్య ఎదుర్కొంటే మాత్రం వెంటనే వైద్యులని సంప్రదించి చికిత్స తీసుకోవాలి. నోరు పొడి బారిపోవడం వల్ల చెడు శ్వాస, పెదాలు పగిలిపోవడం, నోట్లో పుండ్లు, గొంతు లేదా నోటిలో మంటగా అనిపించడం, నమలడం లేదా మింగడంలో ఇబ్బంది, మాట్లాడటంలో ఇబ్బందిగా ఉంటుంది.
అజీర్ణ సమస్యల వల్ల లేచిన వెంటనే వికారంగా అనిపిస్తుంది. తలనొప్పి, మైగ్రేన్ తో బాధపడుతున్నా ఇలాగే ఉంటుంది. అయితే అది సాధారణ వికారం కాదు. రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగాయని చెప్పేందుకు సంకేతం కావచ్చు. నిపుణులు అభిప్రాయం ప్రకారం గర్భవతి కాకపోయినా వికారంతో బాధపడుతుంటే డయాబెటిక్ కెటోయాసిడోసీస్ కారణంగా ఇది జరుగుతుంది. మధుమేహం తీవ్రమైన సమస్య ఇది. టైప్ 1 డయాబెటిస్ మొదటి సంకేతం కావచ్చు. ఇది వచ్చిన వాళ్ళు ఇన్సులిన్ ఉత్పత్తి చేసుకోలేరు. రక్తంలో చక్కెర చాలా ఎక్కువగా ప్రమాదకరమైన స్థాయికి తీసుకెళ్తుంది.
ఉదయాన్నే కళ్ళు తెరిచినప్పడు మసకగా అనిపించడం, చుట్టూ ఉన్న వస్తువులు అస్పష్టంగా కనిపించడం వంటివి ఎదురవుతుంది. అయితే ఇది దృష్టి లోపం వల్ల వచ్చిన సమస్య కాదు. డయాబెటిస్ వల్ల వచ్చింది అయ్యే అవకాశం ఉంది. రక్తంలో చక్కెర స్థాయిలు కంటి లెన్స్ విస్తరించడానికి కారణమవుతాయి. ఫలితంగా సరిగా చూడలేరు. షుగర్ లెవల్స్ అధికంగా ఉంటే ద్రవాలు కంటి బయటకి వెళ్లిపోతాయి. దీన్ని హైపర్ గ్లైసిమియా అని కూడా పిలుస్తారు. దీని వల్ల కన్ను ఉబ్బిపోతుంది.
షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉంటే నరాలను దెబ్బతీస్తుంది. రక్తప్రవాహానికి ఆటంకం ఏర్పరుస్తుంది. దీని వల్ల శరీర భాగాలను రక్తసరఫరా సరిగా లేకపోవడం వల్ల తిమ్మిరి, నొప్పులు సంభవిస్తాయి. ఇవి రోజువారీ కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తాయి. చాలా మందికి నిద్ర లేచిన వెంటనే ఒళ్ళు జలదరించినట్టుగా అనిపిస్తుంది. పాదాలలో ఎక్కువగా కనిపిస్తుంది.
⦿ నొప్పులు లేదా సున్నితంగా మారడం
⦿ కాళ్ళలో బలహీనత
⦿ కీళ్ల నొప్పులు
⦿ ఇన్ఫెక్షన్లు వంటివి కూడా ఎదురవుతాయి
రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పడిపోయినా లేదా పెరిగినా షివరింగ్(వణుకు) వస్తుంది. చెమటలు పట్టి చేతులు వణికిపోతాయి. మీలోను ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులని సంప్రదించడం ఉత్తమం.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేస్తున్నారా? గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుకుంటున్నట్టే
Mushrooms: ఈ పుట్టగొడుగును తింటే చికెన్ కర్రీ తిన్నట్టే ఉంటుంది, ఎక్కడైనా కనిపిస్తే వదలకండి
Energy Drinks: ఎనర్జీ డ్రింక్స్ తాగుతున్నారా? ఇక మిమ్మల్ని ఆ దేవుడే కాపాడాలి, ఎందుకంటే?
World Down Syndrome Day: పిల్లల్లో డౌన్ సిండ్రోమ్ ఎందుకు వస్తుంది? రాకుండా ముందే అడ్డుకోగలమా?
Acidity: పాలు తాగితే ఎసిడిటీ సమస్య తగ్గుతుందా? అది ఎంతవరకు నిజం?
పిల్లల్లో ఆత్మహత్య ఆలోచనలకు కారణం పెద్దలేనట - ఫోన్ స్క్రీన్స్‌తో ప్రాణహాని
AP News: మహిళా ఉద్యోగులకు ఏపీ సర్కార్ శుభవార్త - చైల్డ్ కేర్ లీవ్ ఎప్పుడైనా వాడుకోవచ్చని వెల్లడి
వడగళ్ల వానతో నష్టపోయిన ప్రాంతాల్లో పర్యటించనున్న సీఎం కేసీఆర్
CM Jagan : ఓ స్కిల్డ్ క్రిమినల్ చేసిన స్కామ్ స్కిల్ డెవలప్మెంట్, దేశంలోనే అతి పెద్ద కుంభకోణం - సీఎం జగన్
Kota Srinivasa Rao : డబ్బు కోసం మనిషి ప్రాణాలతో ఆడుకోవద్దు - మరణ వార్తపై కోట శ్రీనివాస రావు సీరియస్