News
News
X

Breakfast: బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేస్తున్నారా? గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుకుంటున్నట్టే!

ఉదయాన్నే అల్పాహారం తీసుకోవడం వల్ల రోజంతా చురుకుగా ఉంటారు. కానీ దాన్ని స్కిప్ చేశారంటే మాత్రం తీవ్రమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

FOLLOW US: 
Share:

బిజీ లైఫ్ షెడ్యూల్ వల్ల చాలా మంది బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేస్తూ ఉంటారు? పొద్దున్నే తినలేదు కదా అని ఆ వాటా కూడా మధ్యాహ్నం లాగించేస్తారు. దాని వల్ల పొట్ట బిర్రుగా అనిపించడమే కాదు ఇతర ఆరోగ్య సమస్యలు కూడా పలకరించేస్తాయి. తరచూ బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేయడం వల్ల దాని ప్రభావం రోగనిరోధక శక్తి మీద తీవ్రంగా పడుతుందని సరికొత్త అధ్యయనం వెల్లడించింది. అంతే కాదు అంటు వ్యాధులతో పోరాడటం కష్టం చేస్తుంది. గుండె జబ్బులను అభివృద్ధి చేసే అవకాశాన్ని పెంచుతుంది. మౌంట్ సినాయ్ కి చెందిన ఇకాన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ఇటీవల ఒక అధ్యయనం విడుదల చేసింది.

బ్రేక ఫాస్ట్ చేయకపోవడం వల్ల రోగనిరోధక కణాలకు హాని కలిగించే విధంగా మెదడు ప్రతిస్పందిస్తుందని ఈ అధ్యయనం వెల్లడించింది. అప్పుడప్పుడు ఉపవాసం చేయడం ఆరోగ్యకరమని అంటున్నారు. దీని వల్ల కలిగే ప్రయోజనాలు కూడా పుష్కలంగా ఉన్నాయని పలు ఆధారాలు ఉన్నాయి. అయితే బ్రేక్ ఫాస్ట్ తినకపోవడం వల్ల ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఉపవాసం ఉండటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునేందుకు రెండు ఎలుకల సమూహం మీద పరిశోధన జరిపారు.

పరిశోధన సాగింది ఇలా..

కొన్ని గంటల ఉపవాసం నుంచి 24 గంటల పాటు ఉపవాసం చేస్తే ఎటువంటి ప్రభావం ఉంటుందనేది గుర్తించారు. ఒక ఎలుకల సమూహానికి మేల్కొన్న వెంటనే అల్పాహారం ఇచ్చారు. మరొక సమూహానికి బ్రేక్ ఫాస్ట్ ఇవ్వలేదు. ఎలుకలు మేల్కొన్న దగ్గర నుంచి 4 - 8గంటల వరకు రెండు గ్రూపుల్లో రక్తనమూనాల్ని సేకరించి పరీక్షలు జరిపారు. బ్రేక్ ఫాస్ట్ చేసిన ఎలుకల సమూహంలోని మోనోసైట్ సంఖ్యలో తేడాను గమనించారు. ఇది ఎముకల మజ్జలో తయారవుతుంది. శరీరంలో తెల్ల రక్తకణాలతో పాటు శరీరమంతా ప్రయాణిస్తాయి. అంటు వ్యాధులతో పోరాడటం దగ్గర నుంచి గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన రోగాలను అడ్డుకోవడం వరకు కీలక పాత్ర పోషిస్తాయి.

బ్రేక్ ఫాస్ట్ చేయకపోతే వచ్చే అనార్థాలు  

బ్రేక్ ఫాస్ట్ చేయని ఎలుకల్లో తొలుత మోనోసైట్ లు ఉన్నాయి. కానీ నాలుగు గంటల తర్వాత అవి తగ్గిపోయాయి. ఎనిమిది గంటల తర్వాత పరిశీలిస్తే రక్తంలో అవి 90 శాతం కనుమరుగైనట్టు పరిశోధకులు గుర్తించారు. బ్రేక్ ఫాస్ట్ చేసిన్ సమూహంలో మాత్రం మోనోసైట్లలో ఎటువంటి మార్పులు లేవు. బ్రేక్ ఫాస్ట్ చేయని ఎలుకల్లో మోనోసైట్లు నిద్రాణస్థితికి అంటే తిరిగి ఎముక మజ్జకు ప్రయాణించాయని పరిశోధకులు కనుగొన్నారు. ఎముక మజ్జలో కొత్త కణాల ఉత్పత్తి తగ్గింది. 24 గంటల వరకు వాటికి ఎటువంటి ఆహారం ఇవ్వకుండా ఉపవాసం కొనసాగించారు. తర్వాత ఆహారాన్ని పెట్టగానే ఎముక మజ్జలో ఉన్న మోనోసైట్ కొన్ని గంటల్లోనే రక్తప్రవాహంలోకి చేరాయి. ఇలా ఒక్కసారిగా రక్తప్రవాహంలోకి కలవడం వల్ల అవి శక్తివంతంగా ఉండలేవు. ఫలితంగా శరీరం ఇన్ఫెక్షన్ తో పోరాడటానికి సమర్థవంతంగా పని చేయలేవు.

ఈ పరిశోధన ఉపవాస సమయంలో మెదడు, రోగనిరోధక శక్తి మధ్య ఉన్న సంబంధాన్ని పరిశీలించాయి. మరో వైపు అప్పుడప్పుడు ఉపవాసం ఉండటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అనేక అధ్యయనాలు వస్తున్నాయని అందుకే దీని మీద మరింత పరిశోధన చేయాల్సిన అవసరం ఉందని పరిశోధకులు భావిస్తున్నారు. ఈ మోనోసైట్లు గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి ఇతర వ్యాధులని నియంత్రించంలో కీలకంగా వ్యవహరిస్తాయి.  

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Also Read: రోజూ తేనె, గోరువెచ్చని నీరు తాగుతున్నారా? లాభాలే కాదు నష్టాలూ ఉన్నాయ్!

Published at : 26 Feb 2023 11:21 AM (IST) Tags: Breakfast Heart Problems Don't Skip Breakfast Breakfast Skip Side Effects Breakfast Benefits

సంబంధిత కథనాలు

Beauty Care: చర్మం నిగనిగలాడుతూ మెరిసిపోవాలంటే ఈ ఆహారాలు రోజూ తీసుకోవాల్సిందే

Beauty Care: చర్మం నిగనిగలాడుతూ మెరిసిపోవాలంటే ఈ ఆహారాలు రోజూ తీసుకోవాల్సిందే

కేరళలోని ఈ ప్రత్యేక వేడుకలో పురుషులంతా మహిళల్లా తయారవుతారు

కేరళలోని ఈ ప్రత్యేక వేడుకలో పురుషులంతా మహిళల్లా తయారవుతారు

World Tuberculosis Day: క్షయ వ్యాధి లక్షణాలేమిటీ? ఎవరికి ఎక్కువ ప్రమాదం?

World Tuberculosis Day: క్షయ వ్యాధి లక్షణాలేమిటీ? ఎవరికి ఎక్కువ ప్రమాదం?

World Idly Day: ఆ ఇడ్లీ అమ్మే వ్యక్తి పుట్టినరోజు ‘ప్రపంచ ఇడ్లీ డే’గా ఎలా మారింది?

World Idly Day: ఆ ఇడ్లీ అమ్మే వ్యక్తి పుట్టినరోజు ‘ప్రపంచ ఇడ్లీ డే’గా ఎలా మారింది?

నా భార్య డబ్బు మొత్తం ఖర్చుపెట్టేస్తోంది, ఆమెను మార్చడం ఎలా?

నా భార్య డబ్బు మొత్తం ఖర్చుపెట్టేస్తోంది, ఆమెను మార్చడం ఎలా?

టాప్ స్టోరీస్

CM Jagan Party Meet : ఏప్రిల్ 3న పార్టీ నేతలతో సీఎం జగన్ కీలక సమావేశం, కఠిన నిర్ణయాలుంటాయని జోరుగా ప్రచారం

CM Jagan Party Meet : ఏప్రిల్ 3న పార్టీ నేతలతో సీఎం జగన్ కీలక సమావేశం, కఠిన నిర్ణయాలుంటాయని జోరుగా ప్రచారం

Manchu Vishnu: మనోజ్‌తో గొడవపై మంచు విష్ణు ఊహించని ట్విస్ట్ - తాజా వీడియో చూస్తే తల పట్టుకుంటారు!

Manchu Vishnu: మనోజ్‌తో గొడవపై మంచు విష్ణు ఊహించని ట్విస్ట్ - తాజా వీడియో చూస్తే తల పట్టుకుంటారు!

Mla Raja Singh : ఎమ్మెల్యే రాజాసింగ్ పై ముంబయిలో కేసు నమోదు

Mla Raja Singh : ఎమ్మెల్యే రాజాసింగ్ పై ముంబయిలో కేసు నమోదు

Data Theft ED Case : సైబరాబాద్ డేటా చోరీ కేసులో ఈడీ ఎంటర్, మనీలాండరింగ్ కింద కేసు నమోదు

Data Theft ED Case : సైబరాబాద్ డేటా చోరీ కేసులో ఈడీ ఎంటర్, మనీలాండరింగ్ కింద కేసు నమోదు