Prema Entha Madhuram June 26th: కోర్టు మెట్లెక్కిన వర్ధన్ ఫ్యామిలీ.. అందరికీ పెద్ద షాకిచ్చిన మాన్సీ?
మాన్సీ ముందుకు వచ్చిన అను కుటుంబ పరువును కాపాడుకుంటానని అనటంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
Prema Entha Madhuram June 26th: బుర్ఖా లో వచ్చిన అను మాన్సీ ముందు నిలబడి బుర్ఖా తీయగా మాన్సీ కోపంతో కనిపిస్తుంది. ఏంటి ఈ గెటప్ లో ఉన్నావు ఏమైనా దొంగతనం చేసి దొరకకుండా ఉన్నావా అంటూ వెటకారం చేస్తూ మాట్లాడుతుంది. దాంతో అను తిరిగి తనపై ఫైర్ అవుతుంది. నీరజ్ సార్ ను ఎందుకు బాధ పెడుతున్నావు అని అంటుంది.
దాంతో మాన్సీ.. అంటే అంజలి, నీరజ్ లకు ఏమవుతుందని టెన్షన్ పడుతున్నారు తప్ప నా గురించి మీకు ఎటువంటి బాధ లేదు అని అంటుంది. ఇక అను డబ్బులు కావాలి అంటే ఆర్య సార్ ని అడగాలి కానీ ఇలా చేస్తావా అని అనటంతో నేను అడుక్కునే దానిలాగా కనిపిస్తున్నానా అంటూ తిరిగి అను పై ఫైర్ అవుతుంది.
అంతేకాకుండా వర్ధన్ ఫ్యామిలీ తన ఫూట్ తో సమానం అనటంతో వెంటనే అను సీరియస్ అయ్యి.. ఇక నువ్వు మారవు అంటూ ఎలాగైనా నీ నుండి నా కుటుంబాన్ని కాపాడుకుంటాను అని.. నీకు విడాకులు వచ్చేలా చేస్తాను అని.. ఆస్తులు కాదు కదా చిల్లి గవ్వ కూడా రానివ్వను అని గట్టిగా చెప్పి అక్కడి నుంచి వెళ్తుంది.
ఇక శారదమ్మ లాయర్ తో మాట్లాడుతూ ఉండగా.. అను వారిని చూసి బాధపడుతుంది. కోర్టు బయట దోషులుగా నిలబడాల్సి వచ్చిందని బాధపడుతూ ఈ సమయంలో నీరజ్ దగ్గర లేనందుకు సారీ చెప్పుకుంటుంది. ఇక అప్పుడే ఆర్య, జెండే రావటంతో శారదమ్మ ఆర్యతో లాయర్ తో మాట్లాడావా అని అడుగుతుంది.
ఇక ఆర్య ఏం టెన్షన్ పడకు అని ధైర్యం ఇస్తుంటాడు. నీరజ్ కు కూడా ధైర్యం ఇస్తుంటాడు. వెంటనే నీరజ్ మాన్సి చేసే కుట్రల గురించి చెబుతూ మీరు ఇక్కడ ఉండకండి అంటూ.. తను చేసే నాటకాలను మీరు తట్టుకోలేరు అని వెళ్ళమని చెబుతాడు. అంజలి కూడా అదే మాట చెబుతుంది. కానీ ఆర్య అను విషయంలో తట్టుకుంటున్నాను అంటూ.. ఇప్పుడు తమ్ముడు పరిస్థితులను కూడా తట్టుకుంటాను అని అంటాడు.
జెండే కూడా ఇది ముగింపు పలికే సమయం ఏమో అన్నట్లు ధైర్యం ఇస్తుంటాడు. ఆ తర్వాత లోపలికి వెళ్ళగా అక్కడ బోన్ లో నిలబడతారు మాన్సీ, నీరజ్. అను కూడా ఆర్య వాళ్ళ వెనకాల ఉండి జరుగుతున్నది చూస్తూ ఉంటుంది. ఇక మొదట నీరజ్ తరఫున లాయర్ మాట్లాడి విడాకులు ఇవ్వమని జడ్జిని అడుగుతాడు. ఆ తర్వాత మాన్సీ తరఫున లాయర్ మాట్లాడుతూ మాన్సీ కి సపోర్టుగా మాట్లాడుతాడు. అంతేకాకుండా తిరిగి మాన్సీ ని ప్రశ్నలు కూడా వేస్తాడు. దాంతో మాన్సీ తన భర్తతో తనకు విడిపోవటం ఇష్టం లేదు అని చెప్పి కుటుంబ సభ్యులకు షాక్ ఇస్తుంది.