Xiaomi TVs In Blinkit: 10 నిమిషాల్లో మీ ఇంటికి కొత్త షావోమీ స్మార్ట్ టీవీ - బ్లింకిట్‌లో ఒక్క క్లిక్ చేస్తే చాలు!
Blinkit 10 Minutes Delivery: నిత్యావసరాల డెలివెరీతో క్విక్ కామర్స్ మార్కెట్‌లో పాతుకుపోయిన బ్లింకిట్, ఎలక్ట్రానిక్ పరిధిలో తన పాదముద్రను పెంచుతోంది. స్మార్ట్ టీవీ డెలివరీని కూడా ప్రారంభించింది.

Xiaomi Smart LED TVs Delivery By Blinkit In 10 Minutes: ఫుడ్ డెలివెరీ కంపెనీ జొమాటో (Zomato) నేతృత్వంలో, క్విక్ కామర్స్ (Quick Commerce) రంగంలో పని చేసే బ్లింకిట్ తన వ్యాపార పరిధిని మరింత విస్తరించింది. ఇప్పటికే స్మార్ట్‌ఫోన్‌లను డెలివెరీ చేస్తున్న ఈ క్విక్ కామర్స్ కంపెనీ, కొత్తగా, స్మార్ట్ టీవీల డెలివరీలను కూడా ప్రారంభించింది. తొలుత ఈ సర్వీస్‌ను కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాల్లో ప్రారంభించింది, తర్వాత క్రమంగా విస్తరిస్తుంది.
షావోమీ స్మార్ట్ టీవీలను డెలివరీ చేయనున్న బ్లింకిట్
బ్లింకిట్ వ్యవస్థాపకుడు & CEO అల్బిందర్ దిండ్సా చెప్పిన ప్రకారం, బ్లింకిట్ ఎలక్ట్రానిక్స్ డెలివెరీల పరిధి పెరిగింది. తన బిజినెస్ పోర్ట్‌ఫోలియోలోకి షావోమీ స్మార్ట్ టీవీలను ఈ కంపెనీ యాడ్ చేసింది. తద్వారా, బ్లింకిట్ ఇప్పుడు 43 అంగుళాలు & 32 అంగుళాల సైజుల్లో ఉండే షావోమీ స్మార్ట్ LED TVలను హోమ్ డెలివరీ చేస్తుందని అల్బిందర్ దిండ్సా ట్వీట్ చేశారు. భవిష్యత్తులో మరిన్ని బ్రాండ్ల టెలివిజన్లను తమ క్విక్ కామర్స్ సర్వీస్ కిందకు తీసుకొస్తామని చెప్పారు.
"ఇప్పుడు మీరు బ్లింకిట్ ద్వారా స్మార్ట్ టీవీని ఆర్డర్ చేసి నిమిషాల వ్యవధిలో దానిని పొందవచ్చు" అని అల్బిందర్ దిండ్సా ట్వీట్ చేశారు. ఇటీవలే, దిల్లీ NCR, ముంబై & బెంగళూరులోని ఎంపిక చేసిన ప్రాంతాలలో Xiaomi స్మార్ట్ LED TV (43" & 32") డెలివెరీలను ప్రారంభించాం. మా లార్జ్ ఆర్డర్ డెలివరీ ఫ్లీట్ ద్వారా ఆర్డర్ డెలివరీ జరుగుతుంది. టీవీ ఇన్‌స్టాలేషన్ పనిని టీవీ కంపెనీ చూసుకుంటుంది. త్వరలో మరిన్ని బ్రాండ్ల టీవీలు రాబోతున్నాయి" అని అల్బిందర్ దిండ్సా తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఎలక్ట్రానిక్స్ శ్రేణిలో బ్లింకిట్ పరిధి విస్తృతం
ఢిల్లీ NCR, ముంబై & బెంగళూరులోని ఎంపిక చేసిన ప్రాంతాలలో ఫోన్‌లను డెలివరీ చేయడానికి షావోమీ (Xiaomi), నోకియా (Nokia)తో ఒప్పందం కుదుర్చుకున్న బ్లింకిట్, ఆర్డర్ చేసిన 10 నిమిషాల్లో ఆ రెండు బ్రాండ్ల స్మార్ట్ ఫోన్లను ఇంటి వద్దకు డెలివెరీ చేస్తోంది. గత నెల ప్రారంభంలో, బ్లింకిట్, తన ఎలక్ట్రానిక్ విభాగం పరిధిని విస్తరించింది. "ఇప్పుడు మీరు ల్యాప్‌టాప్‌లు, మానిటర్లు, ప్రింటర్లు సహా మరెన్నో ఉత్పత్తులను 10 నిమిషాల్లో పొందవచ్చు!" అని బ్లింకిట్ CEO 'X' హ్యాండిల్‌లో వెల్లడించారు. ప్రజలు ఎక్కువగా వినియోగించే వస్తువులను కవర్ చేసేలా ఎలక్ట్రానిక్స్ రేంజ్‌లో మా పరిధిని విస్తరిస్తున్నాం, ఈ కేటగిరీలో చాలా పెద్ద బ్రాండ్స్‌తో మేం భాగస్వామ్యం కుదుర్చుకున్నాం" అని కూడా తెలిపారు.
You can now get a TV delivered through Blinkit in minutes!
— Albinder Dhindsa (@albinder) February 12, 2025
We just launched Xiaomi Smart LED TVs (43" & 32") in select areas of Delhi NCR, Mumbai and Bengaluru.
These will be delivered via our dedicated large order delivery fleet.
The installation of the TV will be done by the… pic.twitter.com/LQIiUC1gEe
మరో ఆసక్తికర కథనం: ఇన్వెస్టర్ల కోసం మిత్ర 'ప్లాట్‌ఫామ్' ప్రారంభించిన సెబీ - దీనిని ఎలా ఉపయోగించుకోవాలి?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

