Madhuranagarilo June 24th: సంయుక్త కల్పించిన మత్తుమందు జ్యూస్ తాగిన శ్యామ్-రాధను చంపడానికి వచ్చిన రౌడీలు?
సంయుక్త రాధకు మత్తుమందు కల్పించిన జ్యూస్ ను పంపించగా అది శ్యామ్ తాగడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగింది తెలుసుకుందాం.
Madhuranagarilo June 24th: పార్టీలో మందులేదని గోపాల్ బయటికి వచ్చి ఒక చోట తమ్ముడు దాచిపెట్టుకున్న మందులు తీసుకుని తాగి అక్కడ నుంచి వెళ్తాడు. ఇక అప్పుడే అదే ప్లేస్ కి వెళ్ళిన గన్నవరం, నెల్సన్ లు కూడా అక్కడున్న మందు తాగేసి తూలుతుంటారు. ఇక గోపాల్ ఒక చోట కూర్చొని తనను గన్నవరం 500 ఇవ్వలేదని బాధపెట్టాడు అని.. గన్నవరం భార్యకు చెబుతాడు. అప్పుడే గన్నవరం, నెల్సన్ అక్కడికి రావడంతో వెంటనే గన్నవరం భార్య గన్నవరం ని పార్టీ అయిపోయాక సంగతి చెబుతాను అని అంటుంది.
ఇక మధుర ఇంటికి వచ్చిన గెస్ట్ లందరూ గెస్ట్ లను పలకరించకుండా ఎక్కడికి వెళ్లావు అని అడగటంతో.. మా రాధ దగ్గరికి వెళ్లాను అని రాధ గురించి చెబుతూ ఉంటుంది. దాంతో సంయుక్తకు, అపర్ణకు బాగా కోపం వస్తూ ఉంటుంది. అదే సమయంలో గన్నవరం బ్యాచ్ వచ్చి శ్యామ్ తో సర్ప్రైజ్ ఉందని అంటాడు. అదేం సర్ప్రైజ్ అని అడగటంతో చెబితే సర్ప్రైజ్ ఏమవుతుంది అంటూ కాసేపు మాట్లాడుతూ ఉంటారు.
అప్పుడే రాధ రావటంతో శ్యామ్, మధుర చూసి సంతోష పడతారు. ఇక చాలా ఆలస్యం అయ్యింది అని సంయుక్త వాళ్ళు సారీ చెబుతుంది. వెంటనే అపర్ణ ఆలస్యమైన కూడా నువ్వు వచ్చాకే మొదలవుతుంది కదా అన్నట్లుగా మాట్లాడుతుంది. ఇక అప్పుడే గన్నవరం బ్యాచ్ సర్ప్రైజ్ తేవడం కోసం బయటికి వెళ్తారు.
పెద్ద గజమాల తీసుకొని వచ్చారు. ఇక అది సంయుక్త, శ్యామ్ మెడలో వేస్తుండగా సంయుక్తకు అదే సమయంలో ఏదో తట్టి కింద పడిపోతుండగా ఆ దండ సంయుక్త మెడలో కాకుండా రాధ, శ్యామ్ మెడలో పడుతుంది. అది చూసి అందరూ షాక్ అవుతారు. అప్పుడే ఒక ఆవిడ వచ్చి జోడి చూడముచ్చటగా ఉందని.. మంచి కోడలిని తీసుకొచ్చావు మధుర అంటూ ఆవిడ అంటుంది.
వెంటనే మధుర తను కోడలు కాదని అనగా నేను ఈ ఇంటి కోడలని సంయుక్త ఆ దండ తన మెడలో వేసుకుంటుంది. ఇక ఆ తర్వాత అందరూ సెల్ఫీలు దిగుతుంటారు. ఇక అపర్ణ తన కూతురుతో రాధ కావాలని వచ్చి దండలో దూరింది అని అంటుంది. ఏదో ఒకటి చేయాలి అనటంతో జ్యూస్ లో బాయ్ తో మత్తుమందు కల్పిస్తుంది సంయుక్త.
ఇక రాధ ఆ జ్యూస్ తాగడంతో పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తుందని.. దాంతో అత్తయ్య తనపై కోప్పడుతుందని ఇక వాళ్ళిద్దరూ దూరం అవుతారు అని అంటుంది. గన్నవరం గ్యాంగ్ శ్యామ్ తో మందు పార్టీ లేదని చెబుతూ బాధపడుతుండగా ఇది ఫ్యామిలీ పార్టీ అని కేవలం జ్యూస్ మాత్రమే తాగాలి అని అంటాడు. ఆ సమయంలో బాయ్ జ్యూస్ లన్ని తీసుకొని వస్తుండగా శ్యామ్ వాళ్లను ఆపి అందరికీ జ్యూసులు ఇప్పిస్తాడు.
ఇక మత్తుమందు కలిపిన జ్యూస్ ఇవ్వకుండా బాయ్ వెళ్తుండగా.. వెంటనే శ్యామ్ ఫ్రెండ్ ఆ జ్యూస్ ఇక్కడ ఇవ్వమని అనడంతో.. రాధ మేడం అడిగారు అని అంటాడు అతడు. నేను ఇస్తాను అని జ్యూస్ తీసుకొని రాధ దగ్గరికి వెళ్ళగా రాధ వద్దు అనడంతో తనే తాగుతాడు. అది చూసి షాక్ అవుతారు తల్లి, కూతుర్లు. తర్వాత శ్యామ్ స్టేజి మీదకి వెళ్లి అందరినీ ఆహ్వానిస్తాడు.
ఇప్పుడు ఇక్కడ ఎంటర్టైన్మెంట్ ఉంటుందని.. ఇందులో చీటీలు ఉన్నాయని అందులో ఏమి ఉంటే అదే చేయాలి అని రాధతో చీటీ తీయమని చెబుతాడు. అది చూసి రాధ షాక్ అవుతుంది. తరువాయి భాగంలో సంయుక్త వాళ్ళు రాధను చంపించడానికి రౌడీలను ఇంట్లోకి పంపిస్తుంది. ఇక రాధ గట్టిగా అరవటంతో పండు తన తల్లిని కాపాడటం కోసం శ్యామ్ దగ్గరికి వెళ్లి పిలుస్తాడు.