అన్వేషించండి
Satyabhama Serial February 13th Episode Highlights:మహదేవయ్య రాక్షస రాజకీయం.. ఆగిపోయిన ఎలక్షన్, ఇరుక్కుపోయిన క్రిష్ - సత్యభామ ఫిబ్రవరి 13 ఎపిసోడ్ హైలెట్స్!
Satyabhama Today Episode: క్రిష్.. మహదేవయ్య కొడుకు కాదని సత్య బయటపెడదాం అనుకుంటే ప్లాన్ రివర్సైంది. MLA గా పోటాపోటీగా బరిలో దిగారు మామా కోడలు.. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే....

Satyabhama Serial Today Episode
1/10

చెల్లి మాటలు, మహదేవయ్యమాటలు తలుచుకుని బాధపడిన సత్య ఎలక్షన్ నుంచి విత్ డ్రా అవుదాం అనుకుంటుంది. అనాధాశ్రమం బామ్మకి కాల్ చేసి చెబుతుంది.
2/10

దేవుడు కూడా మమ్మల్ని వదిలేస్తే నువ్వు మాత్రం అండగా నిలిచావు. మా రాత ఇంతే అనుకుంటాం..అప్పుడు ఒకరు చనిపోయారు ఇప్పుడు 20 మంది చనిపోతాం అంతే కదా అంటుంది.
3/10

క్రిష్ సంజయ్ దగ్గరకు వెళ్లి ఇంట్లో సమస్యలు తెలిసి కూడా ఇలా ఎందుకు చేశావ్ అని నిలదీస్తాడు. పెళ్లి విషయంలో సంధ్య ఎలా మొండితనం చూపించిందో ఫస్ట్ నైట్ విషయంలోనూ అదే చేసిందంటాడు. నీ భార్యకు నువ్వు చెప్పగలవా..అందరూ అలానే ఉంటారని రివర్సవుతాడు సంజయ్.
4/10

సంధ్యపై నీకున్న ప్రేమ ఎప్పటికీ తగ్గకూడదు.. తనకి నేను కేర్ టేకర్. ఆమె సంతోషంగా లేకపోతే నేను ముల్లు లెక్క మారాల్సి ఉంటుంది. సంధ్యపై నువ్వు చూపించే ప్రేమను బట్టి నీపై సత్యకున్న అభిప్రాయం మారుతుందని చెబుతాడు
5/10

ఎలక్షన్ నుంచి విత్ డ్రా అవుతున్నావా లేదా అని మహదేవయ్య అడుగుతాడు. ఇంతలో సత్య సేమ్ మహదేవయ్య చేసినట్టే ఒక్క నిముషం అంటూ కాల్ చేస్తుంది. సురేఖా నేను రిలీజ్ చేసిన వీడియో చూశావా ఏమనిపిస్తోందని అడుగుతుంది
6/10

నేను ఎర్రోడినా ఇక్కడ మాట్లాడుతుంటే ఆ ఫోన్లు అంటని ఫైర్ అవుతాడు. ఒక్క నిమిషం అంటూ రాగిణి నేను నా నిర్ణయం తీసుకున్నా అందుకే వీడియో రీలీజ్ చేశానంటుంది
7/10

ఎలక్షన్‌లో తగ్గేదేలేదని ఎమ్మెల్యేగా గెలిస్తే మొదటి సారి వృద్థాశ్రమం సమస్య తీర్చేస్తా అంటుంది సత్య. నాకు సంధ్యా కావాలి MLA పదవి కావాలంటుంది. రెండింటినీ రక్షించుకోవడం ఎలాగో నాక్కూడా తెలుసు అంటుంది
8/10

ఎగ్జిట్ పోల్స్ వచ్చాయ్ ..మొత్తం సత్యకే సపోర్ట్ గా ఉంది ఫలితం అని ఫైర్ అవుతాడు రుద్ర. కోపంతో పేపర్లు చింపేసిన మహదేవయ్య.. ఎవరో ఒక అభ్యర్థి చచ్చిపోతే ఎలక్షన్ ఆగిపోతుందని ఆలోచిస్తాడు..నర్సింహను టార్గెట్ చేస్తాడు. క్రిష్ తో ఆ పని చేయించాలి అనుకుంటారు
9/10

మహదేవయ్య డ్రామాలు స్టార్ట్ చేస్తాడు. నర్సింహ మనుషులు కొట్టారంటూ ఒళ్లంతా కట్లు కట్టుకుంటాడు. ఈ రోజుతో నర్సింహం చాప్టర్ ముగిసిపోయిందని క్రిష్ అంటాడు. సత్య అడ్డుకుంటుంది. మీ నాన్నకి ఇలా జరిగితే మీకు పౌరుషం లేదా అని రుద్రని రెచ్చగొడుతుంది
10/10

సత్యభామ ఫిబ్రవరి 14 ఎపిసోడ్ లో...సత్య ఎంత ఆపుతున్నా ఆగకుండా క్రిష్ నర్సింహం దగ్గరకు వెళ్లి గొడవకు దిగుతాడు. అభ్యర్థి నర్సింహం చనిపోవడంతో వరంగల్ ఎన్నికలు రద్దు చేయబడ్డాయని టీవీలో న్యూస్ వస్తుంది
Published at : 13 Feb 2025 09:41 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
నల్గొండ
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion