అన్వేషించండి
Gunde Ninda Gudi Gantalu February 13th Episode Highlights: ప్రభావతిని నిలదీసిన బాలు, దొరికిపోయిన మనోజ్, కష్టాల్లో మౌనిక - గుండె నిండా గుడి గంటలు ఫిబ్రవరి 13 ఎపిసోడ్ హైలెట్స్
Gunde Ninda Gudi Gantalu February 13th Episode : మీనా - బాలుని ఇంట్లోంచి వెళ్లగొట్టేందుకు ప్లాన్స్ వేస్తూనే ఉంటుంది ప్రభావతి. గుండె నిండా గుడి గంటలు ఈ రోజు ఎపిసోడ్ హైలెట్స్

Gunde Ninda Gudi Gantalu February 13th Episode
1/9

శృతిని కలిసేందుకు డబ్బింగ్ స్టూడియో కు వెళ్తాడు రవి. తాను కారు తీసుకోవాలని డిసైడ్ అయ్యానంటుంది. ఇద్దరం సంపాదిస్తున్నాం కదా అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా అంటాడు
2/9

ఇంటిపని నీ ఒక్కదానికే అవసరమా..ఇలా చేయడం బాలేదంటాడు బాలు. ఇంట్లో 8 మంది ఉన్నారు..అందరకీ కాళ్లు చేతులు బాగానే ఉన్నాయ్ కదా అని ఫైర్ అవుతాడు. నాకు కొత్తేం కాదంటుంది మీనా. వేడి వేడి అన్నం పెడతా అని మీనా అంటే.. నాకు చద్దన్నం పెట్టేది మా అమ్మ మనోజ్ గాడికి వేడి వేడి అన్నం పెట్టేది. దానివల్ల నాకు మంచే జరిగింది నేను స్ట్రాంగ్ గా తయరాయ్యాను అంటాడు.
3/9

గొంతు అన్నాడని వేడి నీళ్లు ఇస్తే వెంటనే తాగేస్తాడు. కాలిందని అరుస్తుంటే..వేడి నీల్లు అని చెప్పాలి కదా అంటాడు. చల్లారాక తాగండి అంటుంది. కాళ్లు లాగుతున్నాయ్ అంటూ ఏమీ తినకుండానే నిద్రపోతుంది మీనా
4/9

బాలు అన్నం తీసుకొచ్చి తినిపిస్తాడు. బాలుకి మౌనికను చూడాలి అనిపిస్తుంది. అందుకు బాధ పడడం ఎందుకు తాను పనిచేసే ఆఫీస్ కి వెళ్లి చూసి రమ్మని సలహా ఇస్తుంది మీనా
5/9

మనోజ్, రోహిణి ఆఫీస్ కి వెళ్తూ జీవితం బోర్ కొడుతోంది..సినిమాకు, రెస్టారెంట్ కి వెళదాం అంటుంది రోహణి. ఆఫీస్ కి వెళ్లాలని తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు మనోజ్. మనోజ్ కి సపోర్ట్ చేస్తుంది ప్రభావతి.
6/9

రోహిణి బయటికి వెళ్ళగానే మనోజ్ కు క్లాస్ వేసిన ప్రభావతి ఇప్పటికైనా పని చూసుకో లేదంటే బాలుగాడు ఇల్లును కోర్టులా మారుస్తాడని వార్నింగ్ ఇస్తుంది.
7/9

ఎప్పుడూ ఆ వంటగదిలోనే ఉంటావా అని బాలు క్లాస్ వేస్తాడు. పనిచేస్తే తప్పేంటి అంటుంది ప్రభావతి. అయినా మీనా వచ్చాక పనిమనిషిని ఎందుకు మానిపించావ్ అని క్వశ్చన్ చేస్తాడు. అక్కడి నుంచి వెళ్లిపోతుంది ప్రభావతి
8/9

శృతి, రవి సంతోషంగా వచ్చి కారు తీసుకుంటున్నాం అని చెబుతారు. మనోజ్ ఉన్న షోరూమ్ కి వెళదాం అనుకుంటున్నాం అంటారు . ప్రభావతి కంగారుగా మనోజ్ కి కాల్ చేసినా లిఫ్ట్ చేయడు.
9/9

గుండెనిండా గుడిగంటలు ఫిబ్రవరి 14 ఎపిసోడ్ లో.. మౌనిక కోసం ఆఫీస్ కి వెళతాడు బాలు. తను మానేసిందని ఆమె ఫ్రెండ్ చెబుతుంది. కాల్ చేస్తాడు కానీ మౌనిక మాట్లాడే లోగా భర్త వచ్చి లాక్కుంటాడు...
Published at : 13 Feb 2025 10:08 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion