Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today January 23rd: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: ఒకే దెబ్బకి రెండు పిట్టలు.. అడవిలో లక్ష్మీ, విహారిలు.. అంబిక చంపించేస్తుందా!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Today Episode లక్ష్మీ, విహారి ఇద్దరినీ కిడ్నాప్ చేసి చంపేయాలి అని అంబిక, సుభాష్ ప్లాన్ చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode మత్తులో ఉన్న లక్ష్మీని ఇంటికి తీసుకెళ్లాలి అని విహారి, అంబికలు మొత్తం వెతుకుతారు. లక్ష్మీ కనిపించకపోవడంతో ప్రతీ గదిని వెతుకుతారు. ఓ గదిలో అంబిక లక్ష్మీని చూస్తుంది. ఇక్కడుందా లక్ష్మీని ఈ గదిలోకి ఎవరు షిఫ్ట్ చేశారని అనుకుంటుంది. విహారి వచ్చే టైంకి ఆ గది తలుపులు వేసేస్తుంది. ఎక్కడా లక్ష్మీ లేదని చెప్తుంది.
విహారి సహస్ర ఫ్రెండ్ రోహిత్‌ని లక్ష్మీ కనిపించిందా అని అడుగుతాడు. తాను వెళ్లిపోయిందని రోహిత్ చేప్తాడు. సహస్ర కూడా వెళ్లిపోయి ఉంటుంది పద వెళ్దామని విహారిని తీసుకెళ్లిపోతుంది. ఇక అంబిక సుభాష్‌కి కాల్ చేసి పార్టీ అయిపోయిందని అందరూ వెళ్లిపోతున్నారు అని విహారిని ఇప్పుడేం చేయలేమని చెప్తుంది. ఇక విహారిని ఏం చేయొద్దని లక్ష్మీ తాగి పడిపోయింది తనని తీసుకెళ్లి వేసేయమని చెప్తుంది. తను కచ్చితంగా ఇంటికి తిరిగి వచ్చేస్తుందని చెప్పి సహస్ర విహారిని తీసుకెళ్లిపోతుంది. ఇక రోహిత్ లక్ష్మీ గదికి వచ్చి లక్ష్మీని చూసి లక్ష్మీ పక్కన కూర్చొని స్వీటీకి కాల్ చేసి సూపర్ గిఫ్ట్ అని చెప్తాడు. థ్యాంక్యూ చెప్తాడు.
లక్ష్మీతో రాత్రి ఎంజాయ్ చేయమని స్వీటీ చెప్పి ఫోన్ కట్ చేసేస్తుంది. రోహిత్ లక్ష్మీ మీదకి వెళ్లి ముద్దు పెట్టబోయే టైంకి లక్ష్మీ కళ్లు తెరచి మత్తులోనే రేయ్ ఎవరు నువ్వు నేను ఎక్కడున్నాను అని అంటుంది. లక్ష్మీ లేస్తే ప్రమాదమని రోహిత్ లక్ష్మీ ముఖం మీద పెప్పర్ స్ఫ్రే కొడతాడు. దాంతో లక్ష్మీ మళ్లీ పడుకుండిపోతుంది. పార్టీ చాలా డిసప్పాయింట్ అయిందని సహస్ర అంటుంది. విహారి మాత్రం లక్ష్మీ గురించే ఆలోచిస్తుంటాడు. దారిలో కారు ఆపి తల్లి యమునకు కాల్ చేస్తాడు. లక్ష్మీ ఇంటికి వచ్చిందా అని అడుగుతాడు. రాలేదని యమున కంగారు పడితే ఏం టెన్షన్ అవసరం లేదని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు.
రోహిత్ లక్ష్మీ మీద పువ్వులు చల్లుతూ ఎంజాయ్ చేస్తుంటాడు. ఇక విహారి సహస్ర, అంబికలను ఇంటికి వెళ్లిపోమని తాను లక్ష్మీ కోసం మళ్లీ వెళ్తానని అంటాడు. సహస్ర వద్దని ఎంత చెప్పినా వినకుండా వెళ్తాడు. అనవసరంగా లక్ష్మీని పార్టీకి తీసుకొచ్చానని సహస్ర అనుకుంటుంది. ఇక అంబిక సుభాష్‌కి కాల్ చేసి విహారి ఒంటరిగా ఫాంహౌస్‌కి వస్తున్నాడని విహారి, లక్ష్మీ ఇద్దరినీ చంపేయమని ఆనవాళ్లు లేకుండా చేయమని ఎవరికీ వారిద్దరి గురించి తెలీకూడదని చెప్తుంది. అంతా తాను చూసుకుంటానని సుభాష్ చెప్తాడు. ఇక రోహిత్ మళ్లీ లక్ష్మీని ముద్దు పెట్టుకోవాలని ప్రయత్నించే టైంకి లక్ష్మీకి మెలకువ వస్తుంది. రోహిత్‌ని లక్ష్మీ కొడుతుంది. రోహిత్ లక్ష్మీని అడ్డుకోలేకపోతాడు. ఇంతలో విహారి కూడా అక్కడి వచ్చేస్తాడు. సుభాష్, రౌడీలు కూడా వస్తారు. మరోసారి విహారి మొత్తం వెతుకుతాడు.
లక్ష్మీ ఉన్న గది తలుపు కొడతాడు. దాంతో విహారి ఉన్నాడని రోహిత్ షాక్ అయి దాక్కుంటాడు. విహారి లక్ష్మీని చూస్తాడు. ఇక్కడికి ఎలా వచ్చావ్ నిన్ను ఎవరు తీసుకొచ్చారని అడుగుతాడు. లక్ష్మీ మత్తులోనే ఉంటుంది. గదిలో బెడ్ మీద పువ్వులు పడి ఉండటం కర్టెన్ చాటుగా షూ చూసిన విహారి వెళ్లి రోహిత్‌ని చూసి కాలర్ పట్టుకొని ఇక్కడేం చేస్తున్నావ్ అని చితక్కొడతాడు. ఇక లక్ష్మీ బయటకు రాబోతుంటుంది. ఇక సుభాష్ వాళ్లు అక్కడికి వస్తారు. సుభాష్ ముందు లక్ష్మీని తీసుకొచ్చేయ్ మని అంటాడు. లక్ష్మీని తీసుకెళ్తుంటారు. విహారి రోహిత్‌ని చితక్కొడుతూ లక్ష్మీని చూసుకోడు. తర్వాత లక్ష్మీ కోసం వెతుకుతాడు. మేడ మీద నుంచి లక్ష్మీని రౌడీలు తీసుకెళ్లడం చూస్తాడు. లక్ష్మీ వాళ్ల నుంచి విడిపించుకొని పారిపోతుంది. సుభాష్ విహారిని చూసి దాక్కుంటాడు. లక్ష్మీ అడవిలోకి వెళ్లడం వెనకాలే రౌడీలు ఆ తర్వాత విహారి పరుగులు తీస్తారు. ఒక్క దెబ్బకి రెండు పిట్టలు అని సుభాష్ అనుకుంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: సత్యభామ సీరియల్: రోడ్లు ఊడుస్తున్న సత్య.. పాపం అని చేస్తుందా.. ప్రచారం కోసం చేస్తుందా!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

