Sara Ali Khan: కాటన్ చీర, చేతికి వాచ్, నుదిటిన బొట్టు- ఆకట్టుకుంటున్న సారా కొత్త సినిమా లుక్
Sara Ali Khan: బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్ కొత్త సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో ఆమె స్వాతంత్య్ర సమర యోధురాలిగా కనిపించబోతోంది.
![Sara Ali Khan: కాటన్ చీర, చేతికి వాచ్, నుదిటిన బొట్టు- ఆకట్టుకుంటున్న సారా కొత్త సినిమా లుక్ Sara Ali Khan plays a freedom fighter in the new motion poster of Ae Watan Mere Watan Telugu News Sara Ali Khan: కాటన్ చీర, చేతికి వాచ్, నుదిటిన బొట్టు- ఆకట్టుకుంటున్న సారా కొత్త సినిమా లుక్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/22/043beb7f422abfc05ef6f61810b317871700630793852544_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Sara Ali Khan ‘Ae Watan Mere Watan’ Movie Motion Poster: బాలీవుడ్ హీరోయిన్ సారా అలీ ఖాన్ వరుస సినిమాలతో కెరీర్ సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తోంది. ఈ ముద్దుగుమ్మ ఓవైపు గ్లామర్ రోల్స్ చేస్తూనే, మరోవైపు నటనా ప్రాధాన్యత ఉన్న సినిమాల్లోనూ నటిస్తోంది. తాజాగా ఆమె `ఏ వతన్ మేరే వతన్` సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రంలో ఆమె స్వాతంత్య్ర పోరాట యోధురాలిగా కనిపించనుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి సారా లుక్ ని చిత్రబృందం రిలీజ్ చేసింది. దర్శకనిర్మాత కరణ్ జోహార్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ మోషన్ పోస్టర్ ని షేర్ చేశారు.
ఆకట్టుకుంటున్న సారా కొత్త సినిమా లుక్
ఈ తాజా పోస్టర్ లో సారా అలీ ఖాన్ క్యారెక్టర్ ను రివీల్ చేశారు. అంతేకాదు, ఈ మోషన్ పోస్టర్ కు ‘ఆజాద్ ఆవాజీన్, ఖైద్ నహీ హోతీ` అనే స్లోగన్ ను క్యాప్షన్ గా పెట్టారు. సారా పాత్రను ఉషా మెహతాగా ప్రేక్షకులకు పరిచయం చేశారు. బూడిద రంగు అంచుతో కూడిన తెల్లటి కాటన్ చీరలో సారా కనిపించింది. ఎడమ చేతికి నల్లటి వాచ్, నుదిటి మీద చిన్న బొట్టు, చిన్న జడను అల్లిన తీరు స్పెషల్ గా కనిపించాయి. సారా మైకులో ఏదో సందేశం ఇస్తున్నట్లుగా చూపించారు. ఈ క్యారెక్టర్ కు సంబంధించి సారా మేకోవర్ కూడా బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో ఆమె చాలా ధైర్యవంతురాలిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది.
View this post on Instagram
ఈ సినిమాతో సారా దశ తిరిగేనా?
ఈ సినిమాను కరణ్ జోహార్ ధర్మాటిక్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ గా ఈ మూవీ రిలీజ్ కానుంది. భారతీయుల స్వేచ్ఛ కోసం స్వాతంత్య్ర ఉద్యమంలో ధైర్యంగా పోరాడిన ఓ మహిళ కథను ఈ సినిమాలో చూపించనున్నారు. ఈ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకోవాలని భావిస్తోంది సారా. ఈ మూవీ ఆమె కెరీర్ కు టర్నింగ్ పాయింట్ గా మారబోతుందని పలువురు సినిమా క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమా కోసం సినీ అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
సైఫ్ నట వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినా..
బాలీవుడ్ సీనియర్ నటుడు సైఫ్ అలీ ఖాన్ నట వారసురాలిగా సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టింది సారా అలీఖాన్. ‘కేదార్ నాథ్’ సినిమాతో హీరోయిన్ గా వెండి తెరకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ ముందుకు సాగుతోంది. సైఫ్ నటవారసురాలిగా ఇండస్ట్రీకి పరిచయం అయినా, తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంది సారా. సంప్రదాయంగా కనిపిస్తూనే, గ్లామర్ మెరుపులు మెరిపించడంలో ముందుంటుంది సారా. రోజు రోజుకు గ్లామర్ డోస్ పెంచుతూ కుర్రాళ్లను అలరిస్తోంది. సినిమా షూటింగ్స్ లో ఏ చిన్న బ్రేక్ దొరికినా ఆధ్యాత్మిక యాత్రలు చేస్తుంటుంది. ప్రసిద్ధ హిందూ ఆలయాలను సందర్శిస్తుంది. అత్యంత క్లిష్టమైన అమర్ నాథ్ యాత్ర చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.
Read Also: రష్మితో మూవీ, సుడిగాలి సుధీర్ ఏమన్నాడంటే?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)