అన్వేషించండి

Viral News: ఆయ్..మా గోదారోళ్లకు మర్యాదలు బాగా ఎక్కువేనండి - అత్తకి కోటి బహుమతి ఇచ్చిన కోడలు -కట్నం కాదండోయ్ !

One Crore: అత్త యాభైవ పుట్టిన రోజును కోడలు మర్చిపోలేనంత ఘనంగా చేసింది. రూ.కోటి విలువైన బహుమతులు కూడా ఇచ్చింది. ఈ విషయం ఇప్పుడు వైరల్ గా మారింది.

Daughter in law gifted her mother-in-law one crore : సాధారణంగా అత్తా - కోడళ్ళకు పడదు.ఏదో విషయానికి గొడవలు, అభిప్రాయ భేదాలు సహజమే. మేనరికం చేసుకున్నా తప్పదు. కానీ వేలల్లో ఒకరు మాత్రమే బాగుంటారు.అదీ కూడా చాలా అరుదుగా ఉండొచ్చు...అత్తలు కోడళ్ళుకు, కోడళ్ళు అత్తలకు గిఫ్ట్ లివ్వడం కూడా అసాధారణమే.ఏ సినిమాల్లోనో...,ఏ సీరియల్ లోనో...మాత్రమే జరుగుతుంటాయి. 

అత్త పుట్టిన రోజు వేడుకల్ని ఓ  రేంజ్ లో చేసిన కోడలు 

కానీ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం రాజోలు ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో జరిగిన పుట్టినరోజు వేడుకలో మాత్రం కోడలు.. కోడలా? కూతురా? అంతకన్నా ఎక్కువా? అనేలా దాదాపు కోటి రూపాయల బహుమతులతో అత్త యాభై పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా జరిపించడం అందర్నీ ఆశ్చర్య పరిచారు. 

కోడలిగా వెళ్లిన తనను కూతురిలా చూసుకుంటున్నారని సంతోషం          

రాజోలు చాంబర్ ఆప్ కామర్స్ అధ్యక్షుడు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆర్యవైశ్య సంఘం కార్యదర్శి కాసు శ్రీనివాస్ - భవానీ దంపతులు లకు జన్మించిన సుకేష్ కు రెండేళ్ల క్రితం పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు కు చెందిన శ్రీరంగనాయకి తో వివాహం జరిగింది.అప్పటి నుండి అత్తా మామలు తనను కన్న తల్లిదండ్రుల వలే చూసుకుంటున్నారంటు వేడుకలో కన్నీటి పర్యంతం అయింది.        

అత్త పుట్టిన రోజు మర్చిపోలేని విధంగా ప్లాన్ చేసిన కోడలు      

 అత్త భవానీ 50 వ పుట్టినరోజు నాడు ఎవరు చేయలేనంత అంగరంగ వైభవంగా పుట్టిన రోజు వేడుక చేసింది. ఇందులో భాగంగా నాలుగు  పట్టుచీర,పసుపు కుంకుమ, గాజులు, మంగళసూత్రం., వంద గ్రాముల బంగారు బిస్కెట్, ఇరవై ఎనిమిది లక్షల విలువ చేసే డైమండ్ నెక్లెస్ , యాభై లక్షల యాభై రూపాయల యాభై పైసలు నగదు వంటి భారీ బహుమతులు ఇచ్చి తన  ప్రేమను చాటుకుంది .తన అత్త పుట్టినరోజు కలకాలం గుర్తుండిపోయేల చేశారు.         

కోడలి ప్రేమకు అత్త ఫిదా          

మొదట యాభై అడుగుల పుష్పాలంకరణలో పాదాలు వేసి, ముత్తైదువులతో హారతి ఇచ్చి యాభై అడుగులలో వేద పండితుల మంత్రోచ్ఛారణ నడుమ లోపలకు నడిపించారు. అనంతరం   భారీ కేక్ కట్ చేసి వేడుక నిర్వహించారు.          

సాధారణంగా గోదావరి జిల్లాల్లో తమ ఇంటికి వచ్చిన కొత్త అల్లుళ్లకు వందల కొద్దీ వంటకాలతో మర్యాదలుచేస్తూంటారు. వారిని చూసి రాష్ట్రవ్యాప్తంగా అలాంటి మర్యాదలు చేసే వాళ్లు పెరిగిపోయారు. ఇప్పుడు అత్తలకు మర్యాదలు చేసి...  బహముతులు ఇచ్చే కోడళ్లు వచ్చేశారు. మరి ఈ ట్రెండ్ కూడా రాష్ట్రం మొత్తం పాకిపోతుందా  ?                          

Also Read:  విజయసాయిరెడ్డి రాజకీయ సన్యాసం కొద్ది రోజులే - బీజేపీలో చేరేందుకు ముహుర్తం ఖరారు ?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
Best Time to Drink Coffee : కాఫీ తాగడానికి సరైన సమయం ఏమిటి? ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉందా?
కాఫీ తాగడానికి సరైన సమయం ఏమిటి? ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉందా?
OPINION | The AQI Illusion: కాలుష్యంపై పోరాటంలో ఓడిపోతున్న భారత్ - ప్రధాన కారణం డేటా మిస్సింగ్ !
కాలుష్యంపై పోరాటంలో ఓడిపోతున్న భారత్ - ప్రధాన కారణం డేటా మిస్సింగ్ !
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Embed widget