అన్వేషించండి

Vijayasai Reddy: విజయసాయిరెడ్డి రాజకీయ సన్యాసం కొద్ది రోజులే - బీజేపీలో చేరేందుకు ముహుర్తం ఖరారు ?

YSRCP : వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి బీజేపీలో చేరేందుకు రెడీ అయ్యారు. జూన్ లేదా జూలైలో ఆయన బీజేపీలో చేరనున్నారు.

Former YSRCP MP Vijayasai Reddy is ready to join BJP : మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వైసీపీతో పాటు తన ఎంపీ పదవికి కూడా హఠాత్తుగా రాజీనామా చేశారు. ఇక తాను రాజకీయాలకు దూరమని హార్టికల్చర్ చేసుకుంటానని ప్రకటించారు. అన్నట్లుగానే ఆయన రాజీనామా చేసి కొన్నాళ్లు కనిపించకుండా పోయారు. ఈ మధ్యలో ఆయన కొన్ని రహస్య సమావేశాలు నిర్వహించారు. కానీ వివరాలు బయటకు రాలేదు. ఇటీవల హైదరాబాద్ వచ్చిన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్‌ను కూడా కలిశారు. కంది ఐఐటీకి వచ్చిన ఆయనకు ప్రోటోకాల్ లేకపోయినా ఆయన వద్దకు వెళ్లి మరీ ఆహ్వానించడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ఆయనకు ఎందుకు అవకాశం వచ్చిందో మెల్లగా కన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయని రాజకీయవర్గాలు చెబుతున్నాయి.                                         

విజయసాయిరెడ్డి రాజకీయాలకు శాశ్వతంగా దూరం కాలేదు. ఆయన  కొంత విరామం తీసుకోవాలనుకున్నారు. ముఖ్యంగా వైసీపీకి రాజీనామా చేసిన వెంటనే మరో పార్టీలో చేరితే అనేక ప్రశ్నలు వస్తాయని అందుకే కొంత కాలం విశ్రాంతి తీసుకోవాలని అనుకున్నారు. భారతీయ జనతా పార్టీలో చేరేందుకు అన్నీ మాట్లాడుకున్న తర్వాతనే రాజీనామా చేశారని ప్రస్తుతం ఓ క్లారిటీ వచ్చిందని అంటున్నారు. ఆయన బయటకు కనిపించకపోయినా..తెలియకపోయినా బీజేపీ పెద్దలతో నిరంతరం టచ్ లో ఉంటున్నట్లుగా తెలుస్తోంది. తాను రాజీనామా చేసిన రాజ్యసభ సీటును మళ్లీ ఆయన కోరుకోవడడం లేదు. పదవి లేకపోయినా పర్వాలేదు ఆయన బీజేపీలో చేరాలనుకుంటున్నారు. అందుకే తను రాజీనామా చేసిన స్థానంలో ఉపఎన్నిక జరిగిన వెంటనే ఆయన బీజేపీలో చేరేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకుంటారని చెబుతున్నారు. 

ఇప్పటి వరకూ ఉన్న విశ్వసనీయ సమాచారం మేరకు జూన్ లేదా జూలై నెలల్లో బీజేపీ తీర్థాన్ని పుచ్చుకునేందుకు విజయసాయిరెడ్డి రెడీ అయ్యారని అంటున్నారు. బీజేపీ పెద్దలు కూడా ఈ అంశంపై సానుకూలంగా ఉన్నారని.. అలా డీల్ మాట్లాడుకున్నందునే రాజీనామా చేశారని అంటున్నారు. అయితే విజయసాయిరెడ్డిని పార్టీలో చేర్చుకోవడంపై కూటమి పార్టీలు ఎలా స్పందిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. ఆయన తన పదవికి రాజీనామా చేసినప్పుడు టీడీపీ అధినేత చందర్బాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ గురించి చాలా పద్దతిగా మాట్లాడారు. వారిపై తాను చేసిన వ్యాఖ్యలు కేవలం రాజకీయాల్లో భాగంగా చేసినవే తప్ప.. వ్యక్తిగతంగా తనకు వారితో మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. 

విజయసాయిరెడ్డిపై అనేక కేసులు ఉన్నాయి. జగన్ అక్రమాస్తుల కేసుల్లో ఆయన ఏ2గా ఉన్నారు. అలాగే కాకినాడ  పోర్టును బెదిరించి రాయించుకున్నారన్న కేసుల్లోనూ ఇటీవల ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. ఇంకా అనేక స్కాముల్లో ఆయన  పేరు ఉందని ప్రచారం జరుగుతున్న సమయంలోఆయన వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఇప్పుడు బీజేపీలోనే చేరాలనుకుంటున్నారు. ఆయనను చేర్చుకుంటారా లేదా అన్నదానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. 

Also Read: పార్టీ ప్లీనరీ ముందు ఈ స్టేట్మెంట్ అవసరమా జనసేనానీ

టాప్ హెడ్ లైన్స్

Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Foods To Reduce Stress : ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Embed widget