Ear cleaning tips : చెవులను ఇలా శుభ్రం చేసుకుంటే నొప్పి, ఇన్ఫెక్షన్లు రావట.. ఆ మిస్టేక్స్ మాత్రం చేయొద్దు
Ear Concerns : చెవి నొప్పి వస్తే దానిని భరించడం అనేది చాలా కష్టం. అందుకే ఇన్ఫెక్షన్ని, నొప్పిని దూరం చేసుకోవడం కోసం కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలని చెప్తున్నారు.

Safe Ear Cleaning Methods : చెవులు శుభ్రంగా ఉంచుకోకుంటే ఇన్ఫెక్షన్లు త్వరగా వచ్చే ప్రమాదముంది. అందుకే వాటిని క్లీన్‌గా ఉంచుకోవాలి. లేదంటే ఇన్ఫెక్షన్లు, నొప్పి వస్తాయి. అయితే ఈ సెన్సిటివ్ పార్ట్‌ని ఎలా పడితే అలా కాకుండా.. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ శుభ్రం చేసుకోవాలంటున్నారు. మరి ఎలాంటి టిప్స్ ఫాలో అయితే చెవి సమస్యలను దూరం చేసుకోవచ్చో ఇప్పుడు చూసేద్దాం.
చెవులను ఇలా శుభ్రం చేయండి..
ఇయర్ ఇరిగేషన్ : చెవిని శుభ్రపరిచేందుకు కొన్ని సురక్షితమైన పద్ధతులను ఫాలో అవ్వొచ్చు. వాటిలో ఇయర్ ఇరిగేషన్ ఒకటి. గోరువెచ్చని నీటితో నిండిన సిరంజి లేదా బల్బ్ సిరంజిని ఉపయోగించి.. చెవిలో సున్నితంగా ఫ్లష్ చేస్తారు. దీనివల్ల చెవిలో గులిమి బయటకు వస్తుంది.
ఇయర్ వాక్యూమ్ : చెవిలో గులిమి, ఇతర టాక్సిన్లను తొలగించడానికి ప్రత్యేకమైన ఇయర్ వాక్యూమ్ ఉపయోగించవచ్చు.
మైక్రోసక్షన్ : చెవిలో గులిమిని తీయడానికి ఆరోగ్య నిపుణులను సంప్రదించవచ్చు. మైక్రోసక్షన్ ద్వారా చెవులను క్లియర్ చేస్తారు.
ఈ టిప్స్ ఫాలో అయితే మంచిది..
కాటన్ స్వాబ్స్ : చాలామంది చెవులను శుభ్రం చేయడం కోసం కాటన్ స్వాబ్స్ (Q-టిప్స్) ఉపయోగిస్తారు. కానీ వీటిని ఉపయోగించకపోవడమే మంచిదని అంటున్నారు. చెవిలో గులిమిని తీయడానికి దానిని లోతుగా పంపిస్తే.. చెవి నొప్పి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాటిని ఉపయోగించకపోవడమే మంచిదని చెప్తున్నారు.
ఇయర్ డ్రాప్స్ : చెవిలో గులిమిని తీయడానికి లేదా నొప్పిని తగ్గించుకోవడానికి మీరు ఇయర్ డ్రాప్స్‌ని వాడువచ్చు. వైద్యులు సూచించిన ఇయర్ డ్రాప్స్‌ని ఉపయోగిస్తే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి.
చెవులను డ్రై చేయాలి : తలస్నానం లేదా స్నానం చేసిన తర్వాత చెవిలో తడివల్ల బ్యాక్టీరియా పెరిగే ప్రమాదముంది. కాబట్టి చెవులను డ్రై చేసుకోవాలి. టవల్‌తో తుడుచుకోవాలి. ఇది బ్యాక్టీరియా పెరుగుదలను కంట్రోల్ చేస్తుంది.
షార్ప్ వస్తువులు వాడకూడదు : చెవిలోపలి పొర చాలా సున్నితంగా ఉంటుంది. కాబట్టి చెవులను శుభ్రం చేయడానికి షార్ప్‌గా ఉండే వస్తువులు వాడకూడదు. బాబీ పిన్లు, పిన్స్ పెట్టుకోకూడదు.
వైద్య సహాయం : చెవిలో గులిమి ఎక్కువగా ఉన్నా.. అసౌకర్యం, నొప్పి ఉన్నా.. వెద్యుల సహాయం తీసుకోవాలి. ENT స్పెషలిస్ట్‌ని కన్సల్ట్ అయితే మంచి ఫలితాలుంటాయి.
మరిన్ని జాగ్రత్తలు
చెవిలో గులిమి పేరుకుపోతే ఇయర్ డ్రాప్స్ ఉపయోగించాలి. దురద వస్తే కూడా ఇయర్ డ్రాప్స్, టాపికల్ క్రీమ్ ఉపయోగించవచ్చు. నొప్పి వస్తే.. కారణం గుర్తించడానికి వైద్యుల సహాయీ తీసుకోవాలి. చెవి సమస్యలు రాకుండా రెగ్యులర్‌గా చెకప్స్ చేయించుకోవాలి. చెవులను డ్రైగా ఉంచుతూ.. వేటిని లోపల పెట్టకూడదు. దీనివల్ల ఇన్ఫెక్షన్లు దూరమవుతాయి.
ఇయర్ ప్లగ్స్ వాడేప్పుడు ఎక్కువ శబ్ధం లేకుండా చూసుకోవాలి. ఇవి చెవులు డ్యామేజ్ కాకుండా హెల్ప్ చేస్తాయి. ఇయర్ వాక్స్ ఎక్కువ అయితే వినికిడిలో మార్పులు వస్తాయి. ఇబ్బందిగా ఉంటుంది. చెవి నొప్పి ఎక్కువగా ఉంటే జ్వరం రావడం, చెవి నుంచి ఇతర స్రావాలు కారడం జరుగుతాయి. ఇన్ఫెక్షన్ గుర్తిస్తే వెంటనే వైద్యుల సహాయం తీసుకోవాలి.
Also Read : చెవి మసాజ్‌తో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్.. మసాజ్ టెక్నిక్స్ ఇవే..
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.






















