అన్వేషించండి

Ear Massage Techniques : చెవి మసాజ్​తో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్.. మసాజ్ టెక్నిక్స్ ఇవే..

స్ట్రెస్ తగ్గించుకోవాలనుకుంటే మీరు మీ చెవులకు మసాజ్ చేయవచ్చు. ఈ మసాజ్ టెక్నిక్స్​ ఫాలో అయితే ఈజీగా ఒత్తిడి తగ్గించుకోవచ్చు.

Ear Massage Techniques : మీరు మానసికంగా, శారీరకంగా అలసిపోయినప్పుడు విశ్రాంతి కోరుకుంటారు. అలాంటప్పుడు మసాజ్ మీకు మంచి రిలీఫ్ ఇస్తుంది. కొన్నిసార్లు మీరు మీ మొత్తం శరీరానికి మసాజ్ చేయించుకోలేని పరిస్థితిలో ఉంటే మీరు మీ చెవులకు మసాజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఆఫీస్​లో ఉన్నప్పుడు కాస్త ఒత్తిడి తగ్గించుకోవాలనుకున్నప్పుడు కూడా దీనిని సులభంగా చేసుకోవచ్చు. కేవలం ఒత్తిడి తగ్గించుకునేందుకే కాదండోయ్.. చెవులకు రోజూ మసాజ్ చేయడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి.


చెవి మసాజ్, ఆరిక్యులర్ థెరపీ అని కూడా పిలుస్తారు. కేవలం చెవులకు మసాజ్​ చేయడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని పలు అధ్యయనాలు పేర్కొన్నాయి. ఎందుకంటే చెవులలో వివిధ అవయవాలు, వ్యవస్థలకు సంబంధించిన నిర్థిష్ట పాయింట్లు కలిగి ఉంటాయి. కాబట్టి చెవులకు మసాజ్ చేయడం వల్ల మొత్తం శరీరం బెనిఫిట్స్ పొందుతుంది. అయితే సున్నితమైన చెవులకు ఏ విధంగా మసాజ్ చేయాలో మీకు తెలియట్లేదా? అయితే ఇది మీకోసమే. 

చెవులకు మసాజ్ ఎలా చేయాలంటే..

బయటి చెవులు, లోబ్​లను రుద్దడం.. సున్నితంగా లాగడం, నొక్కడం చేస్తే మీకు స్ట్రెస్ వెంటనే తగ్గిన ఫీల్ వస్తుంది. చెవులలోని వివిధ భాగాలను.. ముఖ్యంగా లోబ్​లను సున్నితంగా మసాజ్ చేయడం వల్ల మీ మెదడు ఎండార్ఫిన్​లను విడుదల చేస్తుంది. అంతేకాకుండా శరీరంలో అనేక నరాలు ఉత్తేజితమవుతాయి. ఈ హార్మోన్లు మానసిక పరిస్థితిని మెరుగుపరుస్తాయి. నొప్పిని తగ్గించి.. శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. 

మీ చేతుల మధ్య వెచ్చదనం అనుభూతి కలిగే వరకు అరచేతులను కలిపి రుద్దండి. మీ వేడెక్కిన అరచేతులను మీ చెవులపై ఉంచండి. మీ చెవులను మీ చేతులతో కప్పి ఉంచి.. కొంత సమయం పాటు ధ్యాన భంగిమలో కూర్చోండి. మీ వేళ్లను ఉపయోగించి.. మీ చెవుల బయటి భాగాన్ని తేలికగా మసాజ్ చేయండి. మసాజ్ చేయడానికి మీ చెవుల పైభాగాన్ని సున్నితంగా నొక్కండి. అనంతరం సున్నితంగా మడవండి. ఇది ఒకరకమైన మసాజ్ టెక్నిక్

మరిన్ని మసాజ్ టెక్నిక్స్..

మీ చెవి దిగువ, మధ్య భాగాలను మసాజ్ చేయడానికి మీ బొటనవేలు, చూపుడు వేళ్లను ఉపయోగించి మీ లోబ్​లను మసాజ్ చేయండి. మీ అరచేతులతో కప్పు మాదిరిగా పెట్టి.. మీ చెవులను సున్నితంగా మూసివేయండి. వాటిని కొన్నిసార్లు పదే పదే తెరవండి. మళ్లీ క్లోజ్ చేయండి. అనంతరం మీ చెవుల లోబ్​లను సున్నితంగా ఒత్తడానికి మీ బొటనవేలు, చూపుడు వేళ్లను ఉపయోగించండి. 

ప్రయోజనాలు ఏంటంటే..

మీరు ఒత్తిడితో తరచూ ఇబ్బందిపడుతూ ఉంటే చెవులకు రెగ్యూలర్​గా మసాజ్ చేయడం వల్ల మీ టెన్షన్, స్ట్రెస్ అంతా దూరమవుతుంది. నాడీ వ్యవస్థను రిలాక్స్ చేసి ఒత్తిడి, ఆందోళనను తగ్గించుకోవచ్చు. తలనొప్పి నివారణకు చెవి మసాజ్ సమర్థవంతమైన చికిత్సగా చెప్పవచ్చు.  తలనొప్పి, మైగ్రేన్​తో ఇబ్బంది పడేవారు, శరీరంలోని ఇతర భాగాలలో అసౌకర్యాన్ని తగ్గించుకోవాలనుకునేవారు చెవికి మసాజ్ చేసుకోవడంవల్ల ఉపశమనం పొందుతారు. సరైన నిద్రలేక, రాక ఇబ్బందిపడేవారు కూడా ఇలా మసాజ్ చేసుకోవడం వల్ల నిద్ర నాణ్యత పెరుగుతుంది. 

Also Read : మీ పిల్లలు నోట్లో వేలు పెట్టుకుంటున్నారా? ఇలా మాన్పించేయండి

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నా' - బన్నీ ఇంటిపై దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
'సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నా' - బన్నీ ఇంటిపై దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
Devansh: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
Best Gifts For Christmas: రూ.2000 ధరలో బెస్ట్ క్రిస్మస్ గిఫ్ట్‌లు ఇవే - స్పీకర్ల నుంచి స్మార్ట్ వాచ్ దాకా!
రూ.2000 ధరలో బెస్ట్ క్రిస్మస్ గిఫ్ట్‌లు ఇవే - స్పీకర్ల నుంచి స్మార్ట్ వాచ్ దాకా!
Allu Aravind: 'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Police Released CCTV Footage of Allu Arjun | అల్లు అర్జున్ సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేసిన పోలీసులు | ABP DesamNara Devaansh Chess World Record | వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటుసాధించిన దేవాన్ష్ | ABP DesamAttack on Allu Arjun House | అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి | ABP Desam8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నా' - బన్నీ ఇంటిపై దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
'సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నా' - బన్నీ ఇంటిపై దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
Devansh: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
Best Gifts For Christmas: రూ.2000 ధరలో బెస్ట్ క్రిస్మస్ గిఫ్ట్‌లు ఇవే - స్పీకర్ల నుంచి స్మార్ట్ వాచ్ దాకా!
రూ.2000 ధరలో బెస్ట్ క్రిస్మస్ గిఫ్ట్‌లు ఇవే - స్పీకర్ల నుంచి స్మార్ట్ వాచ్ దాకా!
Allu Aravind: 'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
Top 5 Mileage Cars: మనదేశంలో బెస్ట్ మైలేజీలు ఇచ్చే ఐదు కార్లు ఇవే - డామినేషన్ ఆ కంపెనీదే!
మనదేశంలో బెస్ట్ మైలేజీలు ఇచ్చే ఐదు కార్లు ఇవే - డామినేషన్ ఆ కంపెనీదే!
Bride asks for Beer and Ganja : ఫస్ట్​ నైట్​ రోజు భర్తను బీర్​, గంజాయి అడిగిన భార్య.. రోజులు మారుతున్నాయి బ్రో, జాగ్రత్త
ఫస్ట్​ నైట్​ రోజు భర్తను బీర్​, గంజాయి అడిగిన భార్య.. రోజులు మారుతున్నాయి బ్రో, జాగ్రత్త
Guntur News: హాస్టల్‌లో బిడ్డకు జన్మనిచ్చిన ఫార్మసీ విద్యార్థిని - జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహం, అధికారిణి సస్పెండ్
హాస్టల్‌లో బిడ్డకు జన్మనిచ్చిన ఫార్మసీ విద్యార్థిని - జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహం, అధికారిణి సస్పెండ్
Allu Arjun: 'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
Embed widget