Ram Charan - Samantha: రామ్ చరణ్ జంటగా సమంత... 'రంగస్థలం' పెయిర్ రిపీట్ చేస్తున్న సుకుమార్!?
RC 17 Actress: 'రంగస్థలం'లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సమంత జంటగా నటించారు. మళ్ళీ ఆ జోడీని రిపీట్ చేయాలని దర్శకుడు సుకుమార్ భావిస్తున్నారట. ఆ వివరాల్లోకి వెళితే...

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), క్రియేటివ్ జీనియస్ సుకుమార్ (Sukumar) కలిసి 'రంగస్థలం' సినిమా చేశారు. ఇప్పుడు మరో సినిమా చేయడానికి రెడీ అయ్యారు. ఆ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం సమంత (Samantha) అయితే బాగుంటుందని భావిస్తున్నారట. ఆ వివరాల్లోకి వెళితే...
'రంగస్థలం' జోడి రిపీట్ అవుతుందా?
'రంగస్థలం' విడుదల సమయానికి రామ్ చరణ్ గ్లోబల్ రేంజ్ వరకు వెళ్లలేదు. అదే విధంగా దర్శకుడు సుకుమార్ కూడా 'పుష్ప' తీయలేదు. 'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం'తో రామ్ చరణ్, 'పుష్ప' ఫ్రాంచైజీ (రెండు సినిమాల)తో సుకుమార్ నేషనల్ వైడ్ ఆడియన్స్ అందరినీ ఆకట్టుకున్నారు. ఇక సమంత విషయానికి వస్తే ఫ్యామిలీ మెన్, సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీసులు చేయడం ద్వారా ఉత్తరాది ప్రేక్షకులకు దగ్గర అయ్యారు.
రామ్ చరణ్, సుకుమార్, సమంత... ఇప్పుడు ఈ ముగ్గురికి జాతీయ స్థాయిలో, ఇంకా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. సో ఇప్పుడు ఈ ముగ్గురు సినిమా చేస్తే ఒక స్థాయిలో అంచనాలు ఉంటాయని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. దర్శకుడు సుకుమార్ కూడా రామ్ చరణ్ హీరోగా తాను తీయబోయే తాజా సినిమాలో సమంత హీరోయిన్ అయితే బాగుంటుందని భావిస్తున్నారట.
ప్రస్తుతం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో నటిస్తున్న 'పెద్ది' (RC 16) సినిమా పనులు, చిత్రీకరణలో రామ్ చరణ్ బిజీగా ఉన్నారు. దీని తర్వాత సుకుమార్ దర్శకత్వంలో సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళతారు. అయితే అందులో సమంత హీరోయిన్ అనేది ఖరారు అయ్యిందా? లేదా? అనేది కొన్ని రోజులు ఆగితే తెలుస్తుంది. హీరోగా రామ్ చరణ్ 17వ సినిమా ఇది (RC17).
గ్లోబల్ స్థాయిలో రిలీజ్ చేసేలా!
రామ్ చరణ్, సుకుమార్ సినిమాను గత ఏడాది హోలీ సందర్భంగా అనౌన్స్ చేశారు. ఈ పాటికి సినిమా చిత్రీకరణ ప్రారంభం కావాలి. అయితే 'గేమ్ చేంజర్' షూటింగ్, రిలీజ్ ఆలస్యం కావడంతో ఈ సినిమా కాస్త వెనక్కి వెళ్ళింది. మరోవైపు సుకుమార్ కూడా 'పుష్ప' విడుదల తర్వాత కొంత విశ్రాంతి తీసుకోవాలని భావించారు. త్వరలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. హై అండ్ ఎనర్జిటిక్ యాక్షన్ సినిమాగా RC17 ఉండబోతుందని తెలిసింది. త్వరలో ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.
సుకుమార్ ప్రతి సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తారు. రామ్ చరణ్ హీరోగా చేయబోయే సినిమాకు కూడా ఆయనే సంగీతం అందించనున్నారు. సుకుమార్ లాస్ట్ మూడు సినిమాలు ప్రొడ్యూస్ చేసిన మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు రవిశంకర్, నవీన్ యెర్నేని ఈ సినిమా కూడా ప్రొడ్యూస్ చేస్తారు.
Also Read: మా అమ్మ సూసైడ్ అటెంప్ట్ చేయలేదు... సింగర్ కల్పన కేసులో క్లారిటీ ఇచ్చిన కుమార్తె





















