Star Maa Serials TRP Ratings: టీఆర్పీ రేటింగ్స్ వచ్చేశాయ్... 'జీ తెలుగు'ను డామినేట్ చేసిన 'స్టార్ మా' - ఈ వారం లిస్టులో టాప్ 10 సీరియల్స్ ఏవో చూడండి
Telugu Serials TRP Ratings Latest: ఫిబ్రవరి నాలుగో వారానికి సంబంధించిన తెలుగు టీవీ సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్ వచ్చేశాయి. 'కార్తీక దీపం 2' టాప్‌లో ఉంటే... ఈ వారం టాప్ 10 లిస్టులో ఏమున్నాయో తెలుసా?

Telugu TV serials TRP Ratings This Week - Check Top 10 List: తెలుగు టీవీ సీరియల్ టీఆర్పీ రేటింగ్స్ విషయానికి వస్తే... 'స్టార్ మా'లో టెలికాస్ట్ అయ్యే 'కార్తీక దీపం 2 నవ వసంతం' మరోసారి తన మొదటి స్థానాన్ని నిలుపుకొంది. ఫిబ్రవరి నాలుగో వారంలోనూ (2025లో ఎనిమిదో వారం) ఆ సీరియల్ దుమ్ము దులిపింది. టీఆర్పీ రేటింగ్ 13 కంటే ఎక్కువ సాధించింది. మరి, మిగతా తొమ్మిది స్థానాల్లో ఏయే సీరియల్స్ ఉన్నాయి? 'కార్తీక దీపం 2' తర్వాత స్థానాల్లో నిలిచిన తొమ్మిది సీరియల్ ఏమిటి? ఈ లిస్టు చూసి తెలుసుకోండి.
డాక్టర్ బాబు తర్వాత ప్రభాకర్...
'స్టార్ మా'లో టాప్ 5 సీరియల్స్ అవే!
కార్తీక దీపానికి ఎదురు లేదని ఫిబ్రవరి నాలుగో వారం టీఆర్పీ రేటింగ్స్ చూస్తే మరోసారి అర్థం అవుతోంది. టాప్ 10 లిస్టు తీస్తే... 13.32 టీఆర్పీతో 'స్టార్ మా' ఛానల్ వరకు మాత్రమే కాదు, లాస్ట్ వీక్ తెలుగు టీవీ చానల్స్ అన్నిటిలోనూ హయ్యస్ట్ టీఆర్పీ సాధించి కింద రికార్డు క్రియేట్ చేసింది.
'కార్తీక దీపం 2' తర్వాత స్థానంలో బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్, సీనియర్ హీరోయిన్ ఆమని ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' నిలిచింది. ఆ సీరియల్‌కు 12.51 టీఆర్పీ వచ్చింది. ఆ తర్వాత స్థానంలో 12.40 టీఆర్పీతో 'గుండె నిండా గుడిగంటలు' నిలిచింది. 'ఇంటింటి రామాయణం' 11.91 టీఆర్పీతో, 'చిన్ని' సీరియల్ 9.86 టీఆర్పీతో తర్వాత స్థానాల్లో నిలిచాయి.
మానస్ నాగులపల్లి, దీపిక రంగరాజు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 'బ్రహ్మముడి' సీరియల్ ఫిబ్రవరి నాలుగో వారంలో 6.75 టీఆర్పీ సాధించింది. దాని కంటే ముందు 8.91 టీఆర్పీతో 'నువ్వుంటే నా జతగా', 7.10 టీఆర్పీతో 'మగువా ఓ మగువా' ఉన్నాయి. 'పలుకే బంగారమాయనా' సీరియల్ 6.34 నాలుగు టీఆర్పీ సాధించింది.
స్టార్ మా లో టాప్ 5 తర్వాత...
జీ తెలుగు టీఆర్పీ రేటింగ్స్ షురూ!
'స్టార్ మా' ఛానల్ టాప్ 5 రేటింగ్స్ చూస్తే... ఐదో స్థానంలో నిలిచిన 'చిన్ని' 9.86 టీఆర్పీ సాధించింది. 'జీ తెలుగు'లో టాప్ సీరియల్ టీఆర్పీ రేటింగ్ దాని కంటే తక్కువ ఉంది.
'జీ తెలుగు'లో ఫిబ్రవరి నాలుగో వారంలో టాప్ రేటింగ్ సాధించిన సీరియల్ 'జగద్ధాత్రి'. దానికి 7.08 టీఆర్పీ వచ్చింది. ఆ తర్వాత 6.97 టీఆర్పీతో 'చామంతి', 6.90 టీఆర్పీతో 'మేఘ సందేశం', 6.80 టీఆర్పీతో 'పడమటి సంధ్యారాగం', 5.96 టీఆర్పీతో 'అమ్మాయి గారు' సీరియల్స్ నిలిచాయి. 'జీ తెలుగు'లో టాప్ ఫైవ్ రైటింగ్ సాధించిన సీరియల్స్ ఇవి.
Also Read: నాని, దేవరకొండ మధ్యలోకి అనసూయ... బూతు మాట్లాడితే బయటకు రాలేదే?
ఇక 'జీ తెలుగు'లో మిగతా సీరియల్స్ విషయానికి వస్తే... 'ఉమ్మడి కుటుంబం' (3.00), 'ప్రేమ ఎంత మధురం' (4.13), 'మా అన్నయ్య' (3.37), 'కలవారి కోడలు కనకమహాలక్ష్మి' (3.66), 'ముక్కు పుడక' (3.33), 'గుండమ్మ కథ' (3.47) టీఆర్పీ సాధించాయి
ఈటీవీ, జెమినీ టీవీ సీరియల్స్ ఎప్పటిలాగానే టీఆర్పీ విషయంలో స్టార్ మా, జీ తెలుగు కంటే వెనుకబడ్డాయి. ప్రతివారం ఈటీవీలో టాప్ రేటింగ్ సాధించే సీరియల్ 'రంగులరాట్నం'. ఈ వారం దానికి 3.65 టీఆర్పీ వచ్చింది. ఆ తర్వాత రెండో స్థానంలో 'మనసంతా నువ్వే' (3.45), మూడో స్థానంలో 'బొమ్మరిల్లు' (3.05), నాలుగో స్థానంలో 'ఝాన్సీ' (2.90) నిలిచాయి. 'శతమానం భవతి'కి 1.76 టీఆర్పీ వచ్చింది. జెమినీ టీవీలో టాప్ రేటింగ్ సాధించిన టీవీ సీరియల్ 'శ్రీమద్ రామాయణం' దానికి 0.87 టీఆర్పీ వచ్చింది. తర్వాత స్థానంలో 'భైరవి' (0.85) నిలిచింది.
Also Read: విజయ్ దేవరకొండను నాని తొక్కేస్తున్నాడా? సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్... మంట పెట్టిన యూట్యూబర్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

