Sudigali Sudheer: రష్మితో మూవీ, సుడిగాలి సుధీర్ ఏమన్నాడంటే?
Sudigali Sudheer: యాంకర్ రష్మితో కలిసి సినిమా చేయడం గురించి సుడిగాలి సుధీర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇద్దరం కలిసి నటించాలనే ప్రపోజల్ ఉన్నా, నచ్చిన కథ దొరకలేదని చెప్పారు.
![Sudigali Sudheer: రష్మితో మూవీ, సుడిగాలి సుధీర్ ఏమన్నాడంటే? Sudigali Sudheer About Movie With Rashmi Gautam we are listening stories Telugu news Sudigali Sudheer: రష్మితో మూవీ, సుడిగాలి సుధీర్ ఏమన్నాడంటే?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/22/437e1de2d4aec1d13496644a208bb0e01700627579472544_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Sudigali Sudheer About Movie With Rashmi Gautam: సుడిగాలి సుధీర్ గురించి బుల్లితెర ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. ‘జబర్దస్త్’ షో ద్వారా లక్షలాది మంది ఆడియెన్స్ ను ఎంతగానో అలరించాడు. చక్కటి స్కిట్స్, అదిరిపోయే పంచులలో పడి పడి నవ్వేలా చేశాడు. ఈ షో ద్వారా వచ్చిన పాపులారిటీతో వెండితెరపై అడుగు పెట్టాడు. ముందు కమెడియన్ పాత్రలు షోషించాడు. నెమ్మదిగా హీరోగా మారిపోయాడు. చక్కటి కథలను ఎంచుకుంటూ కెరీర్ కొనసాగిస్తున్నారు. ఇక బుల్లితెరపై యాంకర్ రష్మి, సుడిగాలి సుధీర్ కు యూత్ లో ఓ రేంజిలో క్రేజ్ ఉంది. వీరిద్దరూ కలిసి కనిపిస్తే చాలు అభిమానులు ఫుల్ ఖుషీ అవుతారు. ఇప్పటికే రష్మి కూడా హీరోయిన్ గా పలు సినిమాలు చేసింది. అనుకున్న స్థాయిలో రాణించలేకపోయినా, అడపాదడపా సినిమాలు చేస్తూనే ఉంది. రష్మి-సుధీర్ కలిసి సినిమా చేస్తే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు. తాజాగా వీరిద్దరు కలిసి చేయబోయే మూవీ గురించి సుధీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కథ నచ్చితే కలిసి నటిస్తాం- సుధీర్
ప్రస్తుతం సుధీర్ హీరోగా చేస్తున్న సినిమా ‘కాలింగ్ సహస్ర’. ఈ మూవీ డిసెంబర్ 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలు ముమ్మరం చేసింది. అందులో భాగంగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో సుడిగాలి సుధీర్ పాల్గొన్నాడు. ‘కాలింగ్ సహస్ర’ సినిమాతో పాటు పలు ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించాడు. యాంకర్ రష్మితో కలిసి సినిమా ఎప్పుడు చేస్తారు? అనే ప్రశ్నకు ఆయన స్పందించారు. ఆ ప్రపోజల్ ఉన్నట్లు వెల్లడించారు. “ గత కొద్ది కాలంగా నేను, రష్మి కలిసి కథలు వింటున్నాం. ఇప్పటి వరకు ఇద్దరికీ కామన్ గా నచ్చిన స్టోరీ దొరకలేదు. ఒకవేళ అలాంటి స్టోరీ ఓకే అయితే కచ్చితంగా ఇద్దరం కలిసి చేస్తాం” అని వెల్లడించాడు.
‘కాలింగ్ సహస్ర’ మంచి సస్పెన్స్ థ్రిల్లర్- సుధీర్
‘కాలింగ్ సహస్ర’ సినిమా గురించి సుధీర్ స్పందించాడు. మంచి సస్పెన్స్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను బాగా అలరిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పాడు. “ఇది నా మూడో సినిమా. ఈ రోజుల్లో ఒక సినిమా హిట్ కు ఏకైక కారణం కంటెంట్. కంటెంట్ బాగుంటే కచ్చితంగా విజయం సాధించి తీరుతుంది. ఈ సినిమా కూడా చక్కటి కంటెంట్ తో వస్తోంది. ఓ మంచి సస్పెన్స్ థ్రిల్లర్ చూడాలి అనుకునే వారికి ఈ సినిమా చక్కగా నచ్చుతుంది. బాగా ఎంజాయ్ చేస్తారు కూడా. నాకు పెద్ద పెద్ద కోరికలు లేవు. నన్ను హీరోగా పెట్టి సినిమా చేసిన నిర్మాతలకు లాభాలు వస్తే చాలు. జనాలు కూడా నా సినిమా గురించి పాజిటివ్ గా మాట్లాడుకుంటే హ్యాపీగా ఫీలవుతా” అని చెప్పాడు. అరుణ్ విక్కిరాలా దర్శకత్వంలో తెరకెక్కిన ‘కాలింగ్ సహస్ర’ మూవీలో డాలీషా హీరోయిన్ గా నటిస్తోంది.
Read Also: రిక్షా ఎక్కాలనే సరదా నా ఆడ బిడ్డ కాలు పోగొట్టింది, నా కొడుకేమో అలా: కోట శ్రీనివాసరావు భావోద్వేగం
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)