అన్వేషించండి

Kota Srinivasa Rao: రిక్షా ఎక్కాలనే సరదా నా ఆడ బిడ్డ కాలు పోగొట్టింది, నా కొడుకేమో అలా: కోట శ్రీనివాసరావు భావోద్వేగం

Kota Srinivasa Rao: సినీ నటుడు కోట శ్రీనివాసరావు తన జీవితంలో ఎన్నో బాధలు అనుభవించినట్లు చెప్పారు. రోడ్డు ప్రమాదంలో తన కూతురు కాలు పోగా, కొడుకు ప్రాణాలు పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.

Kota Srinivasa Rao: తెలుగు సినిమా పరిశ్రమలో దిగ్గజ నటుడిగా వెలుగొందారు కోట శ్రీనివాసరావు. విల‌న్‌గా, క‌మెడియ‌న్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా అద్భుతంగా రాణించారు. పాత్ర ఏదైనా ఇట్టే ఒదిగిపోయి నటించే వారు. తెలుగులోనే కాదు, త‌మిళం, క‌న్నడ‌, మ‌ల‌యాళ‌ సినిమాల్లోనూ ఆయన నటించారు. ఎన్నో వైవిధ్యభరిత పాత్రల్లో కనిపించి ఆకట్టుకున్నారు. వయోభారం కారణంగా గత కొంతకాలంగా ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్నారు. రీసెంట్ గా ఓ వెబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు కీలక విషయాలు వెల్లడించారు. తన జీవితంలో ఎన్నో బాధలు అనుభవించినట్లు చెప్పారు. రోడ్డు ప్రమాదాలు తమ కుటుంబంలో తీరని శోకం నింపినట్లు వెల్లడించారు.  

రిక్షాను లారీ ఢీకొట్టడంతో మా కూతురు కాలు పోయింది- కోట

తన కూతురుకు రిక్షాలో ఎక్కడం అంటే చాలా సరదగా ఉండేదని చెప్పారు. ఓసారి విజయవాడలో తన బంధువుల పిల్లలతో కలిసి కోట కూతురు రిక్షా ఎక్కిందట. సరదాగా రిక్షా ప్రయాణం చేస్తుండగా ఊహించని ఘటన జరిగిందట. ఎదురుగా వస్తున్న లారీ బ్రేకులు ఫెయిల్ కావడంతో కోటా కూతురు ప్రయాణిస్తున్నన రిక్షాను ఢీకొట్టడంతో పాటు అక్కడున్న కొంత మంది మీది నుంచి దూసుకెళ్లిందట. ఈ ప్రమాదంలో ముగ్గురు, నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా, తన కూతురు ప్రాణాలతో బయటపడిందని చెప్పారు కోట. అయితే, ఓ కాలు కోల్పోయినట్లు చెప్పారు. ఆ సమయంలో తమ ఇళ్లంతా దుఃఖ సాగరంలో మునిగిపోయినట్లు చెప్పారు.  

గుమస్తాగా ఎవరి దగ్గర పని చేశానో ఆయనతోనే వియ్యం అందుకున్నా-కోట

తన కూతురు భవిష్యత్ ఏంటా? అని ఆందోళన పడుతున్న సమయంలోనే ఓ మంచి వార్త విన్నట్లు చెప్పారు కోట శ్రీనివాసరావు. తను  ఒకప్పుడు బ్యాంకులో ఎవరి దగ్గర అయితే గుమస్తాగా పని చేశారో ఆయనతోనే వియ్యం అందుకున్నట్లు చెప్పారు. వారింటికే తన కూతురు కోడలిగా వెళ్ళిందన్నారు. మంచి కుటుంబంలో ఆమె జీవితం హ్యాపీగా కొనసాగుతుందని చెప్పారు. ఇప్పుడు ఆమెకు ఓ కూతురు  ఉందని చెప్పారు. ఇక అంతా సెట్ అయ్యింది, కుటుంబం హ్యాపీగా ఉందని అనుకుంటున్న సమయంలోనే మరో రోడ్డు ప్రమాదం తన కుటుంబాన్ని అతలాకుతలం చేసిందన్నారు. యాక్సిడెంట్ లో తన కొడుకు చనిపోయినట్లు వెల్లడించారు. కుటుంబ పరంగా ఎన్నో ఇబ్బందులు పడినా, సినిమాల్లో ఆ బాధను కనిపించకుండా జాగ్రత్త పడ్డానని చెప్పారు కోట.

కోటా చనిపోయారంటూ నెట్టింట్లో ఊహాగానాలు

ఇక రీసెంట్ గా కోట గురించి ఓ విషాదబరితమైన వార్త సోషల్‌ మీడియాలో తెగ ప్రచారం జరిగింది. కోట శ్రీనివాసరావు చనిపోయాని చాలా మంది నెటిజన్లు పోస్టులు పెట్టారు. ఈ వార్తలపై కోట ఆవేదన వ్యక్తం చేశారు.  తాను ఆర్యోగంగానే ఉన్నానని, వదంతులు నమ్మొద్దని కోరారు. “నేను మృతి చెందినట్లు సోషల్‌ మీడియాలో కొందరు ప్రచారం చేస్తున్నారు. నా ఆరోగ్యం విషమించిందని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నానని వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలే. నేను ఆరోగ్యంగానే ఉన్నాను. వాస్తవాలు తెలుసుకోకుండా ఇలా ప్రచారం చేయడం మంచిది కాదు.  ఈ వార్తలు చూసి నా కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు బాధపడ్డారు. దయచేసి బతికున్న నన్ను చంపేయకండి” అని కోట ఆవేదన వ్యక్తం చేశారు.  

Read Also: ‘జబర్దస్త్’ స్టేజ్‌పై గుండు కొట్టించుకున్న బుల్లెట్ భాస్కర్, కోపంతో షో నుంచి వెళ్లిపోయిన ఖుష్బూ!

టాప్ హెడ్ లైన్స్

Raaka Update : 'రాకా' నలుగురు హీరోయిన్స్ - ఎవరి రోల్ ఏంటో తెలుసా?
'రాకా' నలుగురు హీరోయిన్స్ - ఎవరి రోల్ ఏంటో తెలుసా?
Mr Perfect Case: 'దిల్' రాజుకు ఊరట... 'మిస్టర్ పర్ఫెక్ట్' కాపీరైట్ కేసు అప్డేట్ ఏమిటంటే?
'దిల్' రాజుకు ఊరట... 'మిస్టర్ పర్ఫెక్ట్' కాపీరైట్ కేసు అప్డేట్ ఏమిటంటే?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Irumudi Trailer Review : ఇరుముడి ట్రైలర్ వచ్చేసింది - కూతురినే కాదు ఆడపిల్లలను కాపాడే తండ్రిగా రవితేజ... యాక్షన్ థ్రిల్లర్ విత్ ఎమోషనల్ స్టోరీ
ఇరుముడి ట్రైలర్ వచ్చేసింది - కూతురినే కాదు ఆడపిల్లలను కాపాడే తండ్రిగా రవితేజ... యాక్షన్ థ్రిల్లర్ విత్ ఎమోషనల్ స్టోరీ

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Adilabad Latest News: సీసీఐ పరిశ్రమపై జెన్ జీల పోరాటం- ముందే మేల్కోవాలని ముఖ్యమంత్రికి ప్రొఫెసర్ కాశీం సూచన 
సీసీఐ పరిశ్రమపై జెన్ జీల పోరాటం- ముందే మేల్కోవాలని ముఖ్యమంత్రికి ప్రొఫెసర్ కాశీం సూచన 
Telangana High Court: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే.. కారణం ఏంటంటే..
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే.. కారణం ఏంటంటే..
మంగళ గౌరీ వ్రత కథ: శ్రావణ మంగళవారం గౌరీ దేవి పూజ సమయంలో ఈ కథ తప్పనిసరిగా చదువుకోవాలి!
మంగళ గౌరీ వ్రత కథ: శ్రావణ మంగళవారం గౌరీ దేవి పూజ సమయంలో ఈ కథ తప్పనిసరిగా చదువుకోవాలి!
Agri Gold Victims: అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం - ఆస్తులు వేలం వేసి చెల్లింపులు - ఆటంకాలు లేకుండా పూర్తి చేయగలరా?
అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం - ఆస్తులు వేలం వేసి చెల్లింపులు - ఆటంకాలు లేకుండా పూర్తి చేయగలరా?
Karthika Deepam 2 Serial Today August 13th: కార్తీకదీపం 2 సీరియల్: రెస్టారెంట్ ఎవరిది? మాలిని 5 లక్షలు ఆఫర్! జ్యోత్స్న నిర్ణయమేంటి?
కార్తీకదీపం 2 సీరియల్: రెస్టారెంట్ కోసం బిగ్ ఫైట్? మాలిని 5 లక్షలు ఆఫర్! జ్యోత్స్న నిర్ణయమేంటి?
Embed widget