Bullet Bhaskar: ‘జబర్దస్త్’ స్టేజ్‌పై గుండు కొట్టించుకున్న బుల్లెట్ భాస్కర్, కోపంతో షో నుంచి వెళ్లిపోయిన ఖుష్బూ!
Bullet Bhaskar: ‘జబర్దస్త్’ కామెడీ షోలో సీరియస్ ఇన్సిడెంట్ జరిగింది. స్కిట్ కోసం స్టేజి మీదే గుండు కొట్టించుకున్నాడు బుల్లెట్ భాస్కర్. ఆయన పద్దతి నచ్చక కోపంతో ఖుష్బూ షో నుంచి వెళ్లిపోయింది.
Extra Jabardasth Latest Promo: తెలుగు బుల్లితెరపై మంచి గుర్తింపు తెచ్చుకున్న షో ‘జబర్దస్త్’. కమెడియన్ల అద్భుతమైన స్కిట్లతో ప్రేక్షకులు నవ్వుల్లో మునిగిపోతారు. కొద్ది కాలం వరకు ‘జబర్దస్త్’ షో మాత్రమే ఉండగా, ఆ తర్వాత ‘ఎక్స్ ట్రా జబర్దస్త్’ ను కూడా యాడ్ చేశారు. ఈ రెండు షోలు ఇప్పటికీ మంచి రేటింగ్ తో దూసుకెళ్తున్నాయి. ప్రేక్షకులను నవ్వించేందుకు కమెడియన్లు ఎప్పటికప్పుడు సరికొత్త స్కిట్లతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కోసారి మంచి రేటింగ్ సంపాదించుకునేందుకు నిర్వాహకులు రకరకాల జిమ్మిక్కులు ప్రదర్శిస్తుంటారు. అందులో భాగంగానే టీమ్ మెంబర్స్ తిట్టుకున్నట్లు, లవ్ ట్రాకులు నడిపినట్లు, జడ్జిలతో గొడవపడినట్లు ప్రోమోలు ప్రేక్షకుల మీదికి వదులుతుంటారు.
స్టేజి మీదే గుండు చేయించుకున్న బుల్లెట్ భాస్కర్
తాజాగా ఆడియెన్స్ అటెక్షన్ ను తమవైపు తిప్పుకునే ప్రయత్నం మరోసారి చేశారు ‘జబర్దస్త్’ నిర్వాహకులు. అందులో భాగంగానే ఏకంగా స్టేజి మీద బుల్లెట్ భాస్కర్ గుండు కొట్టించుకునే ప్రోమో ఒకటి రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘ఎక్స్ ట్రా జబర్దస్త్’ కామెడీ షోలో బుల్లెట్ భాస్కర్ తన టీమ్ తో కలిసి ‘నిజం’ మూవీకి స్పూప్ స్కిట్ వేశారు. ఇందులో గోపీచంద్ గా బుల్లెట్ భాస్కర్, మహేష్ గా నరేష్ కనిపించారు. గోపీచంద్ పాత్రలో భాస్కర్ “పెద్దమ్మ తల్లికి అమ్మోరు తల్లిని బలి ఇవండ్రా” అనగానే, జడ్జి కృష్ణ భగవాన్ జోక్యం చేసుకుంటారు. “సినిమాలో గోపీచంద్ పెద్దమ్మ తల్లి వద్దకు వెళ్ళినప్పుడు ఆయనకు గుండు ఉంటుంది” అని చెప్తారు. “ఫస్ట్ నుంచి పెట్టుకోవాలి సర్, మధ్యలో అంటే కష్టమవుతుంది” అని భాస్కర్ అంటాడు. ఇంతలో కుష్బూ ఇన్వాల్వ్ అవుతూ స్పూప్ చేస్తున్నప్పుడు కరెక్ట్ గా ఉండాలి. ఇక్కడ ఫీల్ అవ్వడానికి ఏం లేదు కదా” అంటుంది. వెంటనే భాస్కర్ కు కోపం వస్తుంది. “స్కిట్ కోసం ప్రాణమిస్తా, జుట్టు పెద్ద ఇంపార్టెంట్ కాదు. మీరు గుండు అంటున్నారు కాబట్టి, 100 శాతం గుండులోనే చూపిస్తా” అంటూ స్టేజి మీదే గుండు గీయించుకుని అందరినీ షాక్ కి గురి చేశాడు.
కోపంతో షో నుంచి వెళ్లిపోయిన ఖుష్బూ
బుల్లెట్ భాస్కర్ గుండు చేయించుకున్నాక “ఇప్పుడు ఓకేనా సార్” అంటూ భాస్కర్ కృష్ణ భగవాన్‌ను అడుగుతాడు. “ఆ ఎఫెక్ట్ కనిపించాలి అన్నాం కానీ.. నిజంగా గుండు గీయించుకుంటే ఎలా?” అంటూ కృష్ణ భగవాన్ అన్నారు. “ఈ విషయాన్ని ముందు చెప్పాలి. అంతా అయిపోయాక బొచ్చు వెనక్కి వస్తుందా?” అంటూ కాస్త ఘాటుగానే సమాధానం చెప్పాడు. భాస్కర్ మాటలపై కుష్బూకు బాగా కోపం వస్తుంది. “మాకు ఓ రెస్పాన్స్ బులిటీ ఇచ్చారు. తప్పు అనిపిస్తే మేము కామెంట్ చేసే ఫ్రీడమ్ లేదంటే ఎలా?” అంటూ మాట్లాడింది. ఒక జడ్జిగా మాకు ప్రశ్న అడిగే రైట్ లేదంటే, ఇక్కడ మేము ఎందుకు ఉండాలి అంటూ సీటులో నుంచి లేచి వెళ్ళిపోతుంది. “థాంక్యూ మేడం” అంటూ భాస్కర్ కూడా స్టేజి మీద నుంచి వెళ్ళిపోయాడు. ప్రస్తుతం ప్రోమో బాగా వైరల్ అవుతోంది. అయితే, ఇదంతా కేవలం స్కిట్ లో భాగమే అంటున్నారు నెటిజన్లు. శుక్రవారం వచ్చే ఈ ఎపిసోడ్ లో వాస్తవం ఏంటో తెలియనుంది.
Read Also: త్రిషాపై కామెంట్స్ - నటుడు మన్సూర్ అలీపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్, పోలీసులకు కీలక ఆదేశాలు