అన్వేషించండి

Mansoor Ali Khan: త్రిషాపై కామెంట్స్ - నటుడు మన్సూర్ అలీపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్, పోలీసులకు కీలక ఆదేశాలు

Mansoor Ali Khan: నటి త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నటుడు మన్సూర్ అలీ ఖాన్‌పై జాతీయ మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. అతడిపై కేసు నమోదు చేయాలని తమిళనాడు పోలీసులను ఆదేశించింది.

National Commission for Womens fire On Mansoor Ali Khan: సౌత్ టాప్ హీరోయిన్ త్రిషపై తమిళ నటుడు మన్సూర్ అలీ ఖాన్ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమీషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తమిళనాడు పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. మన్సూర్ వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించి కేసు నమోదు చేయాలని ఆదేశించింది. మన్సూర్ కామెంట్స్ మహిళలపై లైంగిక వేధింపులు ప్రేరేపించేలా ఉన్నాయని అభిప్రాయపడింది. ఆయన వ్యాఖ్యలను  ఏమాత్రం సహించేది లేదని తేల్చి చెప్పింది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఓ పోస్టు పెట్టింది.

జాతీయ మహిళా కమిషన్ ఏం చెప్పిందంటే?

“మన్సూర్ వ్యాఖ్యల విషయాన్ని మేం చాలా సీరియస్ గా తీసుకున్నాం. ఐపీసీ సెక్షన్‌ 509Bతో పాటు లైంగిక వేధింపులకు సంబంధించిన మరికొన్ని సెక్షన్ల కింద మన్సూర్‌ అలీఖాన్‌పై కేసు నమోదు చేయాలని తమిళనాడు డీజీపీని ఆదేశించాం. ఇలాంటి వ్యాఖ్యలు సమాజంలో లైంగిక హింసకు కారణం అవుతాయి. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం” అని మహిళా కమిషన్‌ ట్విట్టర్‌లో పేర్కొంది.

మన్సూర్ అలీ త్రిష గురించి ఏమన్నారంటే?

తాజాగా ఓ మీడియా చిట్ చాట్ లో మాట్లాడిన మన్సూర్‌ అలీఖాన్‌, ‘లియో’ చిత్రంలో త్రిషతో కలిసి నటించడం పట్ల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆమెతో రేపు సీన్ చేయకపోవడం నిరాశ కలిగించిందని చెప్పుకొచ్చారు. “గతంలో నేను చాలా రేప్‌ సీన్లలో నటించాను. ‘లియో’ సినిమాలో అవకాశం వచ్చినప్పుడు త్రిషతో రేప్‌ సీన్‌ ఉంటుందని భావించాను. అలాంటి సీన్ లేకపోవడం బాధగా అనిపించింది. కనీసం లియో కశ్మీర్ సెట్స్ లో త్రిషను చూడకూడా చూడనివ్వలేదు” అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన మాటలపై నటి త్రిషతో పాటు పలువురు సౌత్ సినీ ప్రముఖులు స్పందిచారు. మన్సూర్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  

మన్సూర్ అలీ వివరణ, మండిపడుతున్న నెటిజన్లు

అటు తన వ్యాఖ్యలపై తప్పుగా ప్రచారం చేశారని మన్సూర్ అలీ ఖాన్ వెల్లడించారు. తన కెరీర్ ను నాశనం చేసేందుకు కొంతమంది కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. " నా మాటలు తప్పుగా అర్థం చేసుకున్నారు. నా వ్యాఖ్యలను వక్రీకరించారు. ఎడిట్ చేసి కొన్ని మాటలు తొలగించారు. లియో మూవీలో ఆమె పాత్ర కీలకం. పర్వతాన్ని ఎత్తిన హనుమంతుడితో ఆమెను పోల్చాను. త్రిషాకు నేను ఇచ్చిన కాంప్లిమెంట్స్ చూపించలేదు. నా కెరియర్ ని నాశనం చేసేందుకు కుట్ర చేస్తున్నారు. నేను గతంలో చాలామంది హీరోయిన్స్ తో కలిసి పని చేశాను. ఎవరితోనూ అసభ్యంగా ప్రవర్తించలేదు" అంటూ తన ఇన్ స్టాగ్రామ్ లో రాసుకొచ్చారు మన్సూర్ అలీ ఖాన్. ఆయన వివరణపైనా పలువురు నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

Read Also: త్రిషకు ఆ తమిళ స్టార్ హీరో లాంటి భర్త కావాలట - పెళ్లి గురించి ఏమంటున్నారో తెలుసా?

టాప్ హెడ్ లైన్స్

Crime Thriller OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Husharu Pittalu OTT : ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget