(Source: ECI/ABP News/ABP Majha)
Trisha : త్రిషకు ఆ తమిళ స్టార్ హీరో లాంటి భర్త కావాలట - పెళ్లి గురించి ఏమంటున్నారో తెలుసా?
Trisha Husband : త్రిష నోటి వెంట పెళ్లి మాట వచ్చింది. ఓ తమిళ స్టార్ హీరో పేరు చెప్పి... తనకు అటువంటి భర్త కావాలని ఆమె అన్నారు. ఇంతకీ, ఆ హీరో ఎవరు? పెళ్లి గురించి త్రిష ఏమన్నారు? వివరాల్లోకి వెళితే...
Trisha Mansoor Ali Khan Issue : త్రిష... ఇప్పుడు వార్తల్లో వ్యక్తి! తమిళ నటుడు మన్సూర్ అలీ ఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దళపతి విజయ్ 'లియో' సినిమాలో ఆయన ఓ కీలక పాత్ర చేశారు. అందులో తనకు, త్రిషకు మధ్య సన్నివేశాలు లేవని... గతంలో ఎన్నో సినిమాలలో హీరోయిన్లను రేప్ చేసినట్లు, త్రిషను రేప్ చేసే సన్నివేశం ఉంటుందని ఆశపడ్డానని... అందుకు అవకాశం లేదన్నట్లు ఇటీవల మన్సూర్ అలీ ఖాన్ చేసిన వ్యాఖ్యలను త్రిష సహా పలువురు నటీనటులు దర్శక నిర్మాతలు ఖండించారు. ఈ తరుణంలో త్రిషకు సంబంధించిన వీడియో ఇంటర్వ్యూలో క్లిప్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందులో ఏముంది? అనే వివరాల్లోకి వెళితే...
త్రిష నోట పెళ్లి మాట...
అజిత్ లాంటి భర్త కావాలి!
Trisha On Marriage and Husband : తమిళ అగ్ర కథానాయకుడు అజిత్, త్రిష కాంబినేషన్ సూపర్ డూపర్ హిట్! గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించిన 'ఎంతవాడు గాని' సినిమాలో వాళ్ళిద్దరూ జంటగా నటించారు. అది తెలుగులోనూ విజయం సాధించింది. అంతకుముందు వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన 'గ్యాంబ్లర్' కూడా తెలుగులో హిట్. తమిళంలో వీళ్ళిద్దరూ చేసిన సినిమాలూ విజయాలు సాధించాయి.
అజిత్ సరసన కథానాయికగా నటించిన ఓ సినిమా విడుదల సందర్భంగా ఆయన గురించి త్రిష మాట్లాడారు. తనకు అజిత్ (Hero Ajith) అంటే చాలా ఇష్టమని, ఆయన స్టార్ హీరో మాత్రమే కాదని... మంచి భర్త, తండ్రి అని త్రిష పేర్కొన్నారు. తనకు అజిత్ లాంటి భర్త కావాలని త్రిష వివరించారు. అయితే... పెళ్లి ఎప్పుడు చేసుకుంటారో చెప్పలేదు
Also Read : మంగళవారం సినిమా రివ్యూ: అమ్మాయిలో లైంగిక వాంఛ ఎక్కువ అయితే? కోరికలు పెరిగితే?
ప్రస్తుతం త్రిష వయస్సు 40 సంవత్సరాలు. గతంలో ఓసారి ఆమె పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. వరుణ్ మణియన్ అని చెన్నైకు చెందిన ఓ వ్యాపారవేత్తతో నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. వరుణ్, త్రిష కలిసి విహార యాత్రలకు కూడా వెళ్లారు. అయితే... కొన్ని రోజులకు వాళ్ళిద్దరి మధ్య బ్రేకప్ జరిగింది. ఆ తర్వాత మరోసారి త్రిష నోటి వెంట పెళ్లి మాట రాలేదు.
కథానాయికగా త్రిష పని కూడా అయిపోయిందని వ్యాఖ్యలు ఆ మధ్య వినిపించాయి. అయితే... విజయ్ సేతుపతికి జోడిగా ఆమెను నటించిన '96' తమిళ భాషలో ఘన విజయం సాధించింది. తెలుగులో ఆ సినిమాను 'జాను' పేరుతో శర్వానంద్, సమంత జంటగా 'దిల్' రాజు రీమేక్ చేశారు. '96' సినిమాతో తమిళనాడు త్రిష మళ్లీ స్టార్ స్టేటస్ అందుకున్నారు మణిరత్నం దర్శకత్వంలో నటించిన 'పొన్నియన్ సెల్వన్' సినిమాలో అయితే ముని పెన్నడూ లేనంత అందంగా కనిపించారని కాంప్లిమెంట్స్ అందుకున్నారు. త్రిష పెళ్లి చేసుకుంటే చూడాలని అభిమానులు చాలా మంది కోరుతున్నారు మరి వాళ్ళ ఆశ ఎప్పుడు నెరవేరుతుందో చూడాలి.
Also Read : 'సప్త సాగరాలు దాటి సైడ్ బి' సినిమా రివ్యూ: రక్షిత్ శెట్టి బ్లాక్ బస్టర్ కొట్టారా? డిజప్పాయింట్ చేశారా?