Uppada Beach Road | ఉప్పాడకే ప్రత్యేకంగా సముద్రం పక్కనే పంట పొలాలు | ABP Desam
ఈ లొకేషన్ ను గుర్తుపట్టారా. ఎక్కడో సినిమా చూసినట్లు ఉంది కదా. ఎస్ ఉప్పెన సినిమాలో మీరు చూసిన లొకేషనే ఇది. కాకినాడ జిల్లా ఉప్పాడ బీచ్ రోడ్ ఇది. మీకేం డౌట్ రాలేదా జనరల్ గా బీచ్ ఉంటే ఎక్కడైనా ఆ చుట్టుపక్కల నాలుగైదు కిలోమీటర్లు చవుడు నేలలే ఉంటాయి. అలాంటి ఉప్పాడ బీచ్ రోడ్ మాత్రం స్పెషల్. ప్రత్యేకించి ఉప్పాడ నుంచి మూలపేట, అమీనాబాద్ వరకూ రోడ్ కి ఇలా అటు వైపు అందమైన బీచ్ ఇటు వైపు పచ్చటి పొలాలు...ఇలా దాదాపు 800ఎకరాల్లో ఉప్పునీటి గాలికి అద్భుతంగా వరి పండుతుండటమే ఇక్కడ విశేషం. మరి అక్కడి స్థానికులు ఈ వింతపై ఏమనుకుంటున్నారు...ఉప్పాడ అందాలను మీరు చూసేయండి.
ఓ వైపు నీలి సముద్రం.. మరో వైపు పచ్చని తివాచీ పరిచినట్లు పచ్చని చేలు.. ఈ చూడముచ్చటైన సుందర దృశ్యం ఇప్పుడు కాకినాడ ఉప్పాడ బీచ్ రోడ్డులో కను విందు చేస్తోంది.. సాధారణంగా సముద్రతీరంలో పంటచేలు చాలా అరుదు... ఎందుకంటే లవణ జలాలతో నిండి ఉండే సాగర తీరంలో వరిసాగు చేయడం చాలా కష్టసాధ్యమైన విషయం.. పూర్తిగా చప్పనీటితో చేసే వ్యవసాయం పక్కనే లవణ జలాలు ఉండడం వల్ల ఫలించే అవకాశాలు చాలా తక్కువ.. కానీ ఉప్పాడ బీచ్ రోడ్డు చెంతనే లవణ జలాలున్నా సుమారు 800 ఎకరాల విస్తీర్ణంలో పంటచేలు బాగా ఎదిగి ఆశ్చర్య పరుస్తున్నాయి.. ఇక్కడి రైతులు చాలా మక్కువ తో ఈవ్యవసాయాన్ని చేస్తున్నారు.. ఓ వైపు సముద్రం, మరో వైపు పచ్చని పంటచేలు ఉన్న సుందర దృశ్యం తిలకించేందుకు సందర్శకులు తరలి వస్తున్నారు..





















