అన్వేషించండి

KCR Assembly: కేసీఆర్‌కూ అనర్హతా వేటు భయం - జగన్ ప్లాన్‌లోనే ఒక్క రోజు సభకు హాజరు?

TG Assembly: బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఒక్క రోజు అసెంబ్లీకి హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో కూడా బడ్జెట్ రోజు హాజరై వెళ్లిపోయారు. ఈ సారి కూడా అదే ఫాలో అయ్యే అవకాశాలు ఉన్నాయి.

KCR likely to attend assembly: తెలుగు రాష్ట్రాల్లో ప్రతిపక్ష నేతలు  అసెంబ్లీకి హాజరు కావడం లేదు. వారు రాకపోతే నిబంధనల ప్రకారం అనర్హతా వేటు వేస్తామని అధికార పార్టీలు హెచ్చరిస్తున్నాయి. ఈ క్రమంలో ఏపీలో ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గవర్నర్ ప్రసంగం రోజున ఒక్క రోజు వెళ్లారు. దాంతో హాజరు కావడం లేదన్న కారణంతో అనర్హతా వేటు పడకుండా జాగ్రత్తలు పడ్డారు. అయితే ఆ హాజరు చెల్లదంటున్నారు కానీ.. అది వేరే విషయం. ఒక్క రోజు జగన్ తన శపథాన్ని పక్కన పెట్టి అసెంబ్లీకి వెళ్లి వచ్చారు. 

ఇప్పుడు తెలంగాణ ప్రతిపక్ష నేత కేసీఆర్ కూడా ఒక్క రోజు అసెంబ్లీకి వెళ్లాలని అనుకుంటున్నారు. త్వరలో  జరగబోయే బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్ ప్రవేశ పెట్టే రోజున ఆయన బడ్జెట్ ప్రసంగం వినేందుకు అసెంబ్లీకి హాజరవుతారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. గత ఎన్నికల్లో ఆయన గజ్వేల్ నుంచి గెలిచినప్పటికీ.. పార్టీ ఓడిపోవడంతో అసెంబ్లీకి రావడం లేదు. ప్రతిపక్ష నేతగా కూడా ఆయనే ఎన్నికయ్యారు. అయినా కిందపడిన కారణంగా మొదట్లో అసెంబ్లీకి రాలేదు. తర్వాత బడ్జెట్ పెడుతున్న రోజున ఒక్క రోజు అసెంబ్లీకి వచ్చి బడ్జెట్ ప్రసంగం విని వెళ్లి పోయారు. మళ్లీ ఇప్పటి వరకూ అసెంబ్లీ వైపు రాలేదు. 

మరోసారి ఆయన  బడ్జెట్ ప్రసంగాన్ని వినేందుకు అసెంబ్లీకి వస్తారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. నిబంధనల ప్రకారం అరవై వర్కంగ్ డేస్ సభకు హాజరు కాకపోతే అనర్హతా వేటు వేయడానికి స్పీకర్ కు అధికారం ఉంటుంది. ఈ బడ్జెట్ సమావేశాలకు హాజరు కాకపోతే..  కేసీఆర్ పై అనర్హతా వేటు వేయడానికి అవకాశం లభిస్తుంది. ఉపఎన్నికలు వస్తాయా లేదా అన్న విషయాన్ని పక్కన పెడితే అసెంబ్లీకి హాజరు కాని కారణంగా అనర్హతా వేటు అనేది కేసీఆర్ ఇమేజ్ కు మచ్చలా ఉంటుంది. అందుకే బీఆర్ఎస్ వ్యూహకర్తలు ఒక్కరోజు అసెంబ్లీ అనే ఫార్ములాకు ఓటేసినట్లుగా చెబుతున్నారు.            

అయితే ఏపీలో వైసీపీ గవర్నర్ ప్రసంగం రోజు వెళ్లినట్లుగా కాకుండా..   బిజినెస్ డేలోనే అంటే.. సభా కార్యక్రమాలు అధికారికంంగా జరుగుతున్నప్పుడే హాజరు కావాలని అనుకుంటున్నారు. ఒక్క సారి హాజరైతే..మరో అరవై రోజుల వరకూ  హాజరు కాకపోయినా ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉండదు.                    

ఈ నెలలోనే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. పూర్తి స్థాయి బడ్జెట్ ను తెలంగాణ  ప్రభుత్వం ప్రవేశ పెట్టనుంది. కేసీఆర్ హాజరు కాకపోయినా అసెంబ్లీకి బీఆర్ఎస్ సభ్యులంతా హాజరై.. ప్రభుత్వాన్ని గట్టిగానే ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ కూడా వస్తే మరింతగా ప్రభుత్వాన్ని నిలదీయవచ్చని భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా పదే పదే కేసీఆర్ ఎందుకు అసెంబ్లీకి రావడం లేదని ప్రశ్నిస్తోంది. దీంతో కేసీఆర్ అసెంబ్లీకి హాజరవనున్నారు. ఒక్క రోజే వస్తారా లేదా.. ప్రభుత్వంపై ఎదురుదాడికి ఇదే సరైన సమయం అని కంటిన్యూ చేస్తారా అన్నది తేలాల్సి ఉంది. 

టాప్ హెడ్ లైన్స్

Vangaveeti Radhakrishna: విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ నామినేషన్.. అనంతరం చిరంజీవికి స్పెషల్ థ్యాంక్స్
విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ నామినేషన్.. చిరంజీవికి స్పెషల్ థ్యాంక్స్
YS Jagan: ఏపీ స్థానిక ఎన్నికల్లో ఎన్నో అరాచకాలు..! కూటమి ప్రభుత్వం, ఎస్ఈసీపై వైఎస్ జగన్ ఆరోపణలు
ఏపీ స్థానిక ఎన్నికల్లో ఎన్నో అరాచకాలు..! కూటమి ప్రభుత్వం, ఎస్ఈసీపై వైఎస్ జగన్ ఆరోపణలు
Tirupati Municipal Elections: తిరుపతి మేయర్ ఎన్నికల్లో చిల్లర నామినేషన్లు.. సంచులతో వచ్చిన అభ్యర్థులు
తిరుపతి మేయర్ ఎన్నికల్లో చిల్లర నామినేషన్లు.. సంచులతో వచ్చిన అభ్యర్థులు
Punganur Elections: ఎంపీ మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పోలీసుల నోటీసులు.. హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్!
ఎంపీ మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పోలీసుల నోటీసులు.. హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్!

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao: భార్యకు ఫ్రీ టికెట్.. భర్తకు డబుల్ టికెట్, ఇదేనా మీ ప్రజాపాలన?: మాజీ మంత్రి హరీష్ రావు
భార్యకు ఫ్రీ టికెట్.. భర్తకు డబుల్ టికెట్, ఇదేనా మీ ప్రజాపాలన?: మాజీ మంత్రి హరీష్ రావు
IIT Tirupati Canadian GeoAI Agreement : IIT తిరుపతి , వన్‌ ఇండియాతో కెనడా జియో ఏఐ సంస్థ ఒప్పందాలు.. విద్యార్థులకు ఏం లాభం?
IIT తిరుపతి , వన్‌ ఇండియాతో కెనడా జియో ఏఐ సంస్థ ఒప్పందాలు.. విద్యార్థులకు ఏం లాభం?
Hyderabad Water Board: నీళ్లు వృథా చేస్తే రూ.20 వేల ఫైన్.. వాటర్ కనెక్షన్ కట్, కఠిన చర్యలు
నీళ్లు వృథా చేస్తే రూ.20 వేల ఫైన్.. వాటర్ కనెక్షన్ కట్, కఠిన చర్యలు
Vangaveeti Radhakrishna: విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ నామినేషన్.. అనంతరం చిరంజీవికి స్పెషల్ థ్యాంక్స్
విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ నామినేషన్.. చిరంజీవికి స్పెషల్ థ్యాంక్స్
Thella Kagitham Nakshatra : టాలీవుడ్ యంగ్ బ్యూటీ గ్లామరస్ లుక్ - చూపులతోనే మ్యాజిక్ చేసిన తెల్లకాగితం హీరోయిన్
టాలీవుడ్ యంగ్ బ్యూటీ గ్లామరస్ లుక్ - చూపులతోనే మ్యాజిక్ చేసిన తెల్లకాగితం హీరోయిన్
YS Jagan: ఏపీ స్థానిక ఎన్నికల్లో ఎన్నో అరాచకాలు..! కూటమి ప్రభుత్వం, ఎస్ఈసీపై వైఎస్ జగన్ ఆరోపణలు
ఏపీ స్థానిక ఎన్నికల్లో ఎన్నో అరాచకాలు..! కూటమి ప్రభుత్వం, ఎస్ఈసీపై వైఎస్ జగన్ ఆరోపణలు
Mahindra XUV 3XO ZNG పేరుకే CNG కారు- అధిక మైలేజ్,పెట్రోల్ లాంటి పవర్ దీని సొంతం
Mahindra XUV 3XO ZNG పేరుకే CNG కారు- అధిక మైలేజ్,పెట్రోల్ లాంటి పవర్ దీని సొంతం
Yashasvi Jaiswal Selection Mystery: రెండు సెంచరీలు కొట్టినా జట్టులో చోటు నిల్.. జైస్వాల్ కు సెలెక్టర్ల మొండిచేయి,  కొత్త అవతారంలోకి..
2 సెంచరీలు కొట్టినా జట్టులో చోటు నిల్.. జైస్వాల్ కు సెలెక్టర్ల మొండిచేయి,  కొత్త అవతారంలోకి మారిన స్టార్ ఓపెనర్..!
Embed widget