Government Schemes for Women’s : మహిళలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తోన్న పథకాలు.. భద్రతా, టీకాలు అందించడంతోపాటు కోట్లల్లో రుణాలు, ఉమెన్స్ డే 2025 స్పెషల్
Women’s Empowerment : మహిళల సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు అందుబాటులోకి తెచ్చింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆ పథకాలపై ఓ లుక్కేద్దాం.

Schemes for Women’s Empowerment : మహిళలకు సాధికారత కల్పిస్తూ.. సమాజంలో వారికి సరైన వాటా లభించేలా చేయడంలో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలతో కలిసి కృషి చేస్తుంది. దానిలో భాగంగా గత కొద్ది సంవత్సరాల్లో వారి అభివృద్ధికి సహాయపడే ఎన్నో పథకాలు ప్రవేశపెట్టింది. వెనకబడిన, పేద, చదువురాని మహిళలకు చేయూతనిచ్చేలా స్కీమ్‌లు, పథకాలు తెచ్చి.. వారి అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తుంది. ఇంతకీ మహిళలకు హెల్ప్ అయ్యే పథకాలు ఏమున్నాయో.. వాటిని ఎలా వినియోగించుకోవచ్చో ఇప్పుడు చూసేద్దాం.
సమాజంలో మహిళలు ఆర్థికంగా నిలదక్కుకునేందుకు .. వేతన సమస్యలను దూరం చేసేందుకు.. విద్య, ఆరోగ్యం, ఆర్థిక అవకాశాలకు సమాన అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. ఈ ఏడాది మహిళా దినోత్సవం 2025 (International Womens Day 2025)థీమ్ కూడా అదే. అయితే దీనిలో భాగంగా.. మహిళల అభివృద్ధికి ఉపయోగపడే కేంద్రప్రభుత్వం తెచ్చిన పథకాలేంటో అవి ఎలా హెల్ప్ అవుతున్నాయో తెలుసుకుందాం.
మిషన్ ఇంద్రధనుష్
మిషన్ రెయిన్బో అని కూడా పిలిచే ఈ పథకం.. ఇండియాలోని మహిళల సాధికారిత కోసం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టారు. ఈ పథకం కింద ప్రభుత్వం గర్భిణీ స్త్రీలు, పిల్లలకు ఇమ్యూనిటీని పెంచేలా టీకాలు అందిస్తారు. రోగనిరోధక శక్తిని అందిస్తూ.. అంతరాలను తొలగిస్తూ.. గర్భిణీలు, పిల్లలకు అవసరమైన టీకాలు, అత్యంత అవసరమైన వారికి చేరేలా చూడడమే దీని లక్ష్యం.
ప్రధానమంత్రి మాతృవందన యోజన
గర్భిణీ, పాలిచ్చే మహిళలకు మొదటి బిడ్డకు నగదు ప్రోత్సాహకాలు అందించే ప్రసూతి ప్రయోజన కార్యక్రమంగా ప్రధానమంత్రి మాతృవందన యోజన పథకమని చెప్తారు. తల్లి, బిడ్డ ఆరోగ్యం, పోషకాహారాన్ని మెరుగుపరచడం, వేతన ఇబ్బందులు లేకుండా పరిహారం అందిస్తున్నారు.
బేటీ బచావో బేటీ పఢావో
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన బేటీ బచావో బేటీ పఢావో పథం.. బాలికల విద్య, శ్రేయస్సును ప్రోత్సాహిస్తుంది. ఆడపిల్లలను రక్షించాలి. వారిని చదివించాలి అనే నినాదంతో ఈ పథకాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఆడపిల్లల మనుగడ, రక్షణ, విద్యను ప్రోత్సాహించడమే లక్ష్యంగా ఈ పథకం పనిచేస్తుంది.
సుకన్య సమృద్ధి యోజన
తల్లిదండ్రులు తమ ఆడపిల్లల కోసం పొదుపు ఖాతాలు తెరిచేలా చేయడమే సుకన్య సమృద్ధి యోజన పథకం లక్ష్యం. బాలికల విద్య, ఆర్థిక భద్రతను ప్రోత్సాహించాలనే ఉద్దేశంపై ఈ మిషన్ దృష్టి పెడుతుంది. దీనివల్ల పేరెంట్స్‌కు కుమార్తె విద్య, భవిష్యత్తుపై ధీమా వస్తుంది.
కిషోరి శక్తి యోజన
11 నుంచి 18 సంవత్సరాల వయసుగల బాలికలు పోషకాహారం, ఆరోగ్య స్థితిని మెరుగుపరిచేలా కిషోరి శక్తి యోజన పథంక తీసుకొచ్చారు. అక్షరాస్యతలో ఉన్న అమ్మాయిలు సమాజంలో బతకాలంటే అవసరమైన జీవిత నైపుణ్యాలు, జ్ఞానం ప్రేరేపించేలా.. నిర్ణయాత్మక సామర్థ్యాలు మెరుగుపరిచేలా స్కిల్స్ డెవలెప్మెంట్ పెంచుకోవడంలో ఈ పథకం హెల్ప్ చేస్తుంది.
ఉజ్వల యోజన
ప్రధానమంత్రి ఉజ్వల యోజన ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు, సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నారు. పేద కుటుంబాలకు వంట గ్యాస్‌ని అందుబాటులోకి తీసుకెళ్లి.. కట్టెల పొయ్యి కష్టాలను తీర్చి.. శుభ్రమైన వంట ఇంధనాన్ని అందించడమే లక్ష్యంగా దీనిని తీసుకొచ్చారు. ఇది గ్రామీణ మహిళల ఆరోగ్య అభివృద్ధికి, పర్యావరణంపై చెడు ప్రభావాన్ని తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది.
మరెన్నో పథకాలు
ఇవేకాకుండా ఆదాయ ఉత్పత్తి కార్యకలాపాల కోసం 20 లక్షల రుణం అందిస్తూ ఆర్థికంగా ప్రోత్సాహిస్తూ ముద్ర యోజన పథకం అమల్లో ఉంది. వర్కింగ్ ఉమెన్ మహిళలకు సురక్షితమైన, మంచి వసతిని అందించేలా వర్కింగ్ ఉమెన్ హాస్టల్ పథకం కూడా అందుబాటులో ఉంది. వ్యవసాయ ప్రయోజనాల కోసం డ్రోన్ టెక్నాలజీపై మహిళలకు శిక్షణ ఇచ్చేందుకు నమోడ్రోన్ దీదీ పథకం తీసుకొచ్చారు.
ప్రైవేట్, పబ్లిక్, కుటుంబంలో, సమాజంలో, ఆఫీస్‌లో హింసకు గురైన మహిళలకు మద్ధతు ఇచ్చేందుకు వన్‌స్టాప్ సెంటర్ పథకం అందుబాటులో ఉంది. ఇక్కడ తక్షణ, అత్యవసర సేవలు అందుబాటులో ఉంటాయి. వైద్య, చట్టపరమైన, మానసిక, కౌన్సిలింగ్ మద్ధతు కూడా ఉంటుంది. ఎస్టీ, ఎస్సీ మహిళలకు స్టాండప్ ఇండియా మిషన్‌లో భాగంగా పది లక్షల నుంచి కోటి వరకు రుణాలు అందిస్తుంది. ఇలా ఎన్నో పథకాలు మహిళలకు ఆర్థిక సహాయం అందిస్తూ.. స్కిల్స్ పెంచుతూ.. మహిళా సాధికారతలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.
Also Read : అంతర్జాతీయ మహిళా దినోత్సవం తేదీ, చరిత్ర.. ఈ సెలబ్రేషన్ వెనక ప్రాముఖ్యత, థీమ్ ఇవే






















