(Source: ECI/ABP News/ABP Majha)
Maharaja OTT Release Date: మహారాజా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ - Netflixలో స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పట్నించి అంటే?
Maharaja Digital Streaming Date: విజయ్ సేతుపతి హీరోగా నటించిన 'మహారాజా' థియేటర్లలో భారీ విజయం సాధించింది. మరి, ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందో తెలుసా?
తమిళ, తెలుగు ప్రేక్షకులకు మాత్రమే కాదు... హిందీ ఆడియన్స్ సైతం మెచ్చిన నటుడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi). ఆయన నటించిన 50వ సినిమా 'మహారాజా' (Maharaja Movie). తెలుగు, తమిళ భాషల్లో జూన్ 14న విడుదల అయ్యింది. సుమారు 20 కోట్ల నిర్మాణ వ్యయంతో తెరకెక్కిన ఈ సినిమా వంద కోట్లకు పైగా వసూలు చేసింది. మరి, ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందో తెలుసా? ఏయే భాషల్లో స్ట్రీమింగ్ కానుందో తెలుసా?
జూలై 12న ఐదు భాషల్లో ఓటీటీలోకి!
Maharaja OTT Release Date Netflix: 'మహారాజా' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల్ని ఇంటర్నేషనల్ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ వారం డిజిటల్ ఆడియన్స్ ముందుకు సినిమాను తీసుకు వస్తున్నట్లు అనౌన్స్ చేశారు. జూలై 12న.... అంటే శుక్రవారం ఓటీటీలో ఈ సినిమా వీక్షకులకు అందుబాటులోకి రానుంది.
Also Read: రామ్ చరణ్ నటనపై శంకర్ ప్రశంసలు - Game Changer అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్
“Lakshmi” kaanama ponadhum, Maharaja oda vaazhka thalaikeela ayiduchu. Thannoda veetu saami ah thirupi konduvara Maharaja evlo dhooram povaru?#Maharaja is coming to Netflix on 12th July in Tamil, Telugu, Malayalam, Kannada and Hindi! pic.twitter.com/eEN1RCMMyc
— Netflix India South (@Netflix_INSouth) July 8, 2024
'మహారాజా' సినిమాకు నిథిలన్ సామినాథన్ దర్శకత్వం వహించారు. ఆయనకు రెండో చిత్రమిది. దీని కంటే ముందు... ఏడేళ్ల క్రితం, 2017లో 'కురంగు బొమ్మై' సినిమా తీశారు. అది కూడా మంచి విజయం సాధించింది. అయితే... విజయ్ సేతుపతి నటనకు తోడు నిథిలన్ సామినాథన్ స్క్రీన్ ప్లే 'మహారాజా'ను భారీ బ్లాక్ బస్టర్ చేసింది.
Also Read: పవన్ కళ్యాణ్‌ను ఏపీ సీఎం చేయాలి - భారతీయుడు 2 ప్రీ రిలీజ్‌లో ఎస్‌జే సూర్య
'మహారాజా' చిత్రాన్ని సుదన్ సుందరం, జగదీశ్ పళనిస్వామి ప్రొడ్యూస్ చేశారు. ఈ సినిమాలో విజయ్ సేతుపతి కుమార్తెగా సచనా నమిదాస్ కీలక పాత్రలో అద్భుత నటన కనబరిచారు. బాలీవుడ్ దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్ విలన్ రోల్ చేశారు. సింగర్ కమ్ హీరోయిన్ మమతా మోహన్ దాస్, అభిరామి, నటరాజన్ సుబ్రమణియన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. బి అజనీష్ లోక్ నాథ్ అందించిన సంగీతం అయితే సినిమాను మరో స్థాయిలో నిలబెట్టింది. ఈ ఏడాది తమిళనాట హయ్యస్ట్ గ్రాస్ సాధించిన సినిమాగా 'మహారాజా' రికార్డ్ క్రియేట్ చేసింది.
Also Read: వేణు స్వామికి ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి కౌంటర్ - అబ్బాయి పెళ్లి గురించి సెన్సేషనల్ కామెంట్స్!
Maharaja veetlandhu Lakshmi ah thiruditanga. Thannoda Lakshmi ah thirumbi konduvara evlo dhoorom povaru?#Maharaja is coming to Netflix on 12th July in Tamil, Telugu, Malayalam, Kannada and Hindi! pic.twitter.com/8GTpgF3274
— Netflix India South (@Netflix_INSouth) July 8, 2024