విజయ్ సేతుపతి 50వ సినిమా 'మహారాజ'లో ప్లస్, మైనస్‌లు, హైలైట్స్ ఏంటో మినీ రివ్యూలో చూడండి.

కథ: మహారాజ (విజయ్ సేతుపతి) తన లక్ష్మి (ఇంట్లో చెత్త బుట్ట) కనిపించడం లేదని పోలీస్ స్టేషన్‌కు వెళ్తాడు.

తొలుత పోలీసులు పిచ్చోడని బయటకు గెంటేస్తారు. 7 లక్షలు ఇస్తా అనేసరికి వెతకడం మొదలు పెడతారు.

లక్ష్మి కోసం మహారాజ ఎందుకంత డబ్బు ఆఫర్ చేశాడు? లక్ష్మి కోసం వెతుకుతూ ఇంకొకరిని ఎందుకు చంపాడు?

లక్ష్మి పేరుతో స్టేషన్‌లో మహారాజ ఎందుకు తిష్ఠ వేశాడు? సెల్వ (అనురాగ్ కశ్యప్) ఎవరు? అనేది సినిమా.

ఎలా ఉంది?: 'మహారాజ' రివెంజ్ డ్రామా. ఎండింగ్ వరకు అది రివీల్ చేయకుండా సస్పెన్స్‌తో కథ నడిపాడు దర్శకుడు.

తండ్రీ కూతుళ్ళ సెంటిమెంట్, కామెడీ, యాక్షన్, ఎమోషన్, థ్రిల్... ఈ సినిమాలో అన్నీ ఉన్నాయ్. ఇదొక కమర్షియల్ ప్యాకేజ్.

స్లో పేస్డ్ నేరేషన్, హీరో & విలన్‌కు తప్ప మిగతా క్యారెక్టర్లకు ఇంపార్టెన్స్ లేకపోవడం 'మహారాజ'లో మైనస్ పాయింట్స్.

విజయ్ సేతుపతి నటన, నితిలన్ సామినాథన్ డైరెక్షన్ & నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే 'మహారాజ'లో హైలైట్స్!

రివేంజ్ డ్రామాను ఇంత ఎక్స్ట్రాడినరీగా తీయొచ్చా అనేలా ఉంటుందీ సినిమా. డోంట్ మిస్, గ్రేట్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ గ్యారంటీ.

Thanks for Reading. UP NEXT

యేవమ్ రివ్యూ: చాందిని ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌లో ప్లస్, మైనస్‌లు ఏంటి?

View next story