చాందినీ చౌదరి పోలీస్‌గా నటించిన ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ 'యేవమ్'లో ప్లస్, మైనస్, హైలైట్స్ ఏంటో చూడండి.

కథ: సౌమ్య (చాందినీ చౌదరి) కొత్తగా చేరిన ట్రైనీ ఎస్సై! ఆ వికారాబాద్ స్టేషన్‌లో అభి (జై భరత్ రాజ్) ఎస్సై.

ఓ అమ్మాయి మరణంతో వికారాబాద్‌లో హీరోల పేర్లు చెప్పి ట్రాప్ చేసే కేసు వెలుగులోకి వస్తుంది.

నేరస్థుడు యుగంధర్ (వశిష్ఠ సింహా)ను అభి, సౌమ్య కలిసి పెట్టుకున్నారా? లేదా? అతడిని ఎలా కనిపెట్టారు? 

అభి అంటే తనకు ఇష్టమని సౌమ్య చెప్పిందా? లేదా? అభిని సౌమ్య ఎందుకు షూట్ చేసింది? అనేది సినిమా. 

ఎలా ఉంది?: ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌కు కావాల్సిన పాయింట్స్ 'యేవమ్' కథలో ఉన్నాయి. కానీ, స్క్రీన్ మీద రాలేదు.

'యేవమ్' స్టార్టింగ్ బాగుంది. కానీ, స్టేషన్‌లో భరత్ రాజ్, చాందిని సీన్లు - లవ్ ట్రాక్ విసుగు తెప్పించాయి.

ఇంటర్వెల్ ట్విస్ట్ బేస్ చేసుకుని సినిమా తీశారేమో!? అది రివీల్ అయ్యాక క్లైమాక్స్ వరకు సహనాన్ని పరీక్షించే చిత్రమిది.

పోలీస్ గెటప్‌లో చాందిని బావుంది. వశిష్ఠ సింహ నటన బావుంది. కానీ, వాళ్ళ కోసం సినిమా చూడటం కష్టమే.

థ్రిల్, టెన్షన్ ఏమీ లేకుండా చప్పగా రొటీన్ వేలో సాగే థ్రిల్లర్ 'యేవమ్'. దీనిని థియేటర్లలో చూడలేం.

Thanks for Reading. UP NEXT

హరోం హర రివ్యూ: కేజీఎఫ్‌తో ఎందుకు కంపేర్ చేస్తున్నారు?

View next story