'హరోం హర'ను 'కేజీఎఫ్, విక్రమ్'లతో ఎందుకు కంపేర్ చేస్తున్నారు? ఈ మూవీలో ప్లస్, మైనస్‌లు ఏంటి?

కథ: సుబ్రమణ్యం (సుధీర్ బాబు) కుప్పంలో పాలిటెక్నిక్ కాలేజీలో ఉద్యోగి. అతడికో ప్రేయసి (మాళవికా శర్మ).

కుప్పంలో బలవంతుడైన తమ్మిరెడ్డి (కేజీఎఫ్ లక్ష్మణ్) మనుషుల్ని కొట్టడంతో సుబ్రమణ్యం ఉద్యోగం పోతుంది.

పళని స్వామి (సునీల్)తో కలిసి అక్రమంగా తుపాకీలు తయారు చేసి అమ్మడం మొదలు పెడతాడు సుబ్రమణ్యం.

కుప్పాన్ని శాసించే స్థాయికి ఎదిగిన సుబ్రమణ్యానికి చంపాలని వచ్చిందెవరు? ఎలా ఎదుర్కొన్నాడు? అనేది సినిమా.

ఎలా ఉంది?: కుప్పం నేపథ్యంలో 'కేజీఎఫ్' తీసినట్లుంది. నేపథ్యం, సీన్లు మారాయి తప్ప కథ మారలేదు.

చిత్తూరు యాస, కుప్పం నేపథ్యం కథకు కొత్తదనం తెచ్చాయి. 'కేజీఎఫ్' నుంచి దూరం చేయలేకపోయాడు దర్శకుడు.

కథలో కొత్తదనం లేకున్నా ఎమోషన్ వర్కవుటైతే బాగుండేది. 'హరోం హర'లో తండ్రి కొడుకుల ఎమోషన్ క్లిక్ కాలేదు.

సుధీర్ బాబు నటన, చైతన్ భరద్వాజ్ మ్యూజిక్, అరవింద్ విశ్వనాథన్ కెమెరా వర్క్, మనీషా ప్రొడక్షన్ డిజైన్ బాగున్నాయి, అంతే!

'కెజీఎఫ్' రేంజ్ కథ, విక్రమ్ ఎలివేషన్స్‌లో సుధీర్ బాబు చూడాలని కోరుకునే ఆడియన్స్ కోసమే 'హరోం హర'