శర్వానంద్, కృతి శెట్టి జంటగా నటించిన 'మనమే'లో ప్లస్, మైనస్ పాయింట్స్ ఏంటో మినీ రివ్యూలో చూడండి. కథ: స్నేహితుడు మరణించడంతో అతని బిడ్డ ఖుషి (విక్రమ్ ఆదిత్య) బాధ్యత విక్రమ్ (శర్వానంద్) మీద పడుతుంది. పెళ్లి, పిల్లలు, బంధాలు, బాధ్యతలు అంటే పడని విక్రమ్... సుభద్ర (కృతి శెట్టి)తో కలిసి పిల్లాడిని పెంచాల్సి వస్తుంది. పిల్లాడిని పెంచే క్రమంలో విక్రమ్, సుభద్ర మధ్య వచ్చిన గొడవలు ఏంటి? వాళ్లు ఏం చేశారు? సుభద్రతో విక్రమ్ ఎప్పుడు ప్రేమలో పడ్డాడు? ఎంగేజ్మెంట్ జరిగిన ఆమె ప్రేమలో పడిందా? లేదా? విక్రమ్, సుభద్ర, ఖుషి... ముగ్గురి జీవితాల్లో ఎన్ని మలుపులు తిరిగాయి?ఏమైంది? అనేది సినిమా. ఎలా ఉంది?: రెగ్యులర్ ప్రేమ కథల మధ్య 'మనమే' డిఫరెంట్ స్టోరీ. అయితే, కొంత ల్యాగ్ ఉంది. శర్వానంద్ క్యారెక్టరైజేషన్, ఆయన యాక్టింగ్ & డైలాగ్ డెలివరీతో వచ్చే కామెడీని ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. శర్వా కామెడీతో ఫస్టాఫ్ సరదాగా సాగితే... ఎమోషన్స్ లేని సెకండాఫ్ ఆడియన్స్ పేషన్స్ కొంత టెస్ట్ చేస్తుంది. 'మనమే'కు విజువల్స్, మ్యూజిక్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ వేల్యూస్ ప్లస్ పాయింట్స్. ఎనర్జిటిక్ శర్వానంద్, ఆయన కామెడీ కోసం ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా వెళితే 'మనమే' ఎంజాయ్ చేయవచ్చు.