ఆనంద్ దేవరకొండ లేటెస్ట్ సినిమా 'గం గం గణేశా'. 'బేబీ' సక్సెస్ తర్వాత వచ్చిన ఈ మూవీ ఎలా ఉందంటే? కథ: చిన్న దొంగతనాలు చేసుకునే గణేష్ (ఆనంద్ దేవరకొండ) డబ్బు కోసం 7 కోట్ల డైమండ్ దొంగతనం చేస్తాడు. ఎన్నికల కోసం ముంబై నుంచి వంద కోట్ల డబ్బును వినాయక విగ్రహంలో తెప్పిస్తాడు కిశోర్ రెడ్డి (రాజ్ అర్జున్). వినాయక విగ్రహం కిశోర్ రెడ్డి ఇంటికి కాకుండా రాజావారు (సత్యం రాజేశ్) దగ్గరకు వెళుతుంది. వజ్రాన్ని విగ్రహంలో వేసిన గణేష్ ఆ డైమండ్ కోసం, కిశోర్ రెడ్డి మనుషులు ఆ డబ్బు కోసం వెళతారు. విగ్రహంలో డబ్బు, వజ్రం ఎవరి చేతికి వెళ్లాయి? హీరో ప్రేమకథలు ఏమిటి? అనేది సినిమా. విశ్లేషణ: 'గం గం గణేశా' క్రైమ్ కామెడీ జానర్ ఫిల్మ్. కథ కంటే అందులో కామెడీ క్లిక్ అయింది. దర్శకుడు ఉదయ్ శెట్టి డిఫరెంట్ సెటప్ స్టోరీ రాశారు కానీ స్టార్ట్ టు ఎండ్ ఎంగేజ్ చేసేలా తీయలేదు. ఫస్టాఫ్ కొంత క్యారెక్టర్లు ఇంట్రడక్షన్, మధ్యలో కొన్ని సీన్లు బాలేదు. కానీ, ఉదయ్ శెట్టి కామెడీ బాగా రాశారు. 'బేబీ'తో పోలిస్తే ఆనంద్ దేవరకొండ డిఫరెంట్ రోల్ చేశారు. ఇమ్మాన్యుయేల్‌తో కామెడీ బావుంది. 'గం గం గణేశా'లో వెన్నెల కిశోర్ కామెడీ హైలైట్. కాసేపు సరదాగా నవ్వుకోవడానికి వెళ్లొచ్చు.