కాజల్ నటించిన ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ 'సత్యభామ'లో ప్లస్, మైనస్ పాయింట్స్ ఏంటో చూడండి.

కథ: సత్యభామ (కాజల్) కళ్ల ముందు హసీనా (నేహా పఠాన్)ను చంపేసి పారిపోతాడు యదు (అనిరుధ్ పవిత్రన్).

యదును పట్టుకోవడానికి సత్యభామ ఎన్ని ప్రయత్నాలు చేసినా వృథా ప్రయాసే అవుతుంది.

హసీనా తమ్ముడు ఇక్బాల్ (ప్రజ్వల్) కిడ్నాప్ అవ్వడంతో ఆ కేసును సత్యభామ పర్సనల్‌గా తీసుకుంటుంది.

ఇక్బాల్‌ను కిడ్నాప్ చేసింది ఎవరు? ఎంపీ అన్న కొడుకు రిషి (అంకిత్ కొయ్య)ను ఎందుకు అరెస్ట్ చేశారు?

యదు అన్వేషణ, ఇక్బాల్ కిడ్నాప్ కేసులో సత్యభామ తెలుసుకున్నది ఏమిటి? ఏమైంది? అనేది సినిమా

ఎలా ఉంది?: ఇది ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థిల్లర్ గానీ ఎమోషన్స్ & సెంటిమెంట్ మూమెంట్స్ చాలా ఉన్నాయ్.

'సత్యభామ'కు మెయిన్ అసెట్ కాజల్, ట్విస్టులు అయితే... మెయిన్ ట్రాక్‌ను సైడ్ చేసే ఉపకథలు మైనస్.

కెమెరా, ఆర్ట్ వర్క్స్... శ్రీచరణ్ పాకాల సంగీతం 'సత్యభామ'కు బలంగా నిలిచాయి.

నవీన్ చంద్ర సహా మిగతా పాత్రలను సరిగా ఎలివేట్ చెయ్యలేదు. అది కూడా మరొక మైనస్.

స్టైలిష్ యాక్షన్‌తో కాజల్ అదరగొట్టారు. స్క్రీన్ ప్లే థ్రిల్ చేసింది. కొన్ని సీన్లకు కత్తెర వేస్తే బాగుండేది.

కాజల్‌ను కొత్తగా చూపించిన సినిమా 'సత్యభామ'. యాక్షన్, ఎమోషన్స్‌తో డిఫరెంట్ థ్రిల్ ఇస్తుంది.

Thanks for Reading. UP NEXT

మనమే రివ్యూ: శర్వా సినిమాలో ప్లస్, మైనస్‌లు ఏంటి?

View next story