News
News
వీడియోలు ఆటలు
X

Sri Rama Pattabhishekam 2023: శ్రీరామ పట్టాభిషేకం ఫొటో ఇంట్లో పెట్టుకోవచ్చా లేదా!

ఆధ్యాత్మికపరంగా వచ్చే సందేహాలెన్నో. కొన్నిటికి సమాధానం తెలిసినట్టే అనిపించినా ఏమూలో చిన్న అనుమానం ఉండిపోతుంది. శ్రీరామ పట్టాభిషేకం ఫొటో విషయంలోనూ ఇదే చర్చ. ఇంతకీ ఈ ఫొటో ఇంట్లో ఉండొచ్చా ఉండకూడదా

FOLLOW US: 
Share:

Sri Rama Pattabhishekam 2023:  ఓం అంటే శబ్దం. అదే మూల శక్తి. ఓం అనే శబ్దంలోంచి పుట్టిన ప్రతి శబ్ధానికీ శక్తి ఉంటుంది. అందుకే అ,ఉ,మ తో కలసిన ప్రతి బీజాక్షరానికీ శక్తి ఉంటుంది. బీజాక్షరాలుగా ఉద్భవించి ఆ అక్షరాలను మనం ఉచ్ఛరించినప్పుడు శరీరంలో శక్తి జనిస్తుంది. ఇలా పుట్టిన శక్తితో సకల సంకల్పాలు నెరవేరుతాయి. అంత శక్తివంతమైనది ఓంకారం. కానీ ’ఓం’కారాన్ని తీసుకొచ్చి ఇంట్లో పూజ చేయలేరు కదా..అందుకు ప్రత్యామ్నాయ మార్గమే శ్రీరామ పట్టాభిషేకం ఫొటో. ఈ ఫొటో ఉన్నఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండదని చెబుతారు పండితులు.

రాముడు అకారానికి ప్రతినిధి

యో వేదాదౌ స్వరఃప్రోక్తః! వేదాంతేచ ప్రతిష్ఠితః!

అకారం విష్ణువు అయితే ఉకార మకారములు లక్ష్మణస్వామి, సీతాదేవి
’మ్’ అనే నాదస్వరూపం వాయుపుత్రుడైన హనుమంతుడు.

అకార ఉకార మకార నాద స్వరూపమైన హనుమతో కలిపి ఓంకారమే ఇంట్లో సీతారామచంద్రుడి  పట్టాభిషేక మూర్తి.
రాముడికి పూజ వాళ్లు చేయొచ్చా-వీళ్లు చేయొచ్చా అని ఉండదు. ఓంకారానికి పూజ చేయడం ఎంత గొప్పదో పట్టాభిషేకం ఫొటోకి  పూజ చేయడం అంత గొప్పది. రాముడిని వీర రాఘవ, విజయ రాఘవ అంటారు. ఎల్లవేళలా కోదండం చేతిలో పట్టుకుని ఉంటాడు. అపజయం అన్నది రాముడికి లేదు. అలాంటి రాముడు ఇంట్లో ఉంటే నిర్భయత్వం, శత్రుభయం ఉండదని విశ్వాసం. 

Also Read: ఈ ఒక్క శ్లోకం చదివితే చాలు విష్ణు సహస్రనామం పఠించినంత ఫలితం అని ఎందుకంటారు!

శ్రీ రామచంద్రుడే శ్రీ వేంకటేశ్వరుడు.. 
’కౌసల్యాసుప్రజారామ పూర్వాసంధ్యాప్రవర్తతే! 
ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్! 
అంటూ రాముణ్ణి విశ్వామిత్రుడు ప్రత్యక్షంగా నిద్రలేపాడు.

నిరుద్యోగులు, శత్రుభయం ఉన్నవారు, ఇంట్లో ఆందోళనలు ఉన్నవారు, డిప్రెషన్ కి గురైనవారు, తమ కష్టానికి తగిన గుర్తింపు లభించాలనుకునేవారు శ్రీరామ పట్టాభిషేకం  నిత్యం ఉదయాన్నే  21 సార్లు లేదా 11 సార్లు  పఠిస్తే శుభం జరుగుతుందని చెబుతారు. అందుకే శ్రీరామ పట్టాభిషేకం ఫొటో ఇంట్లో ఉండకూడదు అనే ప్రచారంలో ఎంతమాత్రం వాస్తవం లేదని చెబుతున్నారు పండితులు

Also Read: రావణుడికి అయోధ్య ఇస్తానన్న రాముడు, శ్రీరామచంద్రుడి నుంచి నేర్చుకోవాల్సిన లక్షణాలివే!

పారాయణ చేయవలసిన శ్రీ రామ పట్టాభిషేకం శ్లోకాలు

నందిగ్రామే జటాం హిత్వా భ్రాతృభిః సహితోనఘః |
రామః సీతామనుప్రాప్య రాజ్యం పునరవాప్తవాన్ ||

ప్రహృష్టముదితో లోకస్తుష్టః పుష్టః సుధార్మికః |
నిరాయమో హ్యరోగశ్చ దుర్భిక్ష భయవర్జితః ||

న పుత్రమరణం కించిద్ద్రక్ష్యంతి పురుషాః క్వ చిత్ |
నార్యశ్చావిధవా నిత్యం భవిష్యంతి పతివ్రతాః ||

న చాగ్నిజం భయం కించిత్ నాప్సు మజ్జంతి జంతవః
న వాతజం భయం కించిత్ నాపి జ్వరకృతం తథా ||

న చాపి క్షుద్భయం తత్ర న తస్కరభయం తథా |
నగరాణి చ రాష్ట్రాణి ధన ధాన్యయుతాని చ ||

నిత్యం ప్రముదితాస్సర్వే యథా కృతయుగే తథా |
అశ్వమేధశతైరిష్ట్వా తథా బహుసువర్ణకైః ||

గవాం కోట్యయుతం దత్వా బ్రహ్మలోకం ప్రయాస్యతి |
అసంఖ్యేయం ధనం దత్వా బ్రాహ్మణేభ్యో మహాయశాః ||

రాజవంశాన్ శతగుణాన్ స్థాపయిష్యతి రాఘవః |
చాతుర్వర్ణ్యం చ లోకేస్మిన్ స్వే స్వే ధర్మే నియోక్ష్యతి ||

దశవర్షసహస్రాణి దశవర్షశతాని చ |
రామో రాజ్యముపాసిత్వా బ్రహ్మలోకం గమిష్యతి ||

ఇదం పవిత్రం పాపఘ్నం పుణ్యం వేదైశ్చ సమ్మితమ్ |
యః పఠేద్రామచరితం సర్వపాపైః ప్రముచ్యతే ||

ఏతదాఖ్యానమాయుష్యం పఠన్రామాయణం నరః |
సపుత్రపౌత్రః సగణః ప్రేత్య స్వర్గే మహీయతే ||

గమనిక: వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని ఆధ్యాత్మిక అంశాలు, పరిష్కారాలను ఇక్కడ యథావిధిగా అందించాం. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదని గమనించగలరు

Published at : 31 Mar 2023 06:36 AM (IST) Tags: lord rama Sri Rama Navami 2023 Sri Rama Pattabhishekam 2023 Importance of Rama Rajyam

సంబంధిత కథనాలు

Spirituality: అష్ట (8), అష్టాదశ (18) - ఈ సంఖ్యలు హిందువులకు ఎందుకు ప్రత్యేకమో తెలుసా!

Spirituality: అష్ట (8), అష్టాదశ (18) - ఈ సంఖ్యలు హిందువులకు ఎందుకు ప్రత్యేకమో తెలుసా!

చేతిలో డబ్బు నిలవడం లేదా? మట్టి కలశంతో ఇలా చేసి చూడండి

చేతిలో డబ్బు నిలవడం లేదా? మట్టి కలశంతో ఇలా చేసి చూడండి

Dreams Meaning: మీకు ఇలాంటి కలలు వస్తున్నాయా? త్వరలో మీకు పెళ్లికాబోతుందని అర్థం!

Dreams Meaning: మీకు ఇలాంటి కలలు వస్తున్నాయా? త్వరలో మీకు పెళ్లికాబోతుందని అర్థం!

జూన్ 2023 రాశి ఫలాలు: జూన్ నెలలో ఈ రాశులవారికి ఎదురులేదు, ఆ రెండు రాశులపై కుజుడి ప్రభావం

జూన్ 2023 రాశి ఫలాలు: జూన్ నెలలో ఈ రాశులవారికి ఎదురులేదు, ఆ రెండు రాశులపై కుజుడి ప్రభావం

జూన్ 1 రాశిఫలాలు, ఈ రాశులవారిపై ఈ రోజు లక్ష్మీదేవి కరుణాకటాక్షాలుంటాయి!

జూన్ 1 రాశిఫలాలు, ఈ రాశులవారిపై ఈ రోజు లక్ష్మీదేవి కరుణాకటాక్షాలుంటాయి!

టాప్ స్టోరీస్

Telangana Govt: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ

Telangana Govt: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ

దుల్కర్ సల్మాన్ తో దగ్గుబాటి హీరో సినిమా!

దుల్కర్ సల్మాన్ తో దగ్గుబాటి హీరో సినిమా!

CH Malla Reddy: బొజ్జ ఉంటే పోలీసులకు ప్రమోషన్లు ఇవ్వకండి - మంత్రి మల్లారెడ్డి సరదా కామెంట్లు

CH Malla Reddy: బొజ్జ ఉంటే పోలీసులకు ప్రమోషన్లు ఇవ్వకండి - మంత్రి మల్లారెడ్డి సరదా కామెంట్లు

YS Viveka Case : సీబీఐ కోర్టులో వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్ - బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి !

YS Viveka Case  : సీబీఐ కోర్టులో వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్ - బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి !