Zelensky Met Donald Trump: అమెరికాకు వెళ్లి ట్రంప్‌కు షాకిచ్చిన జెలెన్ స్కీ, ఆ విషయంలో తగ్గేదే లేదన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు
Donald Trump | అమెరికాలో పర్యటిస్తున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ, డొనాల్డ్ ట్రంప్‌కు షాకిచ్చారు. కీవ్ లో ఖనిజాల మైనింగ్ కు అనుమతివ్వాలన్న ఒప్పందంపై సంతకం చేయడానికి జెలెన్ స్కీ నిరాకరించారు.

Zelensky met with US President Donald Trump | వాషింగ్టన్: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్చలు సఫలం కాలేదు. పైగా జెలెన్ స్కీపై డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. తాము చెప్పినట్లు ఒప్పందం చేసుకుంటే ఏ సమస్యా ఉండదని, లేకపోతే మూడో ప్రపంచ యుద్దానికి కాలు దువ్వినట్లే అని జెలెన్ స్కీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తేల్చి చెప్పేశారు. వాషింగ్టన్ కు వచ్చిన జెలెన్ స్కీ శుక్రవారం నాడు డొనాల్డ్ ట్రంప్ తో వైట్ హౌస్‌లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా డొనాల్డ్ ట్రంప్, జెలెన్ స్కీల మధ్య మాటల యుద్ధం జరిగింది.
శాంతి ఒప్పందం చేయాలంటే, ఆ డీల్ కండీషన్
రష్యా తమపై చేస్తున్న యుద్ధంలో ఉక్రెయిన్‌కు సాయం చేయాలని జెలెన్ స్కీ అమెరికా అధ్యక్షుడ్ని కోరారు. ఈ దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదర్చడం, అందుకు బదులుగా ఉక్రెయిన్‌లోని అరుదైన ఖనిజాల మైనింగ్ కు అమెరికాకు అనుమతి ఇవ్వాలని డొనాల్డ్ ట్రంప్ కండీషన్ పెట్టారు. ట్రంప్ మాటలు పట్టించుకోకుండా.. భవిష్యత్తులో రష్యా తమపై ఏవైనా అణు బాంబులు వేసినా, అక్రమణకు పాల్పడితే రక్షణ కల్పించాలని జెలెన్ స్కీ ఒత్తిడి చేశారు. ఉక్రెయిన్ అధ్యక్షుడి తీరు డొనాల్డ్ ట్రంప్, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌లకు ఆగ్రహం తెప్పించింది. దాదాపు 45 నిమిషాలపాటు జరిగిన భేటీలో చివరి నిమిషాల చర్చ వాగ్వానికి దారితీసింది.
జెలెన్ స్కీ తీరుతో విసిగిపోయిన అమెరికా అధ్యక్షుడు
ఎంతో కాలం నుంచి అమెరికా సాయం చేస్తుంటే.. అలాంటి దేశంలో మాట్లాడే పద్ధతి ఇదేనా అని జెలెన్ స్కీపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది తమకు అవమానకరం అన్నారు. మీరు చాలా ధైర్యం ఉన్న వ్యక్తి, అయినప్పటికీ సాయం కావాలంటే అమెరికాతో మైనింగ్ అనుమతిపై ఒప్పందం చేసుకోక తప్పదన్నారు. డీల్ వద్దనుకుంటే చెప్పండి, అమెరికా తప్పుకుంటుంది. రష్యాతో మీరు ఒంటరిగా పోరాటం చేయాలి. మీకు ఇంకో దారి లేదు. సాయం చేసే దేశంతో డీల్ చేసే పద్ధతి ఇది కాదు, ఏమాత్రం కృతజ్ఞత లేకుండా మాట్లాడుతూ మీరు అమర్యాదగా ప్రవర్తిస్తున్నారు. అసలు మీరు డిమాండ్ చేసే పరిస్థితుల్లో లేరు అంటూ జెలెన్‌స్కీపై డొనాల్డ్ ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు.
Wow. What a disgusting human being Donald Trump is. pic.twitter.com/F4Cvq1YNgo
— Jonathan Pie (@JonathanPieNews) February 28, 2025
దేశ ప్రజల ప్రాణాలతో చెలగాడం ఆడుతున్నారు. మాతో వ్యవహరించే తీరు, రష్యాతో మీ సమస్య మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశం ఉందని ట్రంప్ హెచ్చరించారు. అమెరికా చేస్తున్న సాయానికి థాంక్స్ కూడా చెప్పలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కీవ్ లో ఖనిజాల తవ్వకానికి జెలెన్ స్కీ అంగీకరించకపోవడంతో చర్చలు విఫలం కాగా, విందు కూడా జరగలేదు.
పుతిన్‌ను ఉగ్రవాది అని జెలెన్‌స్కీ ఘాటు వ్యాఖ్యలు
ఉక్రెయిన్ ను ఆక్రయించుకోవాలని చూస్తున్న రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉగ్రవాది అని జెలెన్‌స్కీ పేర్కొన్నారు. అలాంటి నియంత, ఓ హంతకుడితో ఎవరు మాత్రం రాజీ పడతారని జెలెన్ స్కీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. యుద్ధం మొదలుపెట్టాలంటే కొన్ని రూల్స్ ఉంటాయని జెలెన్ స్కీ చెబుతుంటే మధ్యలో ట్రంప్ కలగజేసుకున్నారు. రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య శాంతి ఒప్పందం జరగాలంటే కొన్ని విషయాల్లో రాజీపడక తప్పదని ట్రంప్ స్పష్టం చేయడంతో చర్చలు ముందుకు సాగలేదు. ఖనిజాల తవ్వకం ఒప్పందంపై జెలెన్ స్కీ సంతకం చేయకపోవడం ట్రంప్ ను తీవ్ర అసహనానికి గురిచేసింది. అంతా ఒకే అయితే వీరు సంతకాలు చేసిన అనంతరం మీడియాకు విషయాలు వెల్లడించేవారు. ఉక్రెయిన్‌కు ఆయుధాల సరఫరా చేయడం కంటే యుద్ధాన్ని ముగించడం ముఖ్యమని చర్చలకు ముందు ట్రంప్ అన్నారు. కానీ తాజా పరిణామాలతో ఉక్రెయిన్ కు అమెరికా సాయం కొనసాగిస్తుందా లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
Also Read: Elon Musk: సత్య నాదెళ్లను కాకా పడుతున్న ఎలాన్ మస్క్ - మాస్టర్ ప్లాన్ ఏదో వేస్తున్నట్లే!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

