Virat Kohli Record: కోహ్లీ అరుదైన రికార్డు.. 13 వేల పరుగులు చేసిన తొలి ఇండియన్ గా రికార్డు.. 200 వికెట్ల క్లబ్ లో హార్దిక్
రికార్డులు కొల్లగొట్టడమే టార్గెట్ గా ముందుకి సాగుతున్న కోహ్లీ.. తాజాగా అరుదైన ఘనతను సాధించాడు. పొట్టి ఫార్మాట్ లో 13 వేల పరుగుల మార్కును చేరుకున్న తొలి భారత బ్యాటర్ గా రికార్డులకెక్కాడు.

IPL 2025 RCB VS MI Live Updates: భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. సోమవారం ముంబై ఇండియన్స్ పై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరపున బరిలోకి దిగిన విరాట్ కోహ్లీ విధ్వంసక ఫిఫ్టీ (42 బంతుల్లో 67, 8 ఫోర్లు, 2 సిక్సర్లు) నమోదు చేశాడు. అలాగే పొట్టి ఫార్మాట్ లో అత్యంత వేగంగా 13 వేల పరుగులు సాధించిన ఇండియన్ బ్యాటర్ గా రికార్డులకెక్కాడు. కేవలం 386 ఇన్నింగ్స్ ల్లోనే కోహ్లీ ఈ ఘనత అందుకోవడం విశేషం. టీ20ఐల్లో 4250, ఐపీఎల్ చాంపియన్స్ లీగ్ లో 8750కి పరుగులు సాధించడంతో మొత్తం 13వేల పరుగుల మార్కును అందుకున్నాడు. ఇక ఈ లిస్టులో టాప్ లో వెస్టిండీస్ గ్రేట్, యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ ముందున్నాడు. తను ఈ మార్కును 381వ ఇన్నింగ్స్ లోనే చేరుకోవడం విశేషం. ఓవరాల్ గా కోహ్లీ కంటే ముందు ఈ మార్కును నలుగురు బ్యాటర్లు చేరుకున్నారు. అలెక్స్ హేల్స్ (474 ఇన్నింగ్స్), షోయబ్ మాలిక్ (487), కీరన్ పోలార్డ్ (594)లతోపాటు గేల్ ఈ జాబితాలో చోటు సంపాదించాడు. ఇక ఈ మ్యాచ్ లో కోహ్లీ విధ్వంసక అర్థ సెంచరీ నమోదు చేశాడు. ఐపీఎల్లో తనకిది 57వ ఫిఫ్టీ కావడం విశేషం. ఇక 8సెంచరీలు ఉన్నాయి.
Virat Kohli 13000 Runs completes in T20 ❤️🔥#viratkohli #kingkohli #13000runs #kohli #India#IPL2025 #RCB pic.twitter.com/70izl9AlJH
— Gujarat Fect (@GujaratFect) April 7, 2025
200 వికెట్ల క్లబ్ లో హర్దిక్..
ఇదే మ్యాచ్ లో రెండు వికెట్లు తీసిన హార్దిక్ పాండ్యా టీ20ల్లో రెండు వందల వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు భారీ స్కోరు వైపు దూసుకుపోతుండగా, 15వ ఓవర్ వేసి హార్దిక్.. తొలి బంతికి ప్రమాదకర కోహ్లీని, మూడో బంతికి లియామ్ లివింగ్ స్టోన్ వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అలాగే టోర్నీలో పది వికెట్లను తీసిన హార్దిక్ పర్పుల్ క్యాప్ ను కూడా తన సొంతం చేసుకున్నాడు.
Hardik Pandya becomes the 17th Indian to complete 200 T20 wickets
— All Cricket Records (@Cric_records45) April 7, 2025
Most T20 wickets by Indians:
365 – Yuzvendra Chahal (312 innings)
319 – Piyush Chawla (296 innings)
313 – Ravichandran Ashwin (324 innings)
312 – Bhuvneshwar Kumar (296 innings)
295 – Jasprit Bumrah (233 innings)… pic.twitter.com/SCb43sSAG8
ఆర్సీబీ భారీ స్కోరు..
ఇక టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ భారీ స్కోరు సాధించింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 221 పరుగులు చేసింది. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ 67 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. రజత్ పతిదార్ కెప్టెన్ ఇన్నింగ్స్ (32 బంతుల్లో 64, 5 ఫోర్లు, 4 సిక్సర్లు)తో సిక్సర్ల్ జాతర కురిపించాడు. చివర్లో జితేశ్ శర్మ (19 బంతుల్లో 40 నాటౌట్, 2 ఫోర్లు, 4 సిక్సర్లు)తో సత్తా చాటాడు. మిగతా బౌలర్లలో ట్రంట్ బౌల్ట్ కు రెండు, విఘ్నేశ్ పుతుర్ కి ఒక వికెట్ దక్కింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

