Ishant Sharma Fined: గుజరాత్ టైటాన్స్ షాక్.. సీనియర్ పేసర్ ఇషాంత్ కు జరిమానా..? కారణమేంటో తెలుసా..!
IPL 2025 SRH VS GT Latest Updates: గుజరాత్ టైటాన్స్ ఈ సీజన్ లో జోరు మీదుంది. ఆడిన 4 మ్యాచ్ ల్లో మూడింటిలో వరుసగా గెలిచి హ్యాట్రిక్ సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో నెం.2లో కొనసాగుతోంది.

IPL 2025 Latest Updates: భారత వెటరన్ పేసర్ ఇషాంత్ శర్మపై బీసీసీఐ కొరడా ఝళిపించింది. ఆదివారం సన్ రైజర్స్ హైదరాబాద్ తో మ్యాచ్ సందర్బంగా క్రీడా పరికరాలను అవమానించి నుందుకు గాను అతని మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించడంతోపాటు ఒక డీ మెరిట్ పాయింట్ ను కేటాయించింది. ఐపీఎల్ ఆటగాళ్ల ప్రవర్తన నియామావళిలోని ఆర్టికల్ 2.2ను ఉల్లంఘించడం ద్వారా లెవల్ 1 నేరానికి పాల్పడినట్లుగా బీసీసీఐ తేల్చింది. దీంతో అతనికి శిక్ష విధించినట్లుగా మ్యాచ్ రిఫరీ జవగళ్ శ్రీనాథ్ పేర్కొన్నాడు. ఇక మ్యాచ్ రిఫరీ విధించిన శిక్షను ఇషాంత్ ఒప్పుకోవడంతో దీనిప ఫర్దర్ గా ఎలాంటి హియరింగ్ ఉండబోదని తేల్చింది. ఉప్పల్ రాజీవ్ గాంధీ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 152 పరుగులు చేసింది. నితీశ్ కుమార్ రెడ్డి (31) టాప్ స్కోరర్ గా నిలిచాడు. మహ్మద్ సిరాజ్ (4/17) ఐపీఎల్ కెరీర్ బెస్ట్ ఫిగర్స్ తో సత్తా చాటాడు. అనంతరం ఛేదనను గుజరాత్ 16.4 ఓవర్లలో 3 వికెట్లకు 153 పరుగులు చేసి, కంప్లీట్ చేసింది. శుభమాన్ గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్ (61 నాటౌట్)తో ఆకట్టుకున్నాడు. బౌలర్లలో మహ్మద్ షమీ (2/28)తో సత్తా చాటాడు.
Ishant Sharma has been fined 25 percent of his match fees for breaching the IPL's Code of Conduct.#SRHvGT #IPL2025 pic.twitter.com/ay465Hijr1
— Cricbuzz (@cricbuzz) April 7, 2025
ఇంతకీ రూల్ బుక్ లో ఏముందంటే..?
ఐపీఎల్ ప్రవర్తన నియమావళి ప్రకారం ఆర్టికల్ 2.2లో క్రికెటర్ పరికరాలు, బట్టలు, గ్రౌండ్ ఎక్విప్మెంట్ ఇతర వస్తువులను అగౌరవ పరచడం నేరం. అందుకు తగినశిక్ష ఉంటుంది. అలాగే ఇదే అర్టికల్ కింద వికెట్లను తన్నడం, లేదా నిర్లక్ష్య పూరితంగా ప్రవర్తించడం, అలాగే అడ్వర్టైజింగ్ బోర్డులు, బౌండరీ ఫెన్సులు, డ్రెస్సింగ్ రూం డోర్లు, అద్దాలు, కిటికీలు, ఇతర వస్తువులపై ప్రతాపం చూపించడం నిషిద్దం. ఇషాంత్ తాజాగా ఇలాంటి పనికి పాల్పడినందుకుగాను ఐపీఎల్ యాజమాన్యం శిక్ష విధించినట్లు తెలుస్తోంది.
విఫలమవుతున్న ఇషాంత్..
సీనియర్ పేసర్ అయిన 36 ఏళ్ల ఇషాంత్.. గుజరాత్ టైటాన్స్ తరపున ఈ సీజన్ లో విఫలం అవుతున్నాడు. సన్ రైజర్స్ తో మ్యాచ్‌లో ఇషాంత్ భారీగా పరుగులు ఇచ్చాడు. నాలుగు ఓవర్లలో 53 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక ఈ ఐపీఎల్ సీజన్‌లో ఇషాంత్ ఇప్పటి వరకు ఎక్కువ పరుగులు ఇచ్చే|శాడు. అతను మూడు మ్యాచులు ఆడి 8 ఓవర్లు వేసి 107 రన్స్ సమర్పించుకున్నాడు. అలాగే ఓవరాల్ గా కేవలం ఒక్క వికెట్ మాత్రమే సాధించాడు. గుజరాత్ అతడిని రూ.75 లక్షలకు కొనుగోలు చేసింది. ఈ సీజన్ లో గుజరాత్ సత్తా చాటుతోంది. ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్ ల్లో వరుసగా మూడు మ్యాచ్ లు గెలిచి, హ్యాట్రిక్ సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో టాప్ -2లో నిలిచింది. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ తాజా ఓటమితో పదో స్థానంలో, అట్టడుగున నిలిచింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

