Catch Controversy: థర్డ్ అంపైర్ పై నెటిజన్ల ఫైర్.. అత్యుత్సాహంతో వాషిని ఔట్ చేశాడని చురకలు.. సోషల్ మీడియాలో రచ్చ
సన్ రైజర్స్ కు ఈ సీజన్ కలిసి రావడం లేదు. ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్ ల్లో నాలిగింటిలో ఓడింది. కేవలం ఒక్క మ్యాచ్ లోనే గెలుపొందింది. అటు సొంతగడ్డపై, ఇటు పరాయి వేదికల్లో ఓటములు ఎదుర్కొంటోంది.

IPL 2025 SRH VS GT Updates: సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఒక క్యాచ్ పై కాంట్రోవర్సీ నెలకొంది. గుజరాత్ బ్యాటర్ వాషింగ్టన్ సుందర్ ఇచ్చిన క్యాచ్ ను అనికేత్ వర్మ అందుకోవడంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. వాషింగ్టన్ ఔట్ కాదని, బంతి నేలను తాకిందని నెటిజన్లు ఆక్షేపిస్తున్నారు. థర్డ్ అంపైర్ ఓవర్ స్మార్ట్ కారణంగా వాషీ.. మెయిడిన్ ఐపీఎల్ ఫిఫ్టీ చేసే అవకాశం కోల్పోయాడని సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం ఉప్పల్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ పై 7 వికెట్లతో గుజరాత్ ఘన విజయం సాధించింది.
టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 152 పరుగులు చేసింది. తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి (34 బంతుల్లో 31, 3 ఫోర్లు) టాప్ స్కోరర్ గా నిలిచాడు. హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ (4/17) ఐపీఎల్ కెరీర్ బెస్ట్ ఫిగర్స్ తో సత్తా చాటాడు. అనంతరం ఛేదనలో గుజరాత్ 16.4 ఓవర్లలో 3 వికెట్లకు 153 పరుగులు చేసింది. శుభమాన్ గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్ (43 బంతుల్లో 61 నాటౌట్, 9 ఫోర్లు)తో ఆకట్టుకున్నాడు. కీలకదశలో ఆకట్టుకునే ఇన్నింగ్స్ ను ఆడాడు. బౌలర్లలో మహ్మద్ షమీ (2/28)తో సత్తా చాటాడు. ఇక ఈ మ్యాచ్ లో 14వ ఓవర్లో కాంట్రవర్సీ క్యాచ్ ను అనికతే్ అందుకున్నాడు.
Nitin Menon robbed Washington Sundar's maiden IPL fifty. pic.twitter.com/shhE7I2Y9n
— Utsav 💙 (@utsav__45) April 6, 2025
పుల్ చేయబోయి..
ఈ మ్యాచ్ లో నాలుగో నెంబర్లో బ్యాటింగ్ కు దిగిన వాషింగ్టన్ అద్భుతంగా ఆడాడు. పరుగులు చేయడానికి ఇబ్బంది పడిన ఈ పిచ్ పై ధనాధన్ ఆటతీరుతో వాషి రెచ్చిపోయాడు. తను ఆడిన ఇన్నింగ్స్ తోనే టైటాన్స్ విజయం సాధించించి అనడంలో ఎలాంటి సందేహం లేదు. గిల్ హాఫ్ సెంచరీ బాదినా, గెలుపుకు బాట వేసిన క్రెడిట్ మాత్రం వాషికే దక్కుతుంది. ఇక మ్యాచ్ 14వ ఓవర్ వేసిన షమీ.. బ్యాక్ ఆఫ్ లెంగ్త్ బంతిన వేయగా, వాషి దాన్ని స్వీపర్ కవర్ వైపు ఆడాడు. అక్కడే పొంచి ఉన్న అనికేత్ ముందుకు అద్బుతంగా డైవ్ చేస్తూ క్యాచ్ అందుకున్నాడు. అయితే దీనిపై అనుమానంతో అంపైర్లు థర్డ్ అంపైర్ ను సంప్రదించారు. పలుమార్లు రీప్లేలు చూసిన అంపైర్.. బంతి నేలను తాకలేదని, క్యాచ్ అందుకునేటప్పుడు బంతి కింద చేతివేళ్లు ఉన్నాయని తీర్మాణించి క్యాచౌట్ గా ప్రకటించాడు.
Washington sundar dismissed on 49 by an outstanding catch from Aniket Verma🔥🔥.
— Aksh Chaudhary (@ChaudharyAkshS1) April 6, 2025
Mohammed Shami took a wicket at the right time.#IPL2025 #washingtonsundar #ShubmanGill pic.twitter.com/UQGrbZbcgy
క్రికెట్ ఫ్యాన్స్ ఫైర్..
సరైన ఎవిడెన్స్ లేకుండానే వాషిని థర్డ్ అంపైర్ నితీన్ మీనన్ ఔట్ గా ప్రకటించాడని నెటిజన్లు ఫైరవుతున్నారు. టీవీల్లో రీప్లేలో బంతి నేలకు తాకినట్లు కొన్నియాంగిళ్లలో కనిపించిందని, బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద బ్యాటర్ ను నాటౌట్ గా ప్రకటిస్తే బాగుండేదని చురకలు అంటించారు. థర్డ్ అంపైర్ అసమర్థత కారణంగా వాషి. ఐపీఎల్లో తన తొలి ఫిఫ్టీని చేసుకునే అవకాశాన్ని కోల్పోయాడని దుయ్యబట్టారు. తాజా ఫలితంలో మూడు విజయాలతో పాయింట్ల పట్టికలో గుజరాత్ రెండో స్థానంలో నిలవగా, సన్ రైజర్స్ పదో స్తానానికి మరింత లోతుగా దిగజారింది.




















