Prabhas Marriage: వేణు స్వామికి ప్రభాస్ పెద్దమ్మ కౌంటర్ - పెళ్లి గురించి సెన్సేషనల్ కామెంట్స్!
Krishnam Raju Wife Shyamala Devi: కృష్ణంరాజు సతీమణి, ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి అబ్బాయి పెళ్లి గురించి సెన్సేషనల్ కామెంట్స్ రాశారు. ఒక విధంగా ఆవిడ వేణు స్వామికి కౌంటర్ ఇచ్చారని అనుకోవాలి.
![Prabhas Marriage: వేణు స్వామికి ప్రభాస్ పెద్దమ్మ కౌంటర్ - పెళ్లి గురించి సెన్సేషనల్ కామెంట్స్! Prabhas Marriage News Krishnam Raju wife Shyamala Devi counter to astrologer Venu Swamy Prabhas Marriage: వేణు స్వామికి ప్రభాస్ పెద్దమ్మ కౌంటర్ - పెళ్లి గురించి సెన్సేషనల్ కామెంట్స్!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/07/5ab09731e3c0f13efa324d3459ee62511720345954244313_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Shyamala Devi On Prabhas Marriage: టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లలో, ఆ మాటకు వస్తే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోని పెళ్లి కాని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరోల లిస్టు తీస్తే... అందులో ప్రభాస్ పేరు ఫస్ట్ ప్లేసులో ఉంటుంది. కండల వీరుడు సల్మాన్ ఖాన్ సైతం ఆయన వెనుక ఉన్నారని చెప్పుకోవాలి. ఇప్పుడు ప్రభాస్ పెళ్లి టాపిక్ నెట్టింట సెన్సేషన్ అవుతోంది. అందుకు కారణం కృష్ణంరాజు సతీమణి శ్యామలా దేవి. ఒక విధంగా ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి (Venu Swamy Astrologer)కి ఆవిడ కౌంటర్ ఇచ్చారని అనుకోవాలి. ఇంతకీ, ఆవిడ ఏం చెప్పారు? అనే వివరాల్లోకి వెళితే...
వేణు స్వామికి ఇచ్చి పడేసిన శ్యామలా దేవి
పాన్ ఇండియా లెవల్‌లో ప్రభాస్ క్రేజ్ ఎంత ఉందనేది 'కల్కి 2898 ఏడీ' సినిమా విజయం మరొక్కసారి ప్రూవ్ చేసింది. బాక్స్ ఆఫీస్ దగ్గర వసూళ్ల ఊచకోతతో రోజు రోజుకూ కోట్ల రూపాయలను తన ఖాతాలో వేసుకుంటోంది 'కల్కి 2898 ఏడీ'. ఈ సక్సెస్ పట్ల శ్యామలా దేవి సంతోషం వ్యక్తం చేశారు. పనిలో పనిగా పెళ్లి గురించి కూడా ఆవిడ మాట్లాడారు.
మంచితనం మనిషిని ఏ స్థాయికి తీసుకు వెళుతుందో రుజువు అయ్యిందని 'కల్కి 2898 ఏడీ' విజయాన్ని ఉద్దేశిస్తూ శ్యామలా దేవి చెప్పారు. ఆ తర్వాత 'బాహుబలి' తర్వాత ప్రభాస్ (Prabhas)కు విజయం దక్కదని కొందరు అన్నారని, అయితే వారి అంచనాలు తారుమారు అయ్యాయని ఆవిడ పేర్కొన్నారు. ప్రభాస్ జాతకంలో ఇకపై విజయాలు లేవని చెప్పిన జోతీష్యుల్లో వేణు స్వామి ప్రముఖ వ్యక్తి. అలాగే, ప్రభాస్ జీవితంలో పెళ్లి యోగం కూడా లేదని చెప్పారు. గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలకు శ్యామలా దేవి ఇన్ డైరెక్టుగా కౌంటర్ ఇచ్చారు. అదీ సంగతి!
Also Read: ఎన్టీఆర్ షాకింగ్ డెసిషన్... ఒక్క సినిమా తీసిన దర్శకుడికి ఛాన్స్!
చిత్రసీమలో ప్రభాస్ విజయాల విషయంలో కొందరి వ్యాఖ్యలు ఏ విధంగా తారుమారు అయ్యాయో, పెళ్లి విషయంలో కూడా అదే విధంగా అవుతాయని శ్యామలా దేవి కామెంట్ చేశారు. ప్రభాస్ పెళ్లి చెయ్యాలని తమకూ ఉంటుందని, అయితే అందుకు సమయం రావాలని ఆవిడ చెప్పారు. తామంతా తప్పకుండా పెళ్లి జరుగుతుందనే నమ్మకంతో ఉన్నామని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభాస్ జీవితంలో ఇప్పటి వరకు కృష్ణంరాజు ఆశించినట్టు అన్నీ జరిగాయని, అలాగే పెళ్లి కూడా జరుగుతుందని శ్యామలా దేవి తెలిపారు.
కృష్ణం రాజు జీవించి ఉన్న సమయంలో ఆయనకు, ఇప్పుడు ఆయన సతీమణి శ్యామలా దేవికి ఎక్కడికి వెళ్లినా సరే ప్రభాస్ పెళ్లి ప్రశ్న తప్పకుండా ఎదురు అవుతుంది. అబ్బాయికి పెళ్లి చెయ్యాలని అనుకుంటున్నట్టు వారు గతంలో పలు సందర్భాల్లో పేర్కొన్నారు. ఇప్పుడు మరొక్కసారి శ్యామలా దేవి స్పందించారు. మరి, ప్రభాస్ మదిలో ఏం ఉందో? ఫలానా హీరోయిన్లతో ఆయన ప్రేమలో ఉన్నట్టు అప్పుడప్పుడూ వార్తలు వచ్చాయి. వాటిని ఆయన ఎప్పుడూ కన్ఫర్మ్ చెయ్యలేదు.
Also Read: హైపర్ ఆది... నన్ను టచ్ చేయకు - శ్రీ సత్య కామెంట్స్, అతడి పరువు తీసి పారేసిన హన్సిక!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)