ప్రభాస్ 'కల్కి 2898 ఏడీ'లో ప్లస్, మైనస్ పాయింట్స్‌తో పాటు హైలైట్స్ ఏమున్నాయ్? మినీ రివ్యూలో తెలుసుకోండి.

కథ: భూమ్మీద ప్రకృతి వనరుల్ని దోచేసి కాశీకి పైన కాంప్లెక్స్ కడతాడు సుప్రీమ్ యాస్కిన్ (కమల్ హాసన్)

కాంప్లెక్స్ నుంచి గర్భిణీ సుమతి (దీపిక) తప్పించుకుంటుంది. గర్భవతుల నుంచి యాస్కిన్ టీమ్ సేకరించే సీరం ఏంటి?

సుమతిని పట్టుకుంటే భారీ బౌంటీ అనౌన్స్ చేయడంతో కాంప్లెక్స్‌లోకి వెళ్లాలని అనుకునే భైరవ (ప్రభాస్) ఆమె వెంట పడతాడు.

సుమతిని అశ్వత్థామ (అమితాబ్), శంబల మనుషులు (శోభన, పశుపతి అండ్ కో) కాపాడతారు.

సుమతిని భైరవ కాంప్లెక్స్‌కు తీసుకువెళ్లాడా? లేదా? అశ్వత్థామతో ఫైట్ ఏంటి? చివరకు ఏమైంది? అనేది కథ.

ఎలా ఉంది?: లార్జర్ దేన్ లైఫ్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామా 'కల్కి'. కథ కంటే కెమెరా వర్క్ అబ్బురపరుస్తుంది.

ఎలా ఉంది?: లార్జర్ దేన్ లైఫ్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామా 'కల్కి'. కథ కంటే కెమెరా వర్క్ అబ్బురపరుస్తుంది.

ఈ వయసులోనూ అమితాబ్ అదరగొట్టారు. దీపిక సూపర్బ్. కమల్ ఓకే. గెస్ట్ రోల్స్ ఎఫెక్టివ్‌గా లేవు.

ప్రభాస్ స్టైల్, కామెడీ టైమింగ్, బుజ్జితో సీన్స్, అశ్వత్థామతో భైరవ ఫైట్స్, ఆడియన్స్‌కు నచ్చుతాయి.

నాగ్ అశ్విన్ కొత్త ప్రపంచాన్ని సృష్టించాడు. కథను యూనివర్స్ కోసం దాచాడు. క్లైమాక్స్ కేక! మస్ట్ వాచ్.